For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోవే... (‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రివ్యూ )

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  సాధారణంగా రచయితలు...దర్శకులుగా మారుతూ సినిమా చేస్తున్నారంటే దర్శకత్వం అద్బుతంగా లేకపోయినా కథ,కథనం, డైలాగులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందించారని భావిస్తూంటాం. అయితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు..అదేంటో రైటర్లు దర్శకులుగా మారి చేస్తున్న చాలా సినిమాల్లో రచనా విభాగమే చాలా నీరసంగా ఉంటోంది. అందరూ త్రివిక్రమ్ లు ,కొరటాల శివ లు కాలేరు అనేది మరో సారి ఈ సినిమాతో ప్రూవ్ అయిన సత్యం. హిట్లు కొట్టిన హీరో,హీరోయిన్స్ లను తీసుకున్న ఈ సినిమా కథ కూడా గత హిట్ చిత్రాలనుంచి తీసుకోవటంతో రొటీన్ గానే ఉంది. నాగశౌర్య తను మాస్ హీరోనా...క్లాస్ హీరోనా అని ప్రతి క్షణం డౌట్ పడుతూ,ఆలోచనలో పడుతూ చేసినట్లున్నాడు. కెమెరా తప్ప మిగతా కీలక విభాగాలన్నీ సినిమాకు తగినట్లే నాసిరకంగా ఉన్నాయి.

  లక్ష్మీ ఆనంద్ తండ్రి.. సర్వేష్ ఆనందరావు (రావు రమేష్)ఓ బొమ్మరిల్లు తరహా తండ్రి. ఇంట్లో స్ట్రిక్టుగా రూల్స్ అమలు చేస్తూంటాడు. అంతేకాదు తన కూరుతుకి ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తో నిశ్చితార్దం కూడా చేసేస్తాడు. లక్ష్మి కూడా తండ్రి మాట జవదాటే అమ్మాయి కాదు. ఈలోగా...రికామీగా ఇడియట్ లా తిరిగే ..సాయి(నాగ శౌర్య).. తొలి చూపులోనే లక్ష్మీ ఆనంద్ (అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. మరోప్రక్క అతనికి తెలియకుండానే సర్వేష్ ఆనందరావు దృష్టిలో చెడ్డవాడుగా ముద్రపడతాడు. ఇలాంటి పరిస్ధితిల్లో ఆమెని, ఆమె తండ్రిని ఒప్పించి ఎలా లక్ష్మి ని తన ఇంటికి తెచ్చుకున్నాడనేది మిగతా కథ.

  రొమాంటిక్ కామెడీ డిజైన్ రొటీన్ గానే ఉన్నా వాటిని ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ లతో, కొత్త క్యారెక్టరైజేషన్స్ తో నింపి పండిస్తూంటారు. ఇక్కడ అదే కొరవడింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో నడిచిన ఈ చిత్రం మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో కథే పెద్ద మైనస్...మహా నస వ్యవహారమూనూ...రొటీన్ క్యారక్టరైజేషన్స్ కు తోడు...పరమ రొటీన్ స్టోరీ లైన్..ఇవి చాలదన్నట్లు ప్రాసలతో పంచ్ డైలాగులు. అవి హీరో చెప్తూంటే...అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడా కొంచెం కూడా మ్యాచ్ కావు. హీరోయిన్ పాత్ర కు కొంచెం కూడా క్లారిటీ లేదు. దాంతో క్యారికేచర్ లాగ మిగిలిపోయింది. ఆమె క్లైమాక్స్ లో హఠాత్తుగా ...సినిమా ముగిసిపోయిందనో ...మరెందుకో.. హీరో ప్రేమని ఏక్సెప్టు చేస్తోందో...ఎందుకు చివరి వరకూ అలా మెయింటైన్ చేసిందో దర్శక,రచయితకే తెలియాలి.

  అన్నీ మైనస్ లేనా అంటే కొన్ని ప్లస్ లూ ఉన్నాయి...వాటితో కూడిన మిగతా రివ్యూ స్లైడ్ షోలో..

  ప్లస్ పాయింట్లు:

  ప్లస్ పాయింట్లు:

  సాఫ్ట్ వేర్ సుబ్రమణ్యం గా వెన్నెల కిషోర్, దొంగగా సప్తగిరి చేసిన కామెడీ సన్నివేశాలు బాగా పేలాయి. అలాగే కెమెరా వర్క్ చాలా బాగుంది. లొకేషన్స్ ని చాలా బాగా వాడుకుంటూ మంచి లైటింగ్ స్కీమ్స్ తో బాగా చేసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సైతం బాగున్నాయి.

  ఇదీ బాగా పండింది..

  ఇదీ బాగా పండింది..

  ‘రాజా రాణి' సినిమాలోని అమ్మాయిలు రియల్ గా ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్ ని నరేష్ చేత చెప్పించిన ఎపిసోడ్ బాగా నవ్వు తెప్పిస్తుంది.

  చాలా ఇబ్బంది పెట్టింది

  చాలా ఇబ్బంది పెట్టింది

  ఎడిటింగ్ చాలా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. దర్శకుడు చెప్పి చేయించుకున్నారో లేక ఎడిటరే స్వయంగా చేసాడో కానీ అనవసరమైన హంగామా చేసి,డీసెంట్ గా సినిమా చూడనివ్వలేదు. అంతేకాదు ఒక సీన్ నుంచి మరో సీన్ లోకి వెళ్లే ట్రాన్సిక్షన్స్ సైతం సరిగ్గా లేవు. సీన్ అబరప్ట్ గా కట్ చేయటం చాలా చోట్ల జరిగింది. అలాగే స్లోగా నేరేషన్ నడుస్తూంటే స్పీడ్ చేయాల్సింది.

  సంగీతం

  సంగీతం

  పాటలు అద్బుతం కాకపోయినా బాగున్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయి, కొన్ని సీన్స్ ని ఎలివేట్ చెయ్యాల్సింది పోయి డౌన్ చేసేసింది. అంతేకాదు ఆయన పాత సినిమాల సంగీతం గుర్తు చేసింది.

  ఇంకా వర్క్ చేసి రావాల్సింది

  ఇంకా వర్క్ చేసి రావాల్సింది

  ఈ చిత్రం ద్వారా నంద్యాల రవి దర్శకుడు గా పరిచయమయ్యారు. అయితే దర్శకుడు పరిచయం చిత్రం సాధారణంగా విజువల్ గా బాగా తీర్చి దిద్దటానికి ప్రయత్నిస్తారు. ఆ విషయం చాలా వరకూ కెమెరా మెన్ చూసుకున్నా...దర్శకుడు సీన్స్ ని సరిగ్గా ఎలివేట్ చేయలేకపోవటంతో మంచి సీన్స్ అనుకున్నవి కూడా పండలేదు. మరింత గ్రౌండ్ వర్క్ చేయాల్సిందేమో.

  ఎందుకీ ఇమిటేషన్..

  ఎందుకీ ఇమిటేషన్..

  తొలి చిత్రం నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతున్న నాగశౌర్య ఎందుకు ఈ సినిమాలో చాలా సార్లు ఇతర స్టార్ హీరోలను అనుకరించాడో అర్దం కాలేదు. తనకంటూ స్టైల్ ఏర్పాటు చేసుకోవల్సిన సమయంలో ఇలా చేయటం చూసేవారికే కాక, తన కెరీర్ కీ ఇబ్బందే.

  ఫస్టాప్..సెకండాప్

  ఫస్టాప్..సెకండాప్

  వాస్తవానికి సినిమాని ఇలా విభజించి చూడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఫస్టాఫ్ బాగుండటం, సెకండాఫ్ లో కథలో సమస్య స్ధాపించిన తర్వాత డల్ అయ్యిపోయి నేరేషన్ స్లో అయిపోవటంతో ఫస్టాఫ్ బాగుంది..కీలకమైన సెకండాఫ్ బాగోలేదు అని విడిగా చెప్పాల్సి వస్తోంది.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  బ్యానర్: గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌

  నటీనటులు: నాగశౌర్య, అవికాగోర్, షాయాజీషిండే, అలీ, సత్యం రాజేశ్‌, రావు రమేశ్‌, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్‌, శశి తదితరులు

  ఛాయాగ్రహణం: బాలరెడ్డి,

  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కుంపట్ల రాంబాబు,

  సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు,

  కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.

  నిర్మాత: గిరిధర్

  విడుదల తేదీ: డిసెంబర్ 5, 2014.

  అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ చిత్రం... ప్రమోషన్స్ పరంగా కూడా అలాగే డల్ గా ఉండటంతో... భాక్సాఫీస్ వద్ద ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్దకమే. అప్పటికీ ఈ హీరో సినిమాలు కేవలం 'ఎ' సెంటర్లకే పరిమతమవుతున్నాయని దర్శకుడు ప్రతిభావంతంగా గుర్తించి...ఫైట్స్ అవీ పెట్టి బి,సి సెంటర్లలోనూ ఆడిద్దామనుకున్నాడు కానీ...అది ఉభయ భ్రష్టత్వమయ్యిందేమో అనిపిస్తోంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Naga Shaurya, Avika Gor starred Lakshmi Raave Maa Intiki is released today with divide talk. Writer Nandyala Ravi is making his directorial debut with LRMI . 'Lakshmi Raave...' is the third outing for Naga Shaurya after Oohalu Gusa Gusalade and Dikkulu Choodaku Ramayya and second release for Avika post Uyyala Jampala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X