»   » మనస్సుతో చూసేవారికే... (నీహారిక 'ఒక మనసు' రివ్యూ)

మనస్సుతో చూసేవారికే... (నీహారిక 'ఒక మనసు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

'జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?' పాతాళభైరవిలోని ఈ డైలాగు... ఎప్పుడు ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద క్వచ్చినే. తమకు తోచింది తీసుకుంటూ పోతే హిట్స్ వస్తాయా ...లేక జనాలకు నచ్చేవి కూర్చుకుంటూ తీస్తే హిట్స్ వస్తాయా. చాలా మంది దర్శకులు రెండో ఫంధాను ఎంచుకుంటున్నారు. కానీ దర్శకుడు రామరాజు మాత్రం తనకు నచ్చిందే జనం చూడవలెనని సినిమాలు తీస్తున్నారు.


తొలి చిత్రం మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఇప్పుడు ఒక మనస్సు అంటూ సినిమాలు తీసి, మైండ్ తో చూడకుండా మనస్సుతోనే సినిమా చూడమంటూ మన ముందుకు వచ్చాడు. అయితే ఎక్కువగా లవ్ స్టోరీ అంటే హీరో, హీరోయిన్, వాళ్లను విడితీసే విలన్, ఆ విలన్ తో ఆడుకునే మైండ్ గేమ్ అనే స్కీమ్ కు అలవాటు పడిన వారికి ఈ సినిమా డైజస్ట్ అవటం కష్టమే. అయితే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ డైలాగులా..కొత్తదనం పోవాలంటే ఇలాంటి సినిమాలకు అలవాటు పడాలేమో.


Also See: మెగా ఫ్యాన్స్‌తో నిహారిక మీటింగ్, ఏం చెప్పింది?


కథలోకి వస్తే....పొలిటీషన్ అవ్వాలనే కోరిక ఉన్న సూర్య (నాగశౌర్య) విజయనగరం గవర్నమెంట్ హాస్పటిల్ లో హౌస్ సర్జన్ గా చేస్తున్న సంధ్య (నీహారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతనితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంది. ప్రేమ డైలాగులు చెప్పుకుంటూ సాగిపోతున్న ఇద్దరి ప్రేమ కథ ఓ కొలిక్కి వస్తుందనగా సూర్య తను రాజకీయంగా ఎదగటానికి డబ్బు అవసరమై చేసిన ఓ సెటిల్ మెంట్ తో జైలుకు వెళతాడు. తర్వాత బెయిల్ మీద వచ్చిన అతనికి తన ప్రేమను వదులుకుంటేనే కేసు నుంచి బయిటపడి, పొలిటీషన్ గా సెటిలయ్యే ఆప్షన్ ఎదురౌతుంది. అటువంటి స్దితిలో సూర్య ఏం చేసాడు..సంధ్య ఏమంది..చివరకి ఈ లవ్ స్టోరీ ఏ ముగింపుకు చేరుకుంది అనేది మిగతా కథ.


ఫోటో గ్యాలరీ : ఒక మనసు వాల్ పేపర్స్


సాధారణంగా మసాలా కలపకుండా...ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ప్యూర్ గా తెరకెక్కించటం, దాన్ని జనరంజకంగా జనాల్లోకి తీసుకు వెళ్లటం చాలా కష్టం. అందుకే చాలా మంది మన దర్శకులు అటువంటి చిత్రాలు జోలికి పోవటం లేదు. అయితే దర్శకుడు రామరాజు అదే పంధాను ఎంచుకున్నారు.


అయితే ఫస్టాఫ్ మొత్తం చెప్పిందే డైలాగే తిప్పి తిప్పి చెప్పిస్తూ కథ ఎక్కడికీ కదలకుండా కాలహరణం చేసారు. సెకండాఫ్ లో అయితే దర్శకుడు కథ,కథనాలు పరుగెట్టిస్తాడు అనుకుంటే అదీ నిరాశ ఎదురైంది. అయితే నీట్ గా ఎక్కడా వల్గరిటీ లేకుండా ప్రేమ కథ చెప్పే ప్రయత్నం చేసాడు. కథలో నమ్మకం ద్రోహం చేసిన ఓ నెగిటివ్ పాత్ర ..దానికి బుద్ది చెప్పే కార్యక్రమాలు పెట్టుకుంటే రొటీన్ అయిపోతుందనుకున్నాడేమో వదిలేసాడు.


మిగతా రివ్యూ స్లైడ్ షో లో ...


కాంప్లిక్ట్ ఉంది కానీ...

కాంప్లిక్ట్ ఉంది కానీ...

కథలో హీరోకు సమస్య, గోల్ రెండూ ఉన్నాయి కానీ దర్శకుడు మాత్రం ఆ రెండింటిని తను అనుకున్న క్లైమాక్స్ కోసం బలిపెట్టేసాడు.క్లైమాక్స్ ట్విస్ట్

క్లైమాక్స్ ట్విస్ట్

సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మాత్రం మనం ఊహింటం అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్పోలికే లేదు

పోలికే లేదు

టీవి తెరపై కనిపించిన అల్లరి చేసే నీహారిక కు ఈ సినిమాలో కనిపించిన నీహారకకు అసలు పోలికే లేదు. బాగా మెచ్యూర్డ్ క్యారక్టర్ గా ఆమెను మలవటం కాకుండా చీరలు కట్టించి మరీ పెద్ద దాన్ని చేసారు.


నాగశౌర్య

నాగశౌర్య

ఈ కాలం యూత్ ని రిప్రజెంట్ చేసే పాత్రలు చేస్తూ వస్తున్న నాగశౌర్య.. ఈ సినిమాలో మాత్రం ఆ జోష్ ని వదిలేసి పూర్తి సీరియస్ క్యారక్టరైజేషన్ తో డిఫెరెంట్ గా కనిపించి మెప్పించాడు.


ప్లస్ అయ్యారు

ప్లస్ అయ్యారు

కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావు రమేష్, చిన్న పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు.బాగుండేదేమో

బాగుండేదేమో

దర్శకుడు ఫన్ మీద చిన్న చూపు ఉందేమో.. ఈ సినిమా లో ఎక్కడా ఆ ఛాయలు కనపడనివ్వలేదు. సెకండాఫ్ లో ఇక తప్పదనుకుని వెన్నెల కిషోర్ పాత్ర పెట్టి కాస్త కామెడీ చేసే ప్రయత్నం చేసారు. అదీ క్లాస్ గా.. మరీ ఇంత డ్రై గా నడపకుండా కాస్తంత అక్కడక్కడా వినోదం కూడా కలిపితే బాగుండేదేమో..


నిర్మాణ విలువలు, దర్శకత్వ పనితనం

నిర్మాణ విలువలు, దర్శకత్వ పనితనం

మొదటి నుంచి చివరి దాకా దర్శకుడు తాను పొయిటిక్ గా తెరపై కథ చెప్తున్నాను అనుకుని, అవే షాట్స్, అవే డైలాగ్స్, అవే సీన్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దాంతో కథ కదిలినట్లు అనిపించదు. నిర్మాణ విలువలు విషయానికి వస్తే అద్బుతం అని చెప్పలేం కానీ ఈ సినిమాకు సరపడేవి అన్ని సమకూర్చినట్లున్నారు.


టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి ఓకే అనిపిస్తే..ఎడిటింగ్ దగ్గరుండి డైరక్టర్ అంత స్లో నేరేషన్ గా నడపాలని చేసినట్లు అర్దమవుతుంది. ,సునీల్ కాశ్యప్ అందించిన సంగీతం చాలా చోట్ల జోలపాడుతున్నట్లుగా అనిపించిందంటే అతిశయోక్తి కాదు.డైలాగ్స్, స్క్రీన్ ప్లే

డైలాగ్స్, స్క్రీన్ ప్లే

థ కదలకుండా డైలాగ్స్ రాయటం చాలా చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే జరిగిన కంటెంట్ గురించి చెప్పేసిన విషయాన్నే పదే పదే, కొత్త పదాలతో చెప్పాలి. ఈ విషయంలో డైలాగు రైటర్ బాగా కష్టపడినట్లున్నారు. ఇంత స్లోగా నడవాలని దర్శకుడు ముందే ఫిక్స్ అయ్యాడు కాబట్టి కథనం కూడా అలాగే రాసుకున్నారు.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్ : మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ , టివి9 సమర్పణ
నటినటులు : నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం : సునీల్ కశ్యప్
డైలాగ్స్- సతీష్ రెడ్డి,
ఛాయాగ్రహణం : రాంరెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామరాజు
విడుదల తేదీ : 24-06-2016ఫైనల్ గా ఈ సినిమాని ఖచ్చితంగా ఓ వర్గానికి (మల్టిఫ్లెక్స్ లను) టార్గెట్ చేసి డిజైన్ చేసినట్లు మనకు మొదటి షాట్ నుంచే అర్దమవుతూంటుంది. ఇక పొయిటిక్ టచ్ ఉన్న సినిమాలు, విభిన్నమైన సినిమాలు చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అలాగే ఎక్కడా అసభ్యత, అశ్లీలం లేదు కాబట్టి ఫ్యామిలీలకు, గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లాలనుకునేవారికి కూడా ఇది ఓ ఆప్షనే.

English summary
Oka Manasu starring Naga Shaurya and Mega Princess Niharika Konidela opened to mixed responses and the talk from audience is surprisingly negative.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu