»   » ప్రశ్నించాడు కానీ... ( ‘ప్రతినిధి’ రివ్యూ)

ప్రశ్నించాడు కానీ... ( ‘ప్రతినిధి’ రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.0/5
  కుళ్లు రాజకీయాలను,అందులో మునిగి తేలుతున్న తాము ఎన్నుకున్న నాయకులును కసిదీరా కడిగెయ్యాలని అందరికీ ఉంటుంది. అయితే సామాన్యుడుకి అంత అవకాసం ఉండదు. అలాంటప్పుడు తమలాంటి సామాన్యుడుకి ప్రతినిధిగా హీరో...తాము చేయలేకపోతున్న పనిని తెరపై చేస్తున్నప్పుడు ఆనందమేస్తుంది. సరిగ్గా అలాంటి కాన్సెప్టుతోనే 'ప్రతినిధి' వచ్చాడు. అయితే తాము ఎన్నుకున్న సన్నటి స్టోరీ లైన్ కు గ్రిప్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే తయారుచేసుకోకపోవటంతో తెరపై పెద్దగా సంఘటనలు జరిగినట్లు అనిపించక, ఒకే సంఘటనను తెరపై చాలా సేపు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అయితే డైలాగులతో, కోట వంటి ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ తో దాన్ని దాటే ప్రయత్నం చేసారు. అలాగే కామెడీ అనేది అసలు ఎక్కడా లేదు. దాంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ సీజనల్ చిత్రంగా చూస్తే నచ్చుతుంది.

  అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు. మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

  తెలుగులో ఇలా సింగిల్ పాయింట్ చుట్టూ అల్లబడే కథలు తక్కువనే చెప్పాలి. కేవలం కిడ్నాప్ ఎందుకు జరిగింది...దాని మోటివ్ ఏమిటి...చివరకు ఏమైంది అనే సింగిల్ ఎజెండా కలిగిన ఎలిమెంట్ తో రెండు గంటలకు పైగా కథ తయారు చేసారు.ఇలాంటి కథలకు కథనం తయారు చేసుకోవటం కష్టమే. ముఖ్యంగా ఎంతో సెక్యూరిటీతో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఈజీగా కిడ్నాప్ చేయవచ్చా అనే డౌట్ ప్రేక్షకుడుకి రాకుండా సీన్స్ తయారు చేయగలగాలి. ఈ విషయంలో కొంతవరకూ మాత్రమే విజయం సాధించారు. హాస్య రస ప్రధానంగా సాగే సినిమాలో అయితే ముఖ్యమంత్రి కిడ్నాప్ అన్నా, ప్రక్క దేశం ప్రధానమంత్రిని చంపారన్నా చెల్లిపోయేదేమో కానీ, సహజత్వానికి దగ్గరగా ఉండేలా సమాజంలో సామాన్యులు ఎదుర్కొనే కొన్ని సమస్యలను ఎక్సప్లోర్ చేస్తూ చేసిన చిత్రం కావటంతో కిడ్నాప్ డ్రామా నమ్మబుద్ది కాదు.

  Nara Rohit's Pratinidhi Movie review

  అలాగే సినిమా ప్రారభం నుంచి చివరి దాకా హీరో ఎక్కడా డీప్ గా సమస్యలో పడినట్లు కనపడడు. అంటే ఓ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయటం వల్ల అతనికి వచ్చే సమస్యలు అసలు కనపడవు. దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారింది. సర్లే ఇవన్ని ప్రక్కన పెడితే తెలుగు సినిమా కాబట్టి తప్పదు అనుకుని పెట్టినట్లున్న రొమాంటిక్ ట్రాక్ మాత్రం విసుగెత్తించింది. అలాగే ఇంత సీరియస్ డ్రామాలో ఎంటర్టైన్మెంట్ ఇమడదు అనుకున్నారో ఏమో కానీ కామెడీకి స్కోప్ లేదు. సీరియస్ గా మొదటి నుంచీ చివరి వరకూ సమస్యలు...సమస్యలు అంటూ సాగింది. కానీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా పండాయి. డైలాగ్స్ సైతం చాలా చోట్ల విజిల్స్ వేయించాయి. సినిమాలో హైలెట్స్ లో చెప్పుకోవాల్సింది ఈ విషయాన్నే. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా పండింది.

  నటీనటుల్లో కోట శ్రీనివాసరావు ఈ సినిమాకి ప్రాణం పోసాడనే చెప్పాలి. ఇక నారా రోహిత్ సైతం తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. హీరోయిజం, బిల్డప్ లు అంటూ వెళ్లకుండా ఇలాంటి సాధారణైన పౌరుడు కథ లో ఇమిడిపోయి చేసినందుకు అభినందించాలి. హీరోయిన్ గా సుబ్ర అయ్యప్ప సినిమాకు మైనస్ అయ్యింది. కథలోనే ఆమెకు ఏమీలేదు అనుకుంటే ఆమె నటనలోనూ ఏమీలేదు అని తెలియచేసింది. అలాగే సినిమా లెంగ్త్ తక్కువగా ఉండటం కూడా బాగా కలిసి వచ్చింది. ఆ రొమాంటిక్ ట్రాక్ తీసేస్తే ఇంకాస్త రిలీఫ్ ఫీలయ్యే అవకాసం ఉంది.

  Nara Rohit's Pratinidhi Movie review

  సాంకేతికంగా కెమెరా,ఎడిటింగ్ యావరేజ్ గా ఉన్నాయి. దర్శకుడు కూడా పెద్దగా కష్టపడి హోం వర్క్ చేసి సినిమా చేసినట్లు అనిపించదు. టెన్షన్ బిల్డప్ కావాల్సిన సీన్స్ , రొమాంటిక్ సీన్స్ చాలా డల్ గా డీల్ చేసాడు.

  ఫైనల్ గా ఈ చిత్రం రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారికి, సామాజిక చైతన్యం ఉండాలనుకునేవారికి నచ్చుతుంది. కామెడీ,పాటలు వంటి అంశాలు కలిగిన కమర్షియల్ చూద్దాం, ఎంజాయ్ చేద్దా అనుకుంటే వారికి నచ్చే అవకాసం తక్కువ. ఎలక్షన్ సీజన్ ని ఈ చిత్రం ఎంతవరకూ క్యాష్ చేసుకుంటుంది అనేది చూడాలి.

  బ్యానర్ :సుధామూవీస్‌ పతాకం
  నటీనటులు :నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్‌ తదితరులు
  కథ,మాటలు:ఆనంద్ రవి
  కెమెరా: చిట్టిబాబు,
  సంగీతం : సాయికార్తీక్‌
  ఎడిటింగ్‌: నందమూరి హరి.
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ మండవ
  సమర్పణ: గుమ్మడి రవీంద్రబాబు
  నిర్మాత: జె.సాంబశివరావు

  English summary
  Pratinidhi is the latest movie of Nara Rohit released today with divide talk. The movie is about a youth who questions the selfish politics. This is directed by Prashanth and Subhra Ayyappa played the female lead role. Pratinidhi is releasing today adding to the heat of elections in the state.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more