twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది రాంగై పోయింది లేరా...(‘రాజా చెయ్యివేస్తే’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    హీరో హైలెట్ కావాలంటే విలన్ ని మరింత హైలెట్ చేయాలి నిజమే..అలా చేసి చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా...అయితే కేవలం విలన్ నే హైలెట్ చేయటం కోసం హీరోని డమ్మీని చేసేస్తే...అది రాజా చెయ్యవేస్తే అవుతుంది.

    ఏ మేరకు విలన్ ని హైలెట్ చేసి...ఎక్కడ నుంచి ఆ విలన్ ని హీరో పడకొడతాడు....అతన్ని దాటి హీరో అనిపించుకుంటాడు అనే విషయం తెలియటం మీదే సినిమా హిట్ అధారపడుతుంది. అదే లోపించింది. ఈ సినిమా చూస్తూంటే అప్పుడెప్పుడో వచ్చి డిజాస్టర్ అయిన మణిరత్నం...రావణ్ సినిమా గుర్తుకు వస్తుంది.విలన్ విశ్వరూపం తప్ప..హీరో అసలు రూపం కూడా కనపడకుండా పోయింది. అలా ఎలా జరిగింది...అసలు కథేంటి..ఎక్కడుంది లోపం.. అంటే..

    సినిమా డైరక్టర్ అవటమే జీవితాశయంగా పెట్టుకుని ఓ యాక్షన్ స్టోరీ పట్టుకుని తిరుగుతూంటాడు...రాజారామ్‌ (నారా రోహిత్‌). శతృవుని శారీరిక బలంతోకాదు తలలో ఉన్న తెలివితేటలతో కొట్టాలనుకునే అతని తెలివితేటలు అతని మాటల్లో కథల్లో తొంగిచూస్తూంటాయి. అతనికి ఓ అమ్మాయి చైత్ర(ఇషాతల్వార్‌)తో లవ్ స్టోరీ ఉంటుంది.

    Nara Rohit's Raja Cheyyi Vesthe review

    మరో ప్రక్క విజయ్‌ మాణిక్‌ (తారకరత్న) తనకు ఎవరు అడ్డొచ్చినా నిరభ్యంతరంగా, నిర్వికారంగా చంపేసే మనస్తత్వం ఉన్నవాడు. తప్పు చేయమని నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని అమ్మ చెప్పలేదు... నాకు తోచిందే చేసుకొంటూ వెళ్తుంటే జనం దాన్నే తప్పు అంటారు అని ఫీలవుతూంటాడు‌.

    ఇదిలా ఉంటే...రాజారామ్ స్క్రిప్టు రాసే తెలివి తేటలు చూసి..మాణిక్ చేతిలో దెబ్బతిన్న ఒకరు... అతనిచేత..మాణిక్ ని చంపాయని స్కెచ్ వేస్తారు. అందుకు అతన్ని ఆయుధంగా వాడుకోవాలనుకుంటారు.

    అప్పుడు రాజారామ్ ఏం చేసాడు...అతనికి తను ఓ స్కెచ్ ఇరుక్కున్నానని రాజారామ్ కు ఎప్పుడు తెలిసింది...అతను చంపాడు...అసలు మాణిక్ ని చంపాలనుకున్నది ఎవరు, చైత్రతో రాజారామ్ లవ్ స్టోరీ ఏమైంది... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    నిజానికి ఈ కథ...రాజారామ్ అనే పేరు పెట్టే రోజులు నాటిదే. ఎప్పటినుంచో ఇదే స్టోరీలైన్ తో కథలు వస్తున్నాయి. అయితే అదే స్టోరీ లైన్ అని తెలియకుండా దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చెయ్యాలనకున్నాడు..కాని అందుకు తగ్గట్లు కథలో లాజిక్ లు పోగుచేసుకోలేకపోయాడు.

    Nara Rohit's Raja Cheyyi Vesthe review

    కథలో హీరో ..వేరే వారు మెయిల్ లో చెప్పినట్లు చేయటమేంటి, ఎక్కడా అవతలి వ్యక్తిని చూడకుండా బ్లాక్ మెయిల్ కు లొంగటమేంటి..అతని వ్యక్తిత్వం ఏమైపోయింది వంటి విషయాలు మర్చిపోయి కథనం నడిపేసాడు.

    దానికితగినట్లే ఫస్టాఫ్ లో అస్సలేమి జరగదు.సెకండాఫ్ లో జరగటానికి ఏమీ లేదు అన్నట్లు కథ,కథనం ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు కథలో ఎన్నో ట్విస్ట్ లు రాసుకున్నాడు కానీ , వాటిని థ్రిల్లింగ్ గా తెరపైకి ఎక్కించలేకపోయాడు.

    హీరో ఏమిటా ఇంత తింగరిగా ఎదుటివాడు స్కెచ్ లో ఇరుక్కుపోతున్నాడు అనిపిస్తూంటుంది. అతని తెలివి అంతా ఏమైపోయింది అనే డౌట్ వస్తుంది. అసలు మనం హీరో కథ చూస్తున్నామా..యాంటి హీరో కథని చూస్తున్నామా అనే డౌట్ కూడా వస్తుంది.

    నారా రోహిత్ ...తన పాత్రకు తగినట్లు చేసాడు కానీ ..కాస్త ఒళ్లు తగ్గించుకుంటే బాగుండేది అని అనిపించకమానదు. విలన్ గా తారకరత్న అదరకొట్టాడనే చెప్పాలి. అలాగే సపోర్టింగ్ పాత్రలో కనిపించిన జోష్ రవి ఉన్నంతలో బాగా ప్లస్ అయ్యాడు. విలన్ ని ఎదుర్కొనే సీన్ లో విజిల్స్ వేయించుకున్నాడు.హీరోయిన్ మాత్రం అలా నెట్టుకుంటూ వెల్లిపోయింది కానీ తన ముద్ర వేయిలేకపోయింది.

    Nara Rohit's Raja Cheyyi Vesthe review

    హైలెట్స్ గా... స్మశానంలో ఫైట్, చర్చిలో రెండు మూడు కామెడీ సీన్లు తప్ప హర్షించే అంశాలు ఏమీ లేవు.

    టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగుంది. పాటలు ఓకే, ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేస్తే ఇంకా బాగుండేది. మాటలు ..కొన్ని చోట్ల బాగానే పేలాయి. దర్శకుడు ...స్క్రిప్టు విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ ఇవ్వగలడు అని అనిపిస్తుంది.

    బ్యానర్: వారాహి చలన చిత్రం
    నటీనటులు: నారా రోహిత్‌, ఇషా తల్వార్‌, తారకరత్న, శివాజీ రాజా తదితరులు
    సంగీతం: సాయికార్తీక్‌,
    ఛాయాగ్రహణం: భాస్కర్‌ సామల,
    మాటలు: శంకర్‌,
    నిర్మాణం: సాయి కొర్రపాటి,
    దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి.
    పతాకం: వారాహి చలన చిత్రం
    విడుదల: 29 ఏప్రిల్‌ 2016

    ఫైనల్ గా హీరోగా వెనకబడ్డ తారకరత్నకు..రీఎంట్రీ ఇస్తూ...విలన్ గా ఎస్టాబ్లిష్ చేయటానికి తీసిన షో రోల్ లాగ ఉన్న ఈ చిత్రం దర్శకుడు ఏదో అనుకుని, ఏదేదో చేయబోయి..అదేదో అయినట్లు అనిపిస్తుంది.

    English summary
    Nara Rohit's Raja Cheyyi Vesthe movie released today with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X