twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవాబ్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.5/5
    Star Cast: అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్
    Director: మణిరత్నం

    భారతీయ సినిమా పరిశ్రమ గర్వించే దగిన దర్శకుడు మణిరత్నం. ఆయన రూపొందించిన చెలియా లాంటి చిత్రాలు ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయాయి. దాంతో మణిరత్నం దర్శక ప్రతిభపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నవాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో మల్టీస్టారర్‌గా ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, అదితి రావు హైదరీ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మణిరత్నం పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నా.. ఆయన్ని చూడడమే అదృష్టం అనుకుంటే!ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నా.. ఆయన్ని చూడడమే అదృష్టం అనుకుంటే!

    నవాబ్ కథ

    నవాబ్ కథ

    ఫ్యాక్షన్, రియల్ ఎస్టేట్ దందా నుంచి రాజకీయ నాయకుడైన భూపతిరెడ్డి (ప్రకాశ్ రాజ్), ఆయన సతీమణి (జయసుధ)పై హత్యాప్రయత్నం జరుగుతుంది. తండ్రిపై హత్యా ప్రయత్నం జరిగడంతో కుమారులు వరద (అరవింద స్వామి), బాల త్యాగరాజు ( అరుణ్ విజయ్), రుద్ర (శింబు) షాక్ అవుతారు. తన తండ్రిపై చిన్నప్ప (త్యాగరాజన్) వర్గమే హత్య ప్రయత్నం చేసిందని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకొంటుంది. ఆస్తి, అధికారం కోసం ముగ్గురి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. ఈ క్రమంలో భూపతిరెడ్డి గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయంలో రుద్ర భార్య ఛాయ సెర్బియా హత్యకు గురవుతుంది. బాల త్యాగరాజు భార్య దుబాయ్‌లో డగ్ర్ కేసులో అరెస్ట్ అవుతుంది.

     నవాబ్‌లో స్టోరీలో ట్విస్టులు

    నవాబ్‌లో స్టోరీలో ట్విస్టులు

    భూపతి రెడ్డి కుటుంబంలో జరిగిన అనేక సంఘటనలకు కారణం ఎవరు? చిన్నప్ప గౌడ్ వర్గమేనా ఈ చర్యలకు పాల్పడింది? ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు పై చేయి సాధించారు? ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వల్ల ఏం జరిగింది. ఈ కుటుంబ కలహాల్లో వరద ప్రాణ స్నేహితుడు రసూల్ (విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి? వరద ప్రియురాలు (అదితిరావు హైదరీ) పాత్ర ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే నవాబ్ సినిమా కథ.

    ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    భూపతి రెడ్డి దంపతులపై ఎటాక్‌తో సినిమా నేరుగా వెళ్లిపోతుంది. సందర్భోచితంగా సుత్తి లేకుండా సూటిగా చకచకా పాత్రల పరిచయం జరిగిపోతుంది. పాత్రలో పరిచయంతోనే ఓ ఇంటెన్సిటీని చూపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. ప్రకాశ్ రాజ్, జయసుధ భావోద్వేగమైన నటన, వరద దూకుడుతనం, శింబు, అరుణ్ విజయ్ విలక్షణమై నటన సినిమాను పరుగులు పెడుతుంది. తండ్రి మరణించినా కొడుకులు అంత్యక్రియలు హాజరకాకపోవడమనే అంశం ఉద్వేగానికి గురిచేస్తుంది. అదితిరావు గ్లామర్ తోడవ్వడంతో ఎమోషనల్ సీన్ల మధ్య సినిమా వేగంగా ఇంటర్వెల్ చేరుకొంటుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య ఆస్తులపై, అధికారంపై ఆధిపత్య పోరును మణిరత్నం తనదైన శైలిలో చూపించారు. శింబు, అరుణ్ విజయ్, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితిరావు, జయసుధ పాత్రల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు కట్టిపడేస్తాయి. కుటుంబ కలహాలు ప్రధాన అంశం కావడం కొంత అసంతృప్తిని కలుగజేసినా.. చక్కని స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలు తెరపైన రక్తి కట్టిస్తాయి.

     మణిరత్నం మ్యాజిక్

    మణిరత్నం మ్యాజిక్

    దర్శకుడిగా మణిరత్నం మరోసారి పాత్రల చిత్రీకరణ, స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు. భావోద్వేగ అంశాలపైనే ఆధార పడటం, అలాగే పాత్రల మధ్య సమతూల్యం పాటించడంలో మణిరత్నం సఫలమయ్యాడు. ప్రకాశ్ రాజ్ మరణించిన సమయంలో కొడుకులు అంత్యక్రియలకు రాకుండా సృష్టించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. నేపాల్ ఎపిసోడ్, చివర్లో కడప సన్నివేశాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి.

    పవర్ ఫుల్ పాత్రలో అరవింద్ స్వామి

    పవర్ ఫుల్ పాత్రలో అరవింద్ స్వామి

    అందాల నటుడు అరవింద్ స్వామి మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మెరిసాడు. కఠినమైన మనస్తత్వం ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. అధికారం, ఆస్తి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో అరవింద్ స్వామి కొత్త కోణంలో నటనను ఆవిష్కరించాడు. భార్య చిత్ర (జ్యోతిక) చనిపోయే సన్నివేశంలో ఆయన నటన హైలెట్. అలాగే తండ్రి చాటును తన జీవితం చీకటిగా మిగిలిందని చెప్పే సీన్లు ఆయన నటనలోని ఇంటెన్సిటీని తెలియజేశాయి.

    శింబు ఫెర్మార్మెన్స్

    శింబు ఫెర్మార్మెన్స్

    నవాబ్‌ చిత్రంలో శింబు తన బాడీ లాగ్వేంజ్‌కు సరిపడే పాత్రలో జీవించాడు. సెర్బియాలో ఆయుధాల అక్రమ వ్యాపారిగా విలక్షణమైన నటనను చూపించారు. తండ్రి, తల్లి ప్రేమకు దూరమైన కొడుకుగా భావోద్వేగతను పండించాడు. క్లైమాక్స్‌లో తనదైన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు.

    అరుణ్ విజయ్ ఫెర్ఫార్మెన్స్

    అరుణ్ విజయ్ ఫెర్ఫార్మెన్స్

    అధికారం, డబ్బు, హోదా మాయలో పడిన పాత్రలో అరుణ్ విజయ్ ఆకట్టుకొన్నాడు. దుబాయ్‌లో పారిశ్రామిక వేత్తగా సరికొత్త పాత్రలో కనిపించాడు. కుటుంబంలో తనకు జరుగుతున్న అన్యాయానికి బదులు తీర్చుకొనే పాత్రలో రాణించాడు. పాజిటివ్ అంశాలతోపాటు నెగిటివ్ అంశాలను తన నటన ద్వారా చూపించాడు.

     విజయ్ సేతుపతి నటన

    విజయ్ సేతుపతి నటన

    నవాబ్‌లో రసూల్‌గా విజయ్ సేతుపతి పాత్ర వెన్నుముక లాంటింది. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. సినిమా అంతా తన చుట్టూ తిరగడంతో ఆ బాధ్యతను సమర్ధవంతంగా పోషించాడు. మణిరత్నం చేయాలనుకొన్న మ్యాజిక్‌ను తెర మీద ప్రదర్శించడంలో విజయ్ సేతుపతికి హ్యాట్సఫ్ చెప్పవచ్చు.

    జ్యోతిక, అదితి, జయసుధ పాత్రలు

    జ్యోతిక, అదితి, జయసుధ పాత్రలు

    నవాబ్ చిత్రంలో జ్యోతిక ఇంటెన్సీవ్ పాత్రలో కనిపించింది. ఇంట్లో జరిగే కలహాలు ఎదుర్కోవడంలో వ్యూహరచన. అలాగే భర్త ప్రియురాలితో ఉండటం, అలాగే కుటుంబంపై దాడులు జరిగే తీరుతో ఊరి విడిచి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. ఇక అదితిరావు హైదరీ ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకొన్నది. అందాల ఆరబోతతో గ్లామర్ లేని లోటును తీర్చింది. జయసుధ పాత్ర కూడా కీలకమే. కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ తట్టుకొనే తల్లిగా కొన్ని సన్నివేశాల్లో జీవించింది.

     ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

    ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

    అద్యంతం ఎమోషనల్ కంటెంట్‌తో సాగిపోయే సన్నివేశాలకు ఏఆర్ రెహ్మాన్ తన రీరికార్డింగ్‌తో ప్రాణం పోశారు. ‘భగ భగ భూమి' అనే పాట సందర్భోచితంగా రోమాలు నిక్కపొడిచే విధంగా ఉంటుంది. ఆ పాట మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌గా ప్రేక్షకుడిని వెంటాడుతుంది. రెండు పాటలకే పరిమితమైనప్పటికీ.. పాటలు ఎక్కువగా లేవనే లోటు కనిపించదు.

    సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి

    సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి

    నవాబ్ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి ప్రాణంగా చెప్పవచ్చు. సెర్బియా, దుబాయ్, క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఛేజింగ్ సీన్లు, అందమైన లోకేషన్లను కెమెరాలో అద్బుతంగా బంధించాడు. అదితి రావు హైదరీ, డయానా అందాలను ఫ్రెష్‌గా ఉండేలా చూపించాడు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఎమోషనల్‌తోపాటు పవర్ ఫుల్ ఫెర్మార్సెన్‌తో కూడిన పాత్రల సంగమం నవాబ్. అచ్చమైన మల్టీస్టారర్ చిత్రానికి ఇది ప్రతీక. తెర మీద నటీనటుల విశ్వరూపం చూపించే సినిమా. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ అనే తేడా లేకుండా మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా మరో క్లాసిక్ అవుతుంది.

     బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్

    • మణిరత్నం దర్శకత్వం
    • నటీనటుల ప్రతిభ
    • సినిమాటోగ్రఫి
    • రెహ్మాన్ మ్యూజిక్
    • మైనస్ పాయింట్స్

      • కామెడీ లేకుండా ఉండటం
      • ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్
      • బలం, బలహీనతలు

        బలం, బలహీనతలు

        తెరముందు, తెర వెనుక
        నటీనటులు: అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, అదితి రావు హైదరీ తదితరులు
        దర్వకత్వం: మణిరత్నం
        నిర్మాణం: లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్
        మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
        సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్
        ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
        రిలీజ్ డేట్: 2018-09-27

    English summary
    Nawab is a crime thriller film co-written and directed by Mani Ratnam. The film features Arvind Swami, Vijay Sethupathi, Jyothika, Silambarasan, Arun Vijay, Aishwarya Rajesh, Dayana Erappa and Aditi Rao Hydari as the ensemble cast, while Prakash Raj, Jayasudha, Thiagarajan and Mansoor Ali Khan appear in pivotal roles. This movie is released on September 27th. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X