For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జోగేంద్ర నచ్చుతాడు (‘నేనే రాజు నేనే మంత్రి’ రివ్యూ )

  By Bojja Kumar
  |

  Rating:
  3.0/5
  Star Cast: రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, నవదీప్, క్యాథరీన్ ట్రెసా, అశుతోష్ రాణా
  Director: తేజ

  రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. గత కొన్ని రోజులుగా ఈ సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ట్రైలర్‌తోనే జనాల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

  Rana Daggubati Gallery ; kajal agarwal Gallery

  రానా తెలుగులో పెద్ద స్టార్ హీరో కాదు, తేజ ఫాంలో ఉన్న స్టార్ డైరెక్టర్ అంతకన్నా కాదు. మరి ఈ సినిమాపై ఎందుకింత హైప్, ఎందుకింత ఆసక్తి? అంటే, అందరి నోటా ఒకే మాట. 'జోగేంద్ర... జోగేంద్ర'. ఆ పాత్ర చేసిన మాయ అలాంటిది మరి. అసలు జోగేంద్ర స్టోరీ ఏమిటి? 'నేనే రాజు నేనే మంత్రి'ని అని విర్రవీగేంత గొప్పపని జోగేంద్ర ఏం చేశాడు? అనేది రివ్యూలో చూద్దాం.

  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  జోగేంద్ర (రానా) న్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక సాధారణ యువకుడు. జోగేంద్ర భార్య రాధ (కాజల్). జోగేంద్రకు తన భార్య అంటే చచ్చేంత ప్రేమ. లేక లేక రాధకు కడుపు పండుతుంది. అయితే గ్రామంలోని గుడి వద్ద దీపం వెలిగించే విషయంలో జరిగిన గొడవలో సర్పంచ్(ప్రదీప్ రాత్) భార్య వల్ల రాధ కింద పడి గర్భం పోగొట్టుకుంటుంది. రాధ కోసం సర్పంచిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జోగేంద్ర హత్యలు, కబ్జాలు ఇలా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని చేయాలో అన్ని చూస్తూ ఎంఎల్ఏ, మంత్రి పదువుల చేపట్టి చివరకు సొంత పార్టీ పెట్టి సీఎం కుర్చీ కోసం పోటీ పడే స్థాయికి వెళతాడు.

  Recommended Video

  Nene Raju Nene Mantri Review
  అది తెరపై చూడాల్సిందే

  అది తెరపై చూడాల్సిందే

  అయితే రాజకీయ కుర్చీలాటలో పడి చివరకు రాధ కూడా ఛీ కొట్టే పరిస్థితి వచ్చిన జోగేంద్ర..... రాజకీయ ప్రత్యర్థులు ఆడిన ఆటలో తన భార్యను పోగొట్టుకుంటాడు. మరి రాధ కోసమే సర్పంచి స్థాయి నుండి సీఎం కుర్చీ వరకు వచ్చిన జోగేంద్ర అపుడు ఏం చేశాడు? ఉరి శిక్ష వరకు జోగేంద్రను తీసుకెళ్లిన పరిస్థితులు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

  రానా విశ్వరూపం

  రానా విశ్వరూపం

  బాహుబలి ముందు వరకు రానా అంటే నటనలో పెర్ఫెక్షన్ లేని సాధారణ నటుడు. అయితే బాహుబలి సినిమా చేసిన అనుభవమో? లేక ఇన్నేళ్ల యాక్టింగ్ ఎక్స్‌పీరియన్సో తెలియదు కానీ.... ‘జోగేంద్ర' పాత్రలో నట విశ్వరూపం చూపాడు. లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, పొలిటికల్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, విలనిజం ప్రదర్శించే సీన్స్.... ఇలా ఏ సీన్ చూసినా రానా పెర్ఫార్మెన్స్ సూపర్బ్.

  కాజల్, కేథరిన్ గ్లామర్

  కాజల్, కేథరిన్ గ్లామర్

  జోగేంద్ర భార్య రాధ పాత్రలో కాజల్ మంచి పెర్పార్మెన్స్ ఇచ్చింది. తెలుగింటి ఆడపడుచులా అందంగా కనిపించింది. హీరోయిన్ కేథరిన్ జర్నలిస్టు పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాటు తన సెక్సీ ఆల్ట్రా గ్లామర్ లుక్ తో ప్రేక్షకుల మతి పోగొట్టింది.

  ఇతర పాత్రల్లో....

  ఇతర పాత్రల్లో....

  మెయిన్ విలన్ పాత్రలో అశుతోష్ రానా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రదీప్ రావత్ , శివాజీ రాజా, అజయ్, తనికెళ్ల భరణి, అజయ్, నవదీప్, పోసాని, ప్రభాస్ శీను, బిత్తిరి సత్తి తమ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

  మ్యూజిక్, సినిమాగ్రఫీ

  మ్యూజిక్, సినిమాగ్రఫీ

  అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాగ్రౌడ్ స్కోర్ కథకు తగిన విధంగా, స్క్రీన్ ప్లేను మరింత ఎలివేట్ చేసే విధంగా బావుంది. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ గుడ్. కోట గిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. సురేష్ ప్రొడక్షన్స్-బ్లూ ప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.

  తేజ బాగా హ్యాండిల్ చేశాడు

  తేజ బాగా హ్యాండిల్ చేశాడు

  చాలా కాలంగా అసలు ఫాంలో లేని తేజ.... కాస్త గ్యాప్ తీసుకున్నా అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తేజ రాసుకున్న కథలో కొత్తదనం లేక పోయినా, సినిమాను నడిపించే తీరు గొప్పగా లేక పోయినా.... ఆ లోపాలన్నింటినీ జోగేంద్ర పాత్రను హ్యాండిల్ చేసిన తీరుతో పూడ్చేశాడు. రానా నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.

  పొలిటికల్ సెటైర్స్

  పొలిటికల్ సెటైర్స్

  పొలిటికల్ సిస్టం ఎలా ఉంది.... రాజకీయాలు ఎలా తయారయ్యాయి.... కుర్చీలాటలో పడి మన లీడర్స్ ఎలాంటి దారుణాలకు, నీచాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని తేజ కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాలు, ఎవరైనా చనిపోతే ప్రజలు వారి కుటుంబ సభ్యులను సింపతీతో గెలిపించే పరిణామాలపై, డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు, పార్టీ పిరాయింపు రాజకీయాలు ఇలా దేన్నీ వదలకుండా సెటైర్స్ వేస్తూనే, వారు కన్విన్స్ అయ్యేలా సీన్లు పండించాడు.

  ప్లస్ పాయింట్

  ప్లస్ పాయింట్

  జోగేంద్ర పాత్రలో రానా పెర్ఫార్మెన్స్

  హీరోయిన్ కాజల్, కేథరిన్ గ్లామర్
  సంగీతం, సినిమాటోగ్రఫీ
  ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్

  మైనస్ పాయింట్స్

  మైనస్ పాయింట్స్

  రోటీన్ పొలిటికల్ డ్రామా

  కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడం
  సెకండాఫ్ లో ఓవర్ డోస్ సెంటిమెంట్

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  నేనే రాజు నేనే మంత్రి అన్ని వర్గాలకు నచ్చుతుందో? లేదో? తెలియదు. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ‘జోగేంద్ర' పాత్రలో రానా దగ్గుబాటి నచ్చుతాడు.

  English summary
  Nene Raju Nene Mantri is Telugu political thriller film written and directed by Teja, featuring Rana Daggubati, Kajal Aggarwal and Catherine Tresa in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X