twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను - సమీక్ష

    By Staff
    |

    Nenu
    చిత్రం: నేను
    నటీనటులు: నరేష్‌, అభిషేక్‌, వేద, చలపతిరావు, బెనర్జీ, తదితరులు
    సంగీతం: విద్యాసాగర్‌
    నిర్మాత: ముళ్ళపూడి బ్రహ్మనందం
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు

    తమిళ యువ దర్శకుడు సెల్వరాఘవన్‌ రూపొందించిన 'కాదల్‌ కొండేన్‌'ను తెలుగులో నరేష్‌తో రూపొందించిన ఈ 'నేను' చిత్రం ..కథాపరంగా బాగుంది, కానీ మొత్తంగా చూస్తే సాధారణంగానే అన్పిస్తుంది. ప్రథమార్థం అంతా ఇటీవల వస్తోన్న సాధారణ కాలేజ్‌ చిత్రాల మాదిరిగానే సాగుతుంది... ఇక మనం బోర్‌ ఫీలవుతున్నలోపు.. ఈ సినిమాలో ఉన్న అసలైన 'కథ .. ఇంటర్వెల్‌కు కొద్దిగా ముందు నుంచి ప్రారంభమవుతుంది. సెల్వరాఘవన్‌ తయారుచేసిన ఈ కథే సెకాండాఫ్‌కు, సినిమాకు ప్రాణంగా సాగుతుంది.

    ఆ యువ దర్శకుడి ప్రయత్నం చాలా మంచిదే. తమిళంలో ఎలా ఉందో తెలియదు గానీ తెలుగులో మాత్రం అంతగా పండలేదు. మంచి ప్రయత్నమే ఐనా ఫర్వాలేదనిపించే ఫీలింగ్‌ కలిగించే చిత్రమే. ఐతే..కొడుకు మూలానా తనకు సరిగా 'బిజినెస్‌' కావడం లేదనుకునే ఓ వ్యభిచారి - ఆ కొడుకును వదిలేస్తే వాడు ఎలా తయారవుతాడు అనే కథామూలం నిజంగా చాలా మంచి పాయింట్‌. సెల్వరాఘవన్‌ దీన్ని బేస్‌ చేసుకొని తయారుచేసుకొన్న కథావస్తువు చక్కగా ఉంది.

    వ్యభిచారి తల్లి టైల్స్‌ కంపెనీ యజమానురాలికి వదిలేస్తే..అక్కడ అనేకమంది బాలకార్మికుల మాదిరిగా పనిచేసుకుంటూ..బానిసలాగా బతుకుతుంటాడు వినోద్‌. అక్కడ బాలికలను సెక్స్‌కు ఉపయోగించుకునే ఓ నీచుడు..తన ఫ్రెండైన ఓ బాలికను వాడు లైంగికంగా వాడుకొని చంపడంతో..వినోద్‌లో జీవితంపై ఓ రకమైన హేహ్యభావం ఏర్పడుతుంది. ఎవరూ లేని వాడు ఓ చర్చిలో పెరుగుతూ చదువుకుంటాడు. ప్రేమరాహిత్యంతో బాధపడే వాడు..వైజాగ్‌లో ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లో ఆ చర్చి ఫాదర్‌ ప్రోదల్బం వల్ల చేరుతాడు.

    ప్రేమరాహిత్యంతో ఉన్న వీడికి దివ్య (వేద) అమ్మాయి పరిచయం కలగడం, ఆ అమ్మాయి స్నేహంతో వాడు తొలిసారి 'ప్రేమ'ను చూడడం జరుగుతుంది. ఐతే, దివ్య ఆది(అభిషేక్‌) అనే తన క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తుంది. వినోద్‌ మాత్రం దివ్య ఎప్పుడు తన సొంతమే కావాలని భావించి, ఆదిని అడ్డుతొలగించేందుకు ప్రయత్నిస్తాడు. వినోద్‌ సైకోగా మారుతాడు. దివ్యకుక వినోద్‌ మీద అభిమానం ఉన్నా, ఈ సైకో ప్రేమను అంగీకరించదు. చివరికి దివ్య ఏం చేస్తుందనేది క్లైమాక్స్‌.

    ఫైడోఫిలియా (బాలలతో సెక్స్‌లో పాల్గొనే నైచ్యం), బాలకార్మికుల కష్టాలు వంటి సన్నివేశాలు చాలా హార్ష్‌గా, వాస్తవికంగా చిత్రీకరించారు. కమల్‌హాసన్‌ నటించిన 'గుణ', హాలీవుడ్‌ చిత్రం 'సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌' చిత్రాల ప్రభావం అధికంగా ఉందీ చిత్రంపై. నరేష్‌ సైకోగా బాగా చేశాడు. అతను ఎటువంటి డైలాగ్స్‌ చెప్పకుండా కేవలం హావాభావాలతో తన నటనను ప్రదర్శించడంలో మంచి ప్రతిభను చూపిస్తున్నా, నోరు విప్పితే మాత్రం ఆ 'ఫీల్‌' పోతోంది. కొత్త అమ్మాయి వేద ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఆ పాత్రకు బాగా సూటయింది. ముఖంలో పెద్దగా అందం లేకపోయినా, సౌష్టవ శరీరాకృతి వల్ల ఆమె చక్కగా కన్పించింది. 'ఐతే' చిత్రం ద్వారా పరిచయమైన అభిషేక్‌ అబ్బాస్‌ను తలపించాడు. ఒరిజనల్‌ చిత్రంలో యువన్‌ రాజా సంగీతంతో పోల్చితే, ఈ చిత్రంలో విద్యాసాగర్‌ స్వరపర్చిన సంగీతం చాలా పేలవంగా ఉంది.

    ఇప్పటివరకు కామెడీ చిత్రాలు తీసిన దర్శకుడు ఇ.సత్తిబాబు సీరియస్‌ సినిమాను బాగానే డీల్‌ చేశాడు. సినిమాలో లోపం ఏమిటంటే..వినోద్‌ పాత్రపై సానుభూతి కలగకపోవడం. దాన్ని సరిగ్గా వర్కవుట్‌ చేయలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X