For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాన్సెప్టు ఓకే కానీ....( ‘సూర్య vs సూర్య’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  --- సూర్య ప్రకాష్ జోశ్యుల

  క్రేజీ ఐడియాని కాన్సెప్టుగా అనుకుని దాన్ని స్టోరీ లైన్ గా డవలప్ చేసుకుని తర్వాత ట్రీట్ మెంట్ చేస్తూ ...ఇలా వివిధ దశల్లో స్క్రిప్టు మారుకుంటూ ముందుకు సినిమా రచన వెళ్తూంటుంది. అంతేకానీ కాన్సెప్టు క్రేజీగా ఉంది కదా అని తదుపరి దశలకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతే ఏమౌతుంది. కాన్సెప్టు కు సంభందించిన సీన్స్ రిపీట్ అవుతూంటాయి. అదే ఈ చిత్రానికి జరిగింది. విభిన్న చిత్రాలతో నిఖిల్ వస్తూండటంతో ఓపినింగ్స్ బాగా తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ మరీ కదలని కథని తోసుకుంటూ బలవతంగా లాగిన ఫీల్ వచ్చింది. అయితే రెగ్యులర్ మసాలా చిత్రాలుకు భిన్నంగా ఇటువంటి కథలను ఎంచుకుంటూ వెళ్తున్నందుకు మాత్రం నిఖిల్ కు అభినందనలు తెలియచేయాలి. దర్శకుడు స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే ఖచ్చితంగా మరోసారి చిన్న చిత్రాల్లో పెద్ద అద్బుతం జరిగేది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొన్న ఈ కథ ఇది. ఈ కథలో సూర్య(నిఖిల్) కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన ఆ వ్యాధితో బాధపడుతూంటాడు. అయితే పగలు బయటకు రాలేని సూర్య.... పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే తనకు జబ్బున్న విషయం ఆమెకు దగ్గర దాస్తాడు..ఎక్కడ ఆమె రిజెక్టు చేస్తుందో అనే భయంతో...అయితే ఓ రోజు ఆమె పగలు తన ఇంటికి వచ్చి మాట్లాడమనటంతో ...తప్పనిసరి పరిస్దితుల్లో ఆ జబ్బు విషయం ఆమెకు రివిల్ అవుతుంది. దాంతో విషయం తెలుసుకున్న ఆమె, ఆమె తండ్రి అతన్ని ఏక్సెప్టు చేయరు. ఆ క్రమంలో సూర్య ఏం చేసాడు. తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. ప్రేమ కోసం తన జబ్బుని ఎలా జయించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

  Nikhil Siddhartha's 'Surya vs Surya' review

  సినిమా ప్రారంభం అయిన బిగినింగ్ టైటిల్స్ లోనే కథలోకి వచ్చే సీన్స్ వస్తూంటే భలే ముచ్చట వేస్తూ చిత్రంపై గౌరవం పెరిగిపోతుంది. అయితే తర్వాత అర్దమవుతుంది వారు అక్కడదాకానే అడ్వాన్సడ్ గా ఉన్నారు. ఇంటర్వెల్ దాకా ..హీరోకు ఫలానా జబ్బు ఉంది.. దాని వల్ల బోల్డు సమస్యలు..ఆ జబ్బు వల్ల అతని ప్రేమ కథకు కూడా ఇబ్బందే ...అని పదేపదే చెప్పిందే రకరకాల సీన్స్ లో రిపీట్ చేస్తూ చెప్తాడని అనుకోము. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి...మరీ బాగోదు అనుకున్నారో ఏమో... అతని ప్రేమ కథకు చిన్నపాటి సమస్య పెట్టి వదులుతాడు. సర్లే మన తెలుగు సినిమాల్లో ఎక్కువ భాగం ఈ బాపతు స్క్రీన్ ప్లే తో..ఇంటర్వెల్ దగ్గరే మొదలవుతాయి కదా అని ఫిక్సై...సెకండాఫ్ అదరకొడతాడేమో అనుకుంటాం.

  సెకండాఫ్ మొదలైన దగ్గర నుంచి మనకు ఫస్టాఫ్ పై గౌరవం పెరిగుతూ పోయి..క్లైమాక్స్ కు వచ్చేసరికి ఫస్టాఫ్ అద్బుతం..సెకండాఫ్ బాగా చేయలేదని ఫిక్సై పోతాం. అంతలా సెకండాఫ్ డ్రాప్ అవుతూ...అక్కర్లైని కామెడీ సన్నివేశాలను మూట కట్టుకుంటూ తిరిగుతూంటుంది. దానికి తోడు వినాయిక చవితి మహాత్యం లాగ...( స్వామీరారా లో వినాయికుడు వర్కవుట్ అయ్యాడని సెంటిమెంట్ గా పెట్టారేమో)... హీరో సమస్యలో పడగానే వినాయికుడు మహిమ చేత రక్షింపబడుతూంటాడు. అసలు ...హీరో పెద్దగా ఎక్కడా సమస్యలో పడలేదురా దేముడా అనుకుంటే...ఎప్పుడన్నా సమస్యలో పడగనే దేముడు కలగచేసుకుని రక్షించేస్తే ఇంకేముంటుంది.

  అలాగే ...అసలు హీరో ..పగటి పూట సూర్యుడు ఉండగా బయిటకు వస్తే ఏం జరుగుతుంది...అనేది ప్రేక్షకుడుకి ఒక్కసారైనా చూడాలని ఉంటుంది. దాన్ని దర్శకుడు తీర్చడు. చాలా ప్రెడిక్టుబుల్ గా కథ నడుస్తూంటుంది. కేవలం ఆ స్టోరీ ఐడియాని మాత్రమే నమ్ముకుని చేసిన ఈ చిత్రం విభిన్నంగా పైకి అనిపించినా...చివరకు మంచి కాన్సెప్టుని పాడు చేసాడు అనిపించకమానదు.

  ఈ సినిమా హైలెట్స్ లో విజువల్స్ మొదటి ప్లేసులో ఉంటాయి. కెమెరామెన్ దర్శకుడు కావటంతో ఆ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లోనే దాదాపు సినిమా మొత్తం సాగటంతో ఆ ఫీల్ కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక సంగీత దర్శకుడు రెండు పాటలు బాగా ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లోమరింత షార్ప్ గా చెయ్యించుకోవాల్సింది అనిపిస్తుంది.

  నిఖిల్ ఎప్పటిలాగానే క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. హీరోయిన్ మాత్రం తేలిపోయింది. తణికెళ్ల భరణి సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. మధుబాల..బాగా స్లిమ్ అయ్యి కొత్త లుక్ తో కనపడింది. రావు రమేష్ గెస్ట్ రోల్ లోనూ, షాయేజి షిండే ..హీరోయిన్ తండ్రి పాత్రలోనూ రొటీన్ గా చేసుకుంటూ పోయారు.

  బ్యానర్:సురక్షా ఎంటర్టైన్మెంట్స్
  నటీనటులు:నిఖిల్, త్రిధా చౌదరి ,తనికెళ్ల భరణి, మధుబాల, రావురమేష్, షాయాజీ షిండే, తా.రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, మస్త్‌అలీ, అల్లరి సుభాషిణి, జెన్నీ తదితరులు
  సంగీతం:సత్య మహావీర్,
  కెమెరా:కార్తీక్ ఘట్టమనేని,
  మాటలు: చందూ మొండేటి,
  ఎడిటింగ్:గౌతమ్ నెరుసు,
  పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి, కృష్ణచిన్ని,
  నిర్మాత: మల్కాపురం శివకుమార్,
  రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.
  విడుదల తేదీ: 05,మార్చి 2015.

  ఫైనల్ గా డిఫెరెంట్ కాన్సెప్టు తో వచ్చిన చిత్రాలను ఎంకరేజ్ చెయ్యాలనుకుంటే ఈ సినిమా అటువంటి వాటిలో మొదటి వరసలో ఉంటుంది. అలాగే ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళితే ఓకే అనిపిస్తుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Nikhil Siddhartha, who has scored back-to-back hits with "Swamy Ra Ra" and "Karthikeya", is now returning to the big screen with "Surya vs Surya", which is released today( 5 March) with just ok talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X