twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థ్రిల్లరే కానీ.... ('కార్తికేయ' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    తెలుగులో కదలకుండా కట్టిపారేసే థ్రిల్లర్స్ తక్కువే... ఇంకా చెప్పాలంటే రెగ్యులర్ మాస్ మసాలా లేదా కామెడీలు తప్పించి...కొత్త తరహా కథ,కథనంతో వచ్చే సినిమాలు బాగా తక్కువ. దాన్ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నాడో ఏమో కానీ నిఖిల్...రొటీన్ కు భిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ‘స్వామి రారా' వంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రంతో హిట్ ఇచ్చిన నిఖిల్ మాస్ హీరోయిజం జోలికి వెళ్లకండా మరోసారి కథనే నమ్ముకుని 'కార్తికేయ' అంటూ థ్రిల్లర్ కధాంశంతో ముందుకు వచ్చాడు. అందుకు అతన్ని మొదటి అభినందించాలి.అయితే సెకండాఫ్ స్లో అవటం, క్లైమాక్స్ తేలిపోవటం లేకుండా ఉంటే ఈ సినిమా మరింత బాగా ఆకట్టుకునేది. అలాగని తీసి పారేసి సినిమా కాదు..ట్రైలర్ చూసి ఎక్కువ అంచనాలు వేసుకోకుండా వెళితే ఓ ఫ్రెష్ కథతో కూడిన చూసిన ఫీల్ అయితే వస్తుంది.

    మెడికో కార్తీక్(నిఖిల్) ది ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి ఎంతదూరమైనా వెళ్లే మనస్తత్వం. అలాంటి కార్తీక్... మెడికల్ క్యాంప్ కోసం ... ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లోని సుబ్రహ్మణ్యపురం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊళ్లో మూతబడిన సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి ఉంటుంది. ఆ గుడికో మిస్టీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతీ కార్తీక పౌర్ణమికి గుడి మొత్తం ప్రకాసిస్తూంటుంది. మూతబడిన ఆ గుడిని తెరవాలని ప్రయత్నించేవారంతా పాము కాటుతో మరణిస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఎలా స్పందించాడు. ఆ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందనేది,కథలో వల్లి(స్వాతి) పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    ఐటం సాంగ్ లు, ఫార్ములా ఎంటర్టైన్మెంట్ ఐడియాలు, స్టార్ కమిడయన్స్ కామెడీలు లేకుండా సినిమా తీయవచ్చు అంటూ ఈ కొత్త దర్శకుడు ఉత్సాహంగా వచ్చాడు. కేవలం తను రాసుకున్న కథను నమ్ముకుని ఈ థ్రిల్లర్ ని వండి వడ్డించే ప్రయత్నం చేసాడు. అయితే థ్రిల్లర్ కథలకు స్క్రీన్ ప్లే ముఖ్యం. కథలో పాత్రలు, సమస్య సెటప్ చేసిన తర్వాత హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అన్వేషకుడు లా మారి తర్వాత ఏం జరుగుతుంది అంటూ ప్రయాణం సాగిస్తాడు. ఆ ప్రయాణం ఎంత సంక్లిష్టింగా ఉండి, దాన్నుంచి బయిట పడే ఎత్తులు ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే అంతగా ఆనందం అనుభవిస్తాడు. ఆ అన్వేషణలో భాగంగా స్టెప్ బై స్టెప్ కథనంలో పెరిగే థ్రిల్స్ ప్రేక్షకుడుని కవ్విస్తూ కథన కుతూహలం రేపి ముందుకు తీసుకువెళ్తూంటాయి. అయితే ఈ కథనంలో అది అంతగా కనపడదు... దానికి తోడు స్లో నేరషన్, ఉసూరుమనిపించే క్లైమాక్స్ వచ్చి దెబ్బకొట్టాయి. అయితే ఫస్టాఫ్ ని (అందరిలాగే) ఎక్కడా బోర్ కొట్టకుండా రాసుకున్నాడు. సెకండ్ యాక్ట్ మిడిల్ నుంచే డ్రాప్ అవటం మొదలయ్యి...ధర్డ్ యాక్ట్ లో కేవలం రొటీన్ గా ముగింపు కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి కథలకు చంద్రముఖి రేంజి క్లైమాక్స్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్తుంది. ఆ విషయం ఎందుకునో దర్శకుడు నిర్లక్ష్యం చేసాడు. అయితే అదృష్టవశాత్తు కథలో సస్పెన్స్ ఉండటం చాలా వరకూ కలిసివచ్చింది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

     ఫస్టాఫ్ ఫన్ గా..

    ఫస్టాఫ్ ఫన్ గా..

    సినిమా ప్రారంభం లవ్ స్టోరీతో కథని ఎస్టాబ్లిష్ చేస్తూ గ్రిప్పింగ్ గా బాగానే ఆకట్టుకుంది. దానికి పాటలు, కామెడీ, కథలో ఇన్వాల్వ్ చేస్తూ వరసగా జరిగే కొన్ని సంఘటనలు బాగా ఉపకరించి, ఫస్టాఫ్ జెట్ స్పీడుతో జరిగిన ఫీలింగ్ వచ్చింది.

    ఇంటర్వెల్ బ్యాంగ్

    ఇంటర్వెల్ బ్యాంగ్

    ఫస్టాఫ్ ని బాగానే డీల్ చేసిన దర్శకుడు ఇంటర్వెల్ దగ్గర కి వచ్చేసరికి ప్రెడిక్టిబుల్ గా మార్చేసాడు. అయితే దాన్ని ఊహించగలిగినా సెకండాఫ్ ఏం జరుగుతుందనే ఆసక్తిని మాత్రం నిలిపాడు.

    సెకండాఫ్...

    సెకండాఫ్...

    ద్వితీయార్దం ప్రారంభం బాగానే ఉన్నా మెల్లిమెల్లిగా అది దర్శకుడు చేతిలోంచి జారిపోవటం మొదలైంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి అది మరింతగా దారణమైపోయి, సింపుల్ గా తేలిపోయినట్లైంది.

    ప్లస్ లు:

    ప్లస్ లు:

    - ఆకట్టుకునే ఫ్రెష్ స్టోరీ లైన్
    - సినిమా మూడ్ కి తగినట్లు ఉన్నతంగా సాగిన సినిమాటోగ్రఫి, షార్ప్ ఎడిటింగ్
    - సినిమాకు ప్లస్ గా మారిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    - విజువల్స్ తో కూడిన నేరేషన్
    - నిఖిల్, కలర్స్ స్వాతి ల లవ్ ట్రాక్
    -రావు రమేష్ నటున

    మైనస్ లు...

    మైనస్ లు...

    - మెచ్యూరిటీ లేని క్యారక్టరైజేషన్స్, స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవటం
    - బాగా లేటుగా కథలోకి వెళ్లటం, సెకండాఫ్ లో స్లో నేరేషన్
    - పాము, దేముడు అంటూ మొదలు పెట్టిన కథకు క్లైమాక్స్ ఆ రేంజిలో లేకుండా చిన్న లాజికల్ టచ్ తో తేలిపోవటం
    - లూజ్ ఎండ్స్ తో క్యారెక్టర్స్ డిజైన్ చేయటం
    - థ్రిల్లింగ్ ని దెబ్బతీసే ప్రెడిక్టుబులిటీ

    నటీనటుల్లో....

    నటీనటుల్లో....

    నిఖిల్... ఈ సినిమాలో గతంలో కన్నా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఈ స్టోరీ డ్రైవర్ మూవిలో నిఖిల్ తన పాత్రను సమర్ధవంతంగానే పోషించాడు. స్వాతి కొన్ని చోట్ల ఏజ్ కనిపించినా మిగతా చోట్ల బాగానే ఉంది...ఎప్పట్లాగే తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. రావు రమేష్ కు కీలకమైన పాత్ర.. ఆయనే సినిమా చివర్లో ఓ ఆశ్చర్యకరమైన ముగింపు కూడా ఇచ్చారు..అది బాగుంది.

    దర్శకుడు

    దర్శకుడు

    తొలి చిత్రమైనా దర్శకుడు ఎక్కడా తడబడకుండా బాగా అన్ని విభాగాల నుంచి మంచి అవుట్ పుట్ నే తీసుకున్నాడు. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని కథ కాబట్టి, అలాగే కథే ఈ సినిమా కు హీరో కాబట్టిదానిపై మరింత కృషి చేసి ఇంతకన్నా మంచి ఫలితం వచ్చేది. రచయితగా కన్నా అతను దర్శకుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    బ్యానర్: 'మాగ్నస్ సినీ ప్రైమ్'
    నటీనటులు: నిఖిల్, స్వాతి, తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు
    కెమెరా : కార్తిక్,
    సంగీతం : శేఖర్ చంద్ర,
    ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్,
    ఆర్ట్ : సాహి సురేష్,
    పాటలు : కృష్ణ చైతన్య,
    కొరియోగ్రఫీ : రఘు,
    ఫైట్స్ : వెంకట్ నాగు,
    సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ,
    నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం,
    కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.
    విడుదల తేదీ:24, అక్టోబర్ 2014.

    ఫైనల్ గా రొటీన్ కు భిన్నంగ్ చేసిన ఓ కొత్త ప్రయత్నం కాబట్టి చిన్న చిన్న లోపాలను ప్రక్కన పెట్టి చూసి,అభినందిస్తే ఇలాంటి మరిన్ని సినిమాలకు మార్గం వేసినట్లు ఉంటుంది. అలాగే మంచి విజువల్స్ కోసం, కొత్త కథ కోసం, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం... చూడవచ్చు. ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ లేకుండా వెళితే ఎక్కువ నచ్చే అవకాసం ఉంది. ట్రై చేయండి.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Karthikeya movie is touted to be as the thriller like the previous movie of Nikhil, Swamy Ra Ra released today. This movie is directed by debutante director named as Chandoo Mondeti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X