»   » ఒ..ఓ..ఓకే (త్రివిక్రమ్ ‘అ..ఆ..’ రివ్యూ)

ఒ..ఓ..ఓకే (త్రివిక్రమ్ ‘అ..ఆ..’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఇది త్రివిక్రమ్ సినిమా కాదు..కాదు... నితిన్ సినిమా ఇలా రెండు విధాలుగా ఎక్సెపెక్ట్ చేసి వెళితే మీరు బోల్తా పడినట్లే... ఎందుకంటే ఇది ఖచ్చితంగా హండ్రడ్ పర్శంట్ సమంత సినిమా. ఆమె చుట్టూ అల్లిన కథ. ఆమె ఫెరఫార్మెన్స్ తో నడిచిన కథ. ఆమెను హైలెట్ చేయటం కోసమే అన్నట్లుగా త్రివిక్రమ్ తన మార్కుని వదిలేసాడు. నితిన్ అయితే కేవలం ఓ పాత్రలా మిగిలిపోయాడు.


ఇలా దర్శకుడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుకున్నప్పుడు, మళయాళి చిత్రం 'ఓం శాంతి ఓషానా' తరహాలో పూర్తిగా ఆమెనే హెలెట్ చేస్తూ, ఓ స్టారడమ్ లేని హీరోని తీసుకుని నడిపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోను. అలా కాకుండా నితిన్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని సీన్ లోకి తేవటంతో నితిన్ ఏమి చెయ్యడేంటి, అతను తన ప్రేమ కోసం ఎక్కడా ఏ డెషిషన్ తీసుకోడేంటి.. అంటూ తొలిచేస్తూంటుంది. త్రివిక్రమ్ నుంచి పంచ్ లు, నితిన్ నుంచి ఇంకేమి ఆశించకుండా వెళ్తే హ్యాపీగా అనిపించే వన్ ఉమెన్ షో ఇది. ఆమె అభిమానులు పండుగ చేసుకునే చిత్రం ఇది.


హైదరాబాద్ లో పేరున్న పారిశ్రామిక వేత్త మహాలక్ష్మి (నదియా). తన భర్త రామలింగం(నరేష్) తన కూతురు అనసూయ (సమంత) ఇద్దరూ తనమాటే వినాలనే నియంత మనస్తత్వం ఆమెది. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా తన ఇష్టా యిష్టాలకి అనుగుణంగా కూతురుని పెంచుతున్న ఆమె తన కూతురుకి ఓ మిలియనీర్ పెళ్లి సంభంధం కుదిర్చే ప్రయత్నాలు మొదలెడుతుంది. అయితే అనసూయ కి ఈ సంభంధం అంటే ఇష్టం ఉండదు దాంతో.. ఆమె సూసైడ్ ఎటెమ్ట్ చేస్తుంది.


Download A Aa Wallpapers Here


దాంతో తండ్రి కలతపడి..తన కూతురుని ప్లేస్ మారిస్తే మంచిదని భావించి,తన బార్య టూర్ కు వెళ్లటం గమనించి,ఆమెకు తెలియకుండా తన మేనల్లుడు ఆనంద్ విహారి (నితిన్) ఉన్న పల్లెటూరుకు ఆమెను పంపుతాడు. అక్కడ పల్లెటూరి ప్రేమాభినాలతో పాటు, తన బావ పై కూడా మనసుపడుతుంది. అయితే ఆల్రెడీ విహారికి ఆల్రెడీ అదే ఊరుకు చెందిన వల్లి (అనుపమ) తో వివాహం ఫిక్స్ అయ్యిపోయి ఉంటుంది. ఈ పరిస్దితుల్లో అనసూయ ఏం చేసింది. విహారి కుటుంబాన్ని ఎందుకు మొదటి నుంచీ దూరం పెట్టారు...ఆ ప్రేమ కథ ఏమైంది ...వంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.


త్రివిక్రమ్..తొలి నుంచీ ఫీల్ గుడ్ ప్రేమ కథలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రొమాంటిక్ కామెడీలతో వండర్స్ సృష్టించి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దర్శకుడుగా మారాక యాక్షన్ ఎంటర్టైనర్స్ వైపు కు టర్న్ తీసుకున్న ఆయన అత్తారింటికి దారేదితో మళ్లీ తనదైన శైలి ఫ్యామిలీ డ్రామాల వైపు దృష్టి పెట్టారు. అయితే ఆయన బలం తొలినుంచీ.. సున్నితమైన హాస్యం, పంచ్ డైలాగులు. అలాంటి ఆయన ఈ సినిమాలో తన బలాల్ని పూర్తిగా వదిలేయటం త్రివిక్రమ్ అభిమానులనే కాక, ఆయన నుంచి అలాంటి అవుట్ ఎదురుచూసే ఎవరినైనా నిరాశపరిచే అంశం.


మిగతా రివ్యూ స్లైడ్ షోలో...


హైలెట్స్

హైలెట్స్

సినిమా హైలెట్స్ లో ఫస్టాఫ్ లో సమంత...కలవపూడి విలేజ్ వెళ్లేటప్పుడు సీన్స్ బాగున్నాయి. అలాగే.. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే నితిన్, నదియా సీన్ బాగుంది. ఎండ్ టైటిల్స్ లో రావు రమేష్ ఫుల్ పంచ్ డైలాగులు అదిరాయి.


అత్తారింటికి దార్లోనే

అత్తారింటికి దార్లోనే

సినిమా ఫ్లాష్ బ్యాక్ లు ఒక్కో పాయింటాఫ్ లో వ్యూలో ఒక్కో రకంగా చూపడం, అత్తారింటికి దారేది సినిమాను గుర్తు చేస్తుంది.బలం

బలం

సినిమాకు బలం విజువల్స్.. సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణ్యం చాలా సీన్స్ లో తనదైన శైలిలో అదరకొట్టాడనే చెప్పాలి. ఆ విజువల్ ట్రీట్ లేకపోతే సీన్స్ తేలిపోయేవి అనిపించేది. పల్లెటూరి అందాలు ఆయన అద్బుతంగా పెయింటింగ్ లా చూపించారు. ఆర్ట్ డైరక్షన్ కూడా అదిరిపోయింది.


డైలాగులు

డైలాగులు

త్రివిక్రమ్ బలమే డైలాగులు. అయితే ఆ పంచ్, మార్క్ ఇందులో తగ్గింది కానీ పూర్తిగా లేదు అని చెప్పలేము. చాలా చోట్ల ఆ వ్యంగ్యం, ఫన్ ,రైమ్, సౌండింగ్ తొంగి చూసి ఆనందపరుస్తాయి


డల్ అయినా

డల్ అయినా

సెకండాఫ్ డల్ అయినట్లు అనిపించినా, క్లైమాక్స్ లో కొంతవరకూ నిలబెట్టాడనే చెప్పాలి. అయితే అప్పటివరకూ హీరో పాత్ర ఏమిటి అనేది అలా అలా వెళ్లిపోతుందే కానీ క్లారిటీ ఏమి రాదు.


రావు రమేష్

రావు రమేష్

ఈ సినిమాలో చూస్తే రావు రమేష్ పాత్రే అందరికన్నా ఎక్కువ గుర్తుండిపోయేది. ఆయన డైలాగులు, అవి పలికే తీరు, అందులో విలనీ మనకు నవ్వు,కోపం అన్ని తెప్పిస్తాయి. ఈ షోలో ఆయనదీ మేజర్ షేరే.


నితిన్, సమంత

నితిన్, సమంత

ఈ సినిమాలో మొదటే చెప్పుకున్నట్లు నితిన్ కు ఏమీ లేదు. సమంత సినిమా మొత్తం ఉంది. ఆమె కథే ఇది. ఆమె అద్బుతంగా ఫెరఫార్మెన్స్ చేసింది.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌,
నటీనటులు: నితిన్‌, సమంత, నదియ,అనుపమ పరమేశ్వరన్, అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం: నటరాజన్‌ సుబ్రమణ్యం
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌
విడుదల తేది: 02-06-2016ఫైనల్ గా... 'బ్రహ్మోత్సవం' ఫెయిల్యూర్ కావటంతో ... టాలీవుడ్ భాక్సాఫీస్ దగ్గర చూడదగ్గ ఏ స్ట్రైయిట్ సినిమాలు లేవు. కాబట్టి ప్యామిలీలకు ఈ సినిమా అల్టనేటివ్ అవ్వచ్చు. అందులోనూ క్లీన్ ఫిలిం కాబట్టి వీకెండ్ లో కాలక్షేపం గా కలిసొచ్చే అవకాసం ఉంది.

English summary
A… Aa directed by Trivikram Srinivas has been released today with average talk. It stars Nithin, Samantha, and Anupama Parameswaran in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu