twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది ఎన్టీఆర్ 'సర్కార్' ... (‘జనతా గ్యారేజ్‌’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    3.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    సామాజిక సందేశాన్ని కమర్షియల్ ఫార్మెట్ లో చెప్పి హిట్ కొట్టచ్చా అనే సందేహాన్ని పటాపంచలు చేసి వరసపెట్టి రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ. స్టార్ వేరు,నటుడు వేరే అనే అంతరాన్ని చెరపేసిన స్టార్ యాక్టర్ ఎన్టీఆర్. అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే అవధులు దాటిన ఆ అంచనాలను ఏ మేరకు వీళ్లిద్దరూ అందుకోగలిగారు,కమర్షియల్ ఫార్మెట్ లోనే కంటెంట్ అని చెప్పి సక్సెస్ అయ్యాడా కొరటాల అనే విషయం ఇప్పుడు చూద్దాం.

    'మనం ఈ భూమి మీద టెనెంట్స్ మి మాత్రమే, తర్వాత తరాలకి తిరిగి ఇచ్చేయాలి ' అని నమ్మి , దాన్ని ఆచరిస్తూ ఆచరణలో పెట్టే పర్యావరణ పరిరక్షకుడు ఆనంద్. ముంబై లో ఉండే అతనికి ప్రకృతి పరిరక్షణలో శత్రువులు పెరుగుతారు. అదే పనిమీద ఆనంద్ హైదరాబాద్ వస్తాడు. అక్కడ సత్యం(మోహన్ లాల్) ని కలుస్తాడు.

    సత్యం ఎవరూ అంటే ఆనంద్ కు పెదనాన్న...మెకానిక్ అయిన ఆయన జనతాగ్యారేజ్ నడుపుతూంటాడు. జనతాగ్యారేజ్ లో కేవలం వాహన రిపేర్లు మాత్రమే కాకుండా .. కష్టాల్లో ఉన్న సామాన్యులకు,బలహీనులకు సాయం చేస్తూంటాడు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. ఈ క్రమంలోనే సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు (రహమాన్) ప్రాణాలు కోల్పోతాడు. ఈ సత్యం తమ్ముడి కొడుకే మన హీరో ఆనంద్. అంటే ఆనంద్ కు పెద నాన్న సత్యం అన్నమాట.

    ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాపై పబ్లిక్ టాక్ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాపై పబ్లిక్ టాక్

    ఆనంద్ ..., జనతా గ్యారెజ్‌కు దూరంగా, తనక కుటుంబం ఉందని తెలియకుండా తన మేనమామ(సురేష్) ఇంట్లో ముంబైలో పెరుగుతాడు. సంవత్సరాలు గడస్తాయి..ప్రకృతి వీళ్లిద్దరిని దగ్గర చేర్చాలనకుంది. ఆనంద్ అనుకోని పరిస్దితుల్లో జనతాగ్యారేజ్ కు వచ్చాడు. జనతాగ్యారేజ్ కు అతన్ని లీడ్ చేసిన అంశాలేమిటి...ఆనంద్ వచ్చాక జనతాగ్యారేజ్ లో ఏం మార్పు వచ్చింది.. సత్యమే తన పెదనాన్న అని ఎప్పుడు ఆనంద్ కు తెలిసిందే...సమంత,నిత్యామీనన్ లతో హీరో జర్నీ ఏనిటి వంటి విషయాలు అనేది తెరపై చూడాల్సిన ఇంటెన్స్ డ్రామా.

    సినిమా అంతా బాగుంది కానీ ఎందుకనో సెకండాఫ్ లో కొంత అయ్యాక అంటే చివరి ఇరవై నిముషాలు మాత్రం డ్రాప్ అయ్యింది. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు...చివరి ఇరవై నిముషాలు ఒకెత్తు...అక్కడదాకా వచ్చిన గ్రాఫ్ ఒక్కసారి గా డౌన్ అయ్యింది.. అక్కడ నుంచి అప్ టు మార్క్ లేదు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ అర్దాంతరంగా ,అబరప్ట్ గా ముగిసింది. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ ల ఇంటెన్స్ ఫెరఫార్మెన్స్ ముందు అది అంతగా కనపడదు.

    స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలంటే ఈ సినిమా క్యారక్టర్ డ్రైవన్ ఫిల్మ్. రెండు బలమైన పాత్రలు చుట్టూ అల్లిన కథనం. కాబట్టి కధగా విడిగా ఉండదు. రెండు క్యారక్టరైజేషన్స్ ,వాటి వైరుధ్యాలు,సారూప్యాలు నుంచి పుట్టిన సీన్లే సినిమాని నడిపిస్తాయి. అలాగే అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లాంటి కదా మలుపులు అలరిస్తాయి. తరిచి చూస్తే బలమైన కథ అంటూ ఉండదు.

    దానికితోడు కథలో బలమైన సమస్య లేకపోవటంతో ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ తేలిపోయింది. ఎండింగ్ సింపుల్ గా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా కథని చాలా స్లో నేరేషన్ లో నడిపారు. గాడ్ ఫాధర్ లాంటి మోహన్ లాల్ పాత్రకు, వారసుడుగా ఎన్టీఆర్ కనిపించటం బాగుంది. ముఖ్యంగా క్వారీ ఫైట్,వెంటనే వచ్చేఎన్టీఆర్, మోహన్ లాల్ మీట్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకు వెళ్లాయి. ఆ తర్వాత జనతాగ్యారేజ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వటం..ఇంటర్వెల్, తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తిని లేపాయి. కానీ ఫస్టాఫ్ ని మొత్తం కథని,క్యారక్టర్స్ ని సెటప్ చేయటానికే సరిపెట్టారు.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

    మామూలుగా లేదుగా

    మామూలుగా లేదుగా

    ఎన్టీఆర్ లో ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత గొప్పగా ఎమోషన్స్ పండించే నటుడో మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తనను తాను చాలా కంట్రోలు చేసుకుంటూ చాలా బ్యాలన్స్ గా చేస్తూ ఎన్టీఆర్ ఆనంద్ పాత్రలో ఇమిడిపోయాడు. తారక్ డైలాగులు చెప్పే విధానం అదుర్స్. ఇక డాన్స్ ల్లో పక్కా లోకల్ డాన్స్ లో అయితే కేక పెట్టంచాడు

    ఇంకో పిల్లర్

    ఇంకో పిల్లర్

    ఈ సినిమాకు ఇంకో పిల్లర్ మోహన్ లాల్. తన ఇంటెన్స్ నటనతో సినిమాకు కీలకంగా మారారు. ఫస్టాఫ్ లో ఆయన ట్రాక్ మనను ఎంగేజ్ చేస్తుంది.చాలా బాలెన్సెడ్ గా ఆయన చేసిన నటన మనని మైమరిపిస్తుంది. ఈ క్యారక్టర్ లో ఇంకొకరిని ఊహించలేమంతగా ఇమిడిపోయారు.

    ప్చ్..

    ప్చ్..

    కాకపోతే హీరోయిన్స్ సమంత, నిత్యామీనన్ లకు అసలు పాత్రలే లేవు. వాళ్లను గెస్ట్ రోల్స్ అనాలేమో. కొన్ని పాటలు, మరిన్ని సీన్స తప్ప ఏమీ లేదు.

    రాకింగ్...టెర్రిఫిక్

    రాకింగ్...టెర్రిఫిక్

    రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరచిన టెర్రిఫిక్ సాంగ్స్ మాత్రమే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

    మొత్తం మార్కులు ఈయనకే

    మొత్తం మార్కులు ఈయనకే

    తిరునావుక్కరసు కెమెరా వర్క్ సినిమాకు మరో హైలెట్, అందమైన విజువల్స్ ని తెర నిండా పేర్చేసాడు. హైదరాబాద్, ముంబైలని తన లైటింగ్ స్కీమ్ లతో చాలా బాగా చూపెట్టాడు.

    ట్రిమ్మింగ్ అవసరం

    ట్రిమ్మింగ్ అవసరం

    ఎడిటింగ్ కోటగిరి కూడా బాగానే చేసారు. కానీ ఓ పదిహేను నిముషాలు ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అలాగే ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి కూడా సెట్స్ ని రియలిస్టిక్ టచ్ తో చేసారు. అంతేకాకుండా అనల్ అరసు ఫైట్స్ కూడా డిఫెరెంట్ గా ఉన్నాయి.

    డైరక్టర్ గా ,రచయితగా

    డైరక్టర్ గా ,రచయితగా

    రచయతగా ఎప్పటిలాగే కొరటాల శివ విశ్వరూపం చూపెట్టారు. అయితే దర్శకుడుగా జస్ట్ ఓకే అనిపిస్తారు. శ్రీమంతుడు, మిర్చి నాటి మ్యాజిక్ డైరక్షన్ లో కనిపించలేదు.

    మైనస్

    మైనస్

    ఫస్టాఫ్ కాస్త స్లోగా నడవటం, కామెడీ లేకపోవటం మైనస్ లుగా చెప్పుకోవాలి. అలాగే హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్స్ లాగే వాడుకోవటం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

    మేజర్ హైలెట్

    మేజర్ హైలెట్

    సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమషాల సీన్స్ సినిమాకు ప్రాణం. ‘జయహో జనతా..' అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంది. అవే మేజర్ హైలైట్‌గా చెప్పాలి.

    దుమ్ము రేపింది

    దుమ్ము రేపింది

    ఇక ‘పక్కాలోకల్' అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. ఈ పాట ఎన్టీఆర్ స్టెప్స్ తో దుమ్ము రేపింది. సినిమా డల్ అవుతుందనుకున్న టైమ్ లో నిలబెట్టే ప్రయత్నం చేసింది

    ప్రొడక్షన్ వ్యాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్

    సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ కు ఎక్కడా వంక పెట్టలేం కానీ, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నాశిరకంగా ఉన్నాయి. సినిమా స్ట్రాడర్డ్స్ కు తగినట్లే లేవు.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌
    నటీనటులు:ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్, మోహన్‌లాల్‌, సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని తదితరులు
    పాటలు: రామజోగయ్యశాస్త్రి,
    ఛాయాగ్రహణం: ఎస్‌. తిరునావుక్కరసు,
    కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు,
    సంగీతం :దేవిశ్రీప్రసాద్
    కళ: ఎ.ఎస్‌. ప్రకాష్
    ఫైట్స్‌: అణల్‌ అరసు,
    రచన, దర్శకత్వం: కొరటాల శివ.
    నిర్మాతలు:నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌, సి.వి. మోహన్
    విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2016.

    ఫైనల్ గా జనతాగ్యారేజ్ కథకు ఇంకొన్ని రిపేర్లు అవసరం అని చూసాక అనిపిస్తుంది. అయితే మంచి ఎమోషనల్ డ్రామాని చూడటానికి, ఎన్టీఆర్ అండర్ ప్లే చేసిన ఫెరఫార్మెన్స్ చూడటానికి, కాజల్ ఐటం సాంగ్ చూడటానికి ఈ సినిమాకి వెళ్లచ్చు. కానీ రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమా తరాహాలో కామెడీ, కథనంలో స్పీడు , అదిరిపోయే క్లైమాక్స్ వంటివి ఎక్సెపెక్ట్ చేయకుండా ఉంటేనే సుమా.

    English summary
    Young Tiger Jr NTR’s movie Janatha Garage released big screens worldwide on today (September 1st). Samantha and Nithya Menen playing female lead roles. The film is directed by Koratala Siva and produced by Mythri Movie Makers. Devi Sri Prasad scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X