OG Critic Review and Rating: OG మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
RRR లాంటి సినిమాను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయిన నేపథ్యంలో క్రిటిక్ తన రివ్యూను ఆసక్తికరంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమా విశేషాలు, ఆ రివ్యూ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఇక ఈ మూవీని 250 కోట్ల రూపాయలతో భారీగా ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రిచ్‌గా చిత్రీకరించారు.

OG షూటింగ్ దశలో ఉండగానే.. ఈ మూవీ బిజినెస్ క్రేజీగా సాగింది. తెలుగ రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్‌లో రికార్డు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 193 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. దాంత ఈ సినిమా భారీ బాక్సాఫీస్ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌కు ఊరమాస్ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం గురించి దుబాయ్ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ తన రివ్యూను అందించాడు.
OG మూవీని దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్‌గా ఉంది. బ్లడీ మాస్ మూవీ. 2025 సంవత్సరంలో బెస్ట్ థ్రిల్లర్. పవన్ కల్యాణ్ బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. సాలిడ్ కమ్ బ్యాక్ అంటే పవర్ స్టార్ చూపించబోతున్నాడు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ అదిరిపోయింది. ఈ సినిమాకు క్లైమాక్స్ సన్నివేశాలే ప్రాణం. మూవీ చూస్తుంటే మజా వచ్చింది అని ఉమేర్ సంధూ పేర్కొన్నాడు.
ఇక ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్ టెర్రిఫిక్. ఆయన క్యారెక్టర్ స్వాగ్ అదిరిపోయింది. ఆయన చెప్పిన డైలాగ్స్ క్రేజీగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమా పూర్తిగా పైసా వసూలు చిత్రం. ఈ చిత్రానికి నా రేటింగ్ 5 పాయింట్లకు గాను 3.5 పాయింట్స్ అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు. ఈ సినిమా రివ్యూను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు.
అయితే సాధారణంగా ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు కొన్నిసార్లు కరెక్ట్‌గా ఉంటాయి. మరికొన్ని సార్లు దారుణంగా ఇస్తుంటాడు. కానీ OG మూవీపై ఉన్న నమ్మకం కారణంగా ఈ సినిమాపై కరెక్టే చెప్పి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ గురించి, ఈ సినిమా విశేషాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











