»   » ఎంటర్టెన్మెంట్ తప్ప... (‘ఒక అమ్మాయి తప్ప’ రివ్యూ)

ఎంటర్టెన్మెంట్ తప్ప... (‘ఒక అమ్మాయి తప్ప’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మేనల్లుడిగా తరంగ్రేటం చేసిన సందీప్ కిషన్ తొలి నుండి తనను తాను నిరూపించుకోవడానికి, హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సందీప్ కిషన్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా అందులో ప్రేక్షకులకు గుర్తున్న ఒకే ఒక్క సినిమా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'. పెర్ఫార్మెన్స్ పరంగా కుర్రోడు కాస్త విషయమున్నోడే అయినా ఎందుకనో కథలు, పరిస్థితులు కలిసి రావడం లేదు. వరుస ప్లాపులు పలుకరించడంతో ఈ మధ్య అవకాశాలు చాలా తగ్గిపోయాయి.

అయితే మామయ్య చోటాకె నాయుడు సపోర్టు ఉంది కాబట్టి ఎలాగో అలా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సందీప్ కిషన్ చేసిన తాజా సినిమా 'ఒక అమ్మాయి తప్ప'. తప్పనిసరి హిట్టు పడితే తప్ప కెరీర్ ముందుకు సాగని పరిస్థితి. ఈ సినిమాకు సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట పాపం. సందీప్ కిషన్ హీరో అని కాదు కానీ....నిత్యా మీనన్ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ముందు నుండి కాస్త బావున్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా బావుంటుందనే అంచనాకు వచ్చారు అంతా. మరి ప్రేక్షకుల అంచనాలను సందీప్ కిషన్ ఏమేరకు అందుకున్నారు? 'ఒక అమ్మాయి తప్ప' చిత్రానికి బాక్సాఫీసు వద్ద నిలబడే సత్తా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.


కథలోకి వెళితే....
దేశంలో పలు బాంబు పేలుళ్లకు పాల్పడిన ప్రమాదకరమైన ఉగ్రవాది అస్లాంభాయ్(రాహుల్ దేవ్)ను పోలీసులు పట్టుకుంటారు. హైదరాబాద్ జైలు నుండి అతన్ని తప్పించడానికి అన్వర్(రవి కిషన్) ప్లాన్ చేస్తాడు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌కు బాంబు బిగించి ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారు. వందలాది మంది ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటారు. వీరిలో కృష్ణ(సందీప్ కిషన్), మ్యాంగో(నిత్యా మీనన్) కూడా ఉంటారు. తను ప్లాన్ చేసిన రిమోట్ ఆపరేషన్ అమలు చేయడానికి ఖయ్యుం అనే వ్యక్తిని పంపిస్తాడు అన్వర్. అయితే ఖయ్యుం అక్కడికి రాక పోవడంతో అన్వర్ ప్లాన్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల కృష్ణ...ఖయ్యు స్థానంలో ఆ ప్లాన్ అమలు చేయాల్సి వస్తుంది. అసలు అన్వర్‌కి... కృష్ణకి సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే....
సందీప్ కిషన్ పెర్పార్మెన్స్ పరంగా ఓకే. తన పాత్రకు తగిన విధంగా నటించి ఆకట్టుకున్నాడు. అయితే సినిమాలో సందీప్ కిషన్ కంటే పెర్ఫార్మెన్స్ పరంగా హైలెట్ అయింది మాత్రం అన్వర్ పాత్ర పోషించిన రవికిషన్. నిత్యా మీనన్ అందంగా కనిపించింది. సినిమాలో ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం లేక పోయినా...నిత్యా మీనన్ ఉండటంతో వల్లే సినిమా కాస్త కలర్ ఫుల్ గా కనిపించిన ఫీలింగ్ వస్తుంది. ఇంతకు మించి సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు.


విశ్లేషణ...
ఇలాంటి సింగిల్ లైన్ స్టోరీలకు ప్రధాన బలం సస్పెన్స్ గా సాగే స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేకెత్తించే సీన్లు. ఇలాంటి సినిమాల్లో స్టోరీ లైన్ ప్రేక్షకులకు ముందే తెలిసి పోతుంది కాబట్టి....పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి, ప్రేక్షులు బోర్ ఫీలవ్వకుండా సినిమాను నడిపించాలి. నెక్ట్స్ సీన్ ఏమిటీ అనే ఉత్కంఠ వారిలో కలిగించాలి. అప్పుడే సక్సెస్ అయినట్లు. కానీ 'ఒక అమ్మాయి తప్ప' చిత్రంలో అవేవీ కనిపించవు. డల్ గా సాగే స్క్రీన్ ప్లే, మూరెడు ఉండాల్సిన సీన్ బారెడు సాగదీసిన వైనంతో ప్రేక్షకులు విసుగెత్తిపోయే పరిస్థితి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా లేదు. చాలా మంది ప్రేక్షకులు ఊహించేలా ఉంది. ఫస్టాఫ్ మరీ సాగదీసారు. సెకండాఫ్ గొప్పగా చెప్పలేం కాదనీ... ఫస్టాఫ్ కంటే బెటరిన చెప్పొచ్చు. కనీసం లవ్ స్టోరీ అయినా ఆకట్టుకునే విధంగా సాగించాడా అంటే అదీ లేదు.


కమెడియన్లు ఉన్నా ఎంటర్టెన్మెంట్ పండలేదు...

కమెడియన్లు ఉన్నా ఎంటర్టెన్మెంట్ పండలేదు...

సినిమాలో సప్తగిరి, థర్ఠీ ఇయర్స్ పృథ్వీ, తాగుబోతు రమేష్, ధనరాజ్, వేణు, ఫిష్ వెంకట్ లాంటి కమెడియన్స్ ఉన్నాదర్శకుడు వారిని సరిగా వేడుకోలేదు. ఫ్లై ఓవర్ మీద జరిగే తతంగాన్ని లైవ్ కవరేజ్ చేయడానికి నిజం టీవీ జర్నలిస్టులు ఎంటరైన సప్తగిరి ఒక్క సీన్లో కూడా నవ్విచలేదు. వెటర్నరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ పాత్రలో థర్టీ ఇయర్స్ పృథ్వీ కాస్త ఫర్వాలేదనిపించాడు. వేణు, ఫిష్ వెంకట్, ధనరాజ్ పెద్దగా ఆకట్టుకోలేదు.


ప్లస్ పాయింట్స్....

ప్లస్ పాయింట్స్....

సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్
నిత్యా మీనన్ హీరోయిన్ తెరపై కనిపిండం
రవికిషన్ పెర్ఫార్మెన్స్
చోటా కె నాయుడు సినిమాటోగ్రపీ


మైనస్ పాయింట్స్...

మైనస్ పాయింట్స్...

రాజసింహ తాడినాడ దర్శకత్వం
మొదటి నుండి చివరదాకా సాగీసినట్లు ఉండే సీన్లు
ఇలాంటి సినిమాలకు ప్రధాన బలైమన సస్పెన్స్, ఉత్కంఠ రేపే స్కీన్ ప్లే లేక పోవడం
మిక్కీ జే మేయర్ సంగీతం
సిజీఐ(గ్రాపిక్స్) వర్క్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు


చివరగా....

చివరగా....

ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టెన్మెంట్ తప్ప వారు బోర్ ఫీలవ్వడానికి కావాల్సిన అన్నీ అంశాలు ఉన్నాయి.


ఒక అమ్మాయి తప్ప

ఒక అమ్మాయి తప్ప

దర్శకత్వం: రాజసింహ తాడినాడ
నిర్మాణ సంస్థ: అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌
నిర్మాత: బోగాది అంజిరెడ్డి
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంగీతం : మిక్కీ జె మేయర్గమనిక: ఇది రివ్యూ రైటర్ అభిప్రాయం మాత్రమే.


-బిఎస్‌కె

English summary
Okka Ammayi Thappa, Sundeep Kishan and Nitya Menon Starrer, is released today. Produced by Anji Reddy, Okka Ammayi Thappa features Sundeep Kishan and Nithya Menen in the lead roles, with Ravi Kishan playing the role of the villain.
Please Wait while comments are loading...