For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆపరేషన్ 2019 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  1.5/5
  Star Cast: శ్రీకాంత్, దీక్షాపంత్, దీక్షాపంత్, హరితేజ, మంచు మనోజ్, సునీల్
  Director: కరణం బాబ్జీ

  శతాధిక చిత్రాల నటుడు శ్రీకాంత్‌కు మంచి క్రేజ్, పేరు తెచ్చిన చిత్రం ఆపరేషన్ దుర్యోధన. రాజకీయ నేపథ్యంగా రూపొందిన చిత్రంలో ఆయన నటన విమర్శల ప్రశంసలందుకొన్నది. కొద్దికాలంగా ఆచితూచి సినిమాలు చేస్తున్న శ్రీకాంత్ తాజాగా ఆపరేషన్ 2019 అనే పొలిటిక్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిర్మాత అలివేలు రూపొందించిన ఈ చిత్రానికి కరణం బాబ్జీ దర్శకుడు. దీక్షాపంత్, హరితేజ, మంచు మనోజ్, సునీల్ కనిపించిన చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. ఈ చిత్రం శ్రీకాంత్‌కు ఎలాంటి ఇమేజ్ సంపాదించిపెట్టింది? ఆపరేషన్ 2019తో సక్సెస్ చేజిక్కించుకొన్నాడా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ఆపరేషన్ 2019 స్టోరీ

  ఎన్నారై ఉమాశంకర్ (శ్రీకాంత్) సొంత రాష్ట్రం, గ్రామం అంటే చాలా ఇష్టం. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే మంచి మనిషి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయల చెక్ పంపిస్తాడు. కానీ సహాయం అందకరైతులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతారు. ఓ రాజకీయ నేత డబ్బును దుర్వినియోగం చేసిన రాజకీయ నేతను నిలదీస్తాడు. ఆ వ్యవహారంలోనే ఓ కారణం వల్ల ఉమాశంకర్ జైలుకు వెళ్తాడు?

  ఆపరేషన్ 2019‌లో ట్విస్టులు

  ఉమాశంకర్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచే ఎమ్మెల్యే పదవికి ఎందుకు పోటీ చేశాడు? ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ అవినీతి పరుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? భ్రష్టు పట్టిన రాజకీయాలను ఎలా ప్రక్షాళన చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఆపరేషన్ 2019 సినిమా కథ.

  ఫస్టాఫ్‌లో

  ఏపీలోని ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే సీటును జైలు నుంచి ఉమాశంకర్ కొనుగోలు చేసే వ్యవహారంతో కథ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. రాజకీయాల్లో ఉమాశంకర్ దూకూడు ఇంట్రెస్టింగ్ అవుతుంది. యాంకర్ హరితేజ పాట కొంత కిక్కెక్కేంచే అంశమని చెప్పవచ్చు. ఎన్నారై ఉమాశంకర్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశంతో ఫ్యాష్‌బాక్‌లోకి కథ వెళ్తుంది. ఇక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, సమకాలీన రాజకీయాలను నాసిరకంగా చూపడంతో కథపై ఆసక్తి తగ్గిపోతుంది. రొటీన్ సన్నివేశంతో ఇంటర్వెల్ పడటంతో తొలిభాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌లో కథ, కథనాలు

  ఇక ఎమ్మెల్యే ఉమాశంకర్ అవినీతి పనులు, సెక్రెటరీ దీక్షాపంత్‌తో రొమాంటిక్ సన్నివేశాలతో కథ దారి తప్పినట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కథలో ఇంటెన్సిటీని దెబ్బ తీయడానికి కారణమయ్యాయని అనిపిస్తుంది. దీక్షాపంత్ ఎపిసోడ్స్ కథకు గానీ, కమర్షియల్‌గా గానీ పాజిటివ్‌గా మారలేకపోయింది. ఎమ్యెల్యేల పార్టీలు మారడం, క్యాంప్ రాజకీయాలు ఇలాంటి అంశాలు సెకండాఫ్‌లో కలగపులగంగా అనిపిస్తాయి. ఎలాంటి ప్రభావవంతమైన క్లైమాక్స్ లేకుండా రొటీన్‌గా సినిమా ముగుస్తుంది.

  దర్శకుడి పనితీరు

  సమకాలీన రాజకీయాలనే పాయింట్‌తో బలమైన కథను తయారు చేసుకోవడంలో దర్శకుడు కరణం బాబ్జీ తడబాటు గురయ్యాడనే చెప్పవచ్చు. అవసరం లేకున్నా లెక్కలేనన్నీ పాత్రలతో బడ్జెట్‌ను భారీగా పెంచాడనే ఫీలింగ్ కలుగుతుంది. తొలిభాగంలో కనీసం నాలుగు బలమైన సీన్లు, సెకండాఫ్‌లో ప్రేక్షకులను ఆలోచింపజేసే కథను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. మంచు మనోజ్, సునీల్, హరితేజ లాంటి పాత్రలు పూర్తిగా పనికిరాకుండా పోయాయని చెప్పవచ్చు. ఓవరాల్‌గా అంది వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

  శ్రీకాంత్ నటన

  మరోసారి కుటిల రాజకీయ నేతగా శ్రీకాంత్ నటన బాగుంది. కీలక సన్నివేశాల్లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. రైతుల ఎపిసోడ్‌లో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని సీన్లను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఉమాశంకర్‌గా ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు సంధించడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు.

  మిగితా పాత్రల్లో

  ఆపరేషన్ 2019 చిత్రంలో లెక్కకు మంచి నటులు కనిపిస్తారు. హరితేజ, మంచు మనోజ్, సునీల్, యగ్నశెట్టి, పోసాని, నాగినీడు లాంటి పాత్రలు వచ్చిపోతుంటాయి. సునీల్ ప్రత్యేక గీతంతో జోష్ పెంచాడు. క్లైమాక్స్‌లో మంచు మనోజ్ ఎంట్రీ కిక్కు కలిగిస్తుంది. శ్రీకాంత్ పాత్ర తప్ప పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు కనిపించవు. నాగినీడు డబ్బింగ్ పరమ చిరాకుగా ఉంటుంది.

  సాంకేతిక అంశాలు

  సాంకేతి అంశాల్లో సినిమాటోగ్రఫి, మ్యూజిక్ బాగున్నాయి. రాప్ రాక్ షకీల్ అందించిన రీరికార్డింగ్ బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్‌కు ఇంకా చాలా స్కోప్ ఉంది. అలివేలు నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.

  ఫైనల్‌గా

  పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో బలమైన విలన్ లేకుండా తెరకెక్కించిన చిత్రం ఆపరేషన్ 2019. కేవలం శ్రీకాంత్‌పై నమ్మకం పెట్టుకొని తీసిన చిత్రంగా కనిపిస్తుంది. కథ, కథనాలు బలహీనంగా ఉండటం సినిమాకు మైనస్. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వెడెక్కి ఉన్నందున సినిమాకు కొంత క్రేజ్ లభించవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కొంత నచ్చే అంశాలు ఉన్నాయి.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  శ్రీకాంత్ యాక్టింగ్
  సినిమాటోగ్రఫి
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  డైలాగ్స్
  స్లో నెరేషన్

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: శ్రీకాంత్, దీక్షాపంత్, దీక్షాపంత్, హరితేజ, మంచు మనోజ్, సునీల్, నాగినీడు తదితరులు
  దర్శకత్వ: కరణం బాబ్జీ
  నిర్మాత: అలివేలు
  మ్యూజిక్: రాప్ రాక్ షకిల్
  రిలీజ్: 2018-12-01

  English summary
  Srikanth's latest movie is Operation 2019. It is set in a political backdrop. After Operation Dhuryodhana, Srikanth opted another political Thriller. This movie released on Dec 1st. In this occassion, Telugu Filmibeat brings special review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more