For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5

  ప్రేమ కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి లవ్‌లీతో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది సాయి కుమార్. అయితే మొదట్లో వచ్చినన్ని విజయాలు ప్రస్తుతం రావడం లేదు. మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఒక్కటీ ఫలించడం లేదు. రీసెంట్‌గా బుర్రకథ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది కూడా తనకు విజయాన్ని అందించలేకపోయింది. అయితే నేడు (అక్టోబర్ 18) ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ ఆడియన్స్‌ను మెప్పించేందుకు వచ్చాడు. మరి ఈ సారైనా ఆదికి విజయం దక్కుతుందా లేదా అన్నది చూడాలి.

  కశ్మీర్ పండితులు, ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అర్జున్ పండిట్(ఆది సాయి కుమార్) ఎన్ఎస్‌జీ (జాతీయ భద్రతాదళం)లో ఆఫీసర్‌గా పనిచేస్తాడు. తన తల్లిదండ్రులు కాశ్మీరీ పండితులు కావడంతో ఘాజీ బాబా(అబ్బూరి రవి) చంపేస్తాడు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘాజీ బాబాను అర్జున్ బంధిస్తాడు. అయితే అతన్ని విడిపించడానికి ఫారుఖ్ (మనోజ్ నందం) ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ను ప్రారంభిస్తాడు.

   కథలో ట్విస్టులు..

  కథలో ట్విస్టులు..

  ఉగ్రవాది అయిన ఫారుఖ్ చేసే ఆ ఆపరేషన్‌లో గోల్డ్ ఫిష్ ఎవరు? గోల్డ్ ఫిష్‌ను కాపాడటానికి అర్జన్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ కథలో కార్తీక్ రాజు, సాల్మాన్ (నూకరాజు) , తానియా (సాషా ఛెత్రీ), నిత్య (నిత్యా నరేష్) పాత్రలేంటి? చివరకు ఘాజీ బాబాను ఏం చేశాడు? అనేవి తెరపై చూడాలి.

  ఫస్టాఫ్ అనాలిసిస్...

  ఫస్టాఫ్ అనాలిసిస్...

  ఒక పథకం వేసి ఘాజీబాబాను పట్టుకున్న అర్జున్.. పై అధికారుల ఒత్తిడితో అతన్ని చంపేయకుండా వదిలిపెడతాడు. అయితే చట్టం ప్రకారం అతనికి ప్రత్యేక న్యాయస్థానం ఉరి వేస్తుంది. మరో వైపు ఘాజీ బాబాను విడిపించుకోవడానికి ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కథనాన్ని మళ్లీ రోటీన్‌గా మార్చేశాడు. ఒక కాలేజ్, ఫ్రెండ్స్, ప్రేమ అంటూ నీరు గార్చేశాడు. బోర్ కొట్టించే సన్నివేశాలతో ఏమాత్రం ఆసక్తిలేకుండా అలా ముందుకు సాగుతూ ఉంటుంది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  ఆ నలుగురు టూర్‌కు వెళ్లడం.. వారిని వెతకడానికి.. ఓ వైపు అర్జున్ టీమ్ వెళ్లడం.. మరో వైపు ఫారుఖ్ వెతకడం జరుగుతూ ఉంటుంది. అక్కడైనా కథనాన్ని ఆసక్తికరంగా మలుచుతాడేమో అనుకుంటే చేతులెత్తేశాడు. సినిమా పాయింట్ ఎంత బలంగా ఉందో.. కథనం అంత బలహీనంగా ఉంది. విసుగుపుట్టించే సీన్స్‌తో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాడు. చివర్లో కూడా ఏదో చేయాలని ప్రయత్నించాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు.. రొటీన్ క్లైమాక్స్‌ను ఇచ్చేశాడు.

  నటీనటుల పర్ఫామెన్స్...

  నటీనటుల పర్ఫామెన్స్...

  అర్జున్ పండిత్ పాత్రలో ఆది పర్వాలేదనిపించాడు. తన పాత్రకు ఆది న్యాయం చేశాడు. తానియా పాత్రలో సాషా ఛెత్రి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదట తననే మెయిన్ క్యారెక్టర్‌గా చూపించినా.. చివర్లో తేలిపోయేలా చేశాడు. లుక్స్ పరంగానూ, నటనపరంగానూ మెప్పించలేకపోయింది. ఫారుఖ్ పాత్రలో మనోజ్ నందంను చూడలేకపోయాయి. టెర్రరిస్ట్‌గా ఏ మాత్రం సరిపోలేదు. బాడీలాంగ్వేజ్ గానీ, హావభావాలు గానీ ఉగ్రవాదిని గుర్తు చేయవు. అబ్బూరి రవి లుక్, నటన పర్వాలేదనిపించాయి. మిగతా పాత్రల్లో కార్తీక్ రాజు, నూకరాజు, నిత్యా నరేష్, అనీష్ కురువిల్లా, రావు రమేష్, కృష్ణుడు, రామ జోగయ్య శాస్త్రి తమ పరిధి మేరకు నటించారు.

  దర్శకుడి పనితీరు...

  దర్శకుడి పనితీరు...


  దేశంలో ప్రస్తుతం రగులుతున్న సమస్యను పాయింట్‌గా తీసుకుని, సమకాలీన విషయాలను కూడా ప్రస్తావించాడు. ఆర్టికల్ 370, 35ఏ లాంటి వాటి గురించి మాట్లాడాడు. అయితే ఈ కథకు అనుకున్న పాయింట్‌కు రాసుకున్న కథనానికి పొంతన ఉండదు. జాతీయ స్థాయి సమస్యను మళ్లీ రొటీన్ కథనంతో చెప్పడంతో బోల్తాపడ్డాడు. ఏ మూలన కూడా సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించలేకపోయాడు.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  ఈ సినిమా శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా మారవచ్చు. కొన్ని సీన్స్‌ను నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. పాటలు ఉన్నా కూడా లేనట్టే అనిపించింది. జైపాల్ రెడ్డి కెమెరా పనితనం బాగానే ఉంది. కశ్మీర్ అందాలను బాగానే చూపించాడు. సినిమా చూసిన ప్రేక్షకుడికి గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పని చెప్పలేదేమోననే ఆలోచన కలుగుతుంది.

  నిర్మాణ విలువలు..

  నిర్మాణ విలువలు..

  ఇక సినిమాను ఉన్నతంగా చూపించడానికి చిత్ర యూనిట్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కాశ్మీర్‌లోని కొన్ని ప్రదేశాలను అద్భుతంగా చూపించారు. అయితే చిత్రయూనిట్ పడిన కష్టానికి మాత్రం.. సరైన ఫలితం రాలేదేమోనని అనిపిస్తుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  సంగీతం
  ఆది సాయి కుమార్
  సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్స్
  కథనం
  ఎడిటింగ్
  దర్శకత్వం

  ఫైనల్‌గా...

  ఫైనల్‌గా...

  కశ్మీర్ అంశం, పాక్ ఉగ్రవాదం ఇలాంటి వాటితో దేశభక్తిని కలిగించవచ్చు కానీ థియేటర్‌కు రప్పించలేము. అలాంటి పాయింట్‌కు ఇలాంటి రొటీన్ స్క్రీన్ ప్లేను ఉపయోగించడంతో దర్శకుడు చెప్పాలనకున్న పాయింట్ ఎంతమందికి రీచ్ అవుతుందన్న చూడాలి.

  English summary
  Operation Gold Fish Is A Action film written and directed by Adivi Sai Kiran. The film stars Aadi Sai KUmar And Sasha Chettri, Nithya Naresh Along With Some Famous Actors. This movie released on October 18, 2019.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X