twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pachchis Movie Review: సాగతీతతోనూ సస్పెన్స్ లో ముంచేసిన పచ్చీస్

    |

    2.5/5
    star cast : రామ్జ్ , శ్వేతా వర్మ, రవివర్మ, దయానంద్ రెడ్డి, సుభలేఖ సుధాకర్, విశ్వేందర్ రెడ్డి
    directors: శ్రీ కృష్ణ & రామ్ సాయి
    producers : కౌశిక్ కుమార్ రామ్ సాయి

    ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే కొత్త దర్శకులు ఎక్కువగా ఈ జానర్స్ మీద దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా ఇలాంటి కథలకు స్కోప్ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పచ్చీస్ అనే సినిమాని రూపొందింది. కొత్త దర్శకులు కొత్త హీరోతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది ? సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో నిజంగానే ప్రేక్షకులని సస్పెన్స్ కు గురి చేసిందా ? లేదా ? అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా కథాకథనాలు ఏమిటో చూద్దాం.

    పచ్చీస్ కథ ఏమిటంటే

    పచ్చీస్ కథ ఏమిటంటే

    ఈజీ మనీ అనే అంశం చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులైన బసవరాజు(కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి)- గంగాధర్(శుభలేఖ సుధాకర్) మధ్య ఆధిపత్య పోరును ఆసరాగా చేసుకుని అభిరామ్(రామ్స్) అనే జులాయిగా తిరిగే కుర్రవాడు ఎలా తన పబ్బం గడుపు డానికి ప్రయత్నించి చివరికి, బాధ్యత కలిగిన మనిషిగా మారాడు అనే లైన్ తో సినిమా రూపొందించారు. బాధ్యతలు లేకుండా జులాయిగా తిరిగే అభిరామ్ బెట్టింగ్ ఆడి ఓడిపోవడంతో పాతిక లక్షలు కట్టాల్సి వస్తుంది. ఆ పాతిక లక్షల కోసం బసవరాజు - గంగాధర్ మధ్య జరుగుతున్న వార్ లోకి ఎంటర్ అయి ఎలా బయటపడ్డాడు ? ఆ పాతిక లక్షలు కట్టాడా లేదా ? మధ్యలో అవంతిక(శ్వేత వర్మ) పాత్ర ఏమిటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    ఈజీ మనీ కోసం ఏమాత్రం కష్టపడకుండా గ్యాంబ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అభిరామ్ మొత్తంమీద పాతిక లక్షల రూపాయలు అప్పుల పాలవుతాడు. ఈ క్రమంలో బసవరాజు అలాగే గంగాధర్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎంటర్ అవుతాడు. ఈ క్రమంలోనే అతనికి పరిచయమవుతుంది అవంతిక. ఆమె ఎంట్రీ మొదలు సినిమా అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఎవరూ ఊహించని ట్విస్టులు సినిమాలో అనేకం ఉన్నాయి. ఇక చివరికి గంగాధర్ బసవరాజు మధ్య పోటీ ఎలా ముగిసింది ? అభిరాం మనిషిగా ఎలా మారాడు ? అందులో అవంతిక పాత్ర ఏమిటి ? అనే ట్విస్ట్ లు బాగా కుదిరాయి.

     ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    సినిమా మొదలైనప్పటి నుంచి మొత్తం ఎక్కువగా డార్క్ జానర్ లో చూపించడానికి దర్శకులు ప్రయత్నించారు. తెలిసిన ముఖాలు కొన్నే అయినా సరే లైన్ మంచిదే, కానీ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా మొదటి భాగం అంతా హీరో క్యారెక్టరైజేషన్ ని చూపించే ప్రయత్నం చేశారు, అలాగే లేడీ లీడ్ అవంతిక సోదరుడి కోసం వెతుకుతున్న క్రమంలో పరిచయమైన పాత్రలు ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి.

    సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే

    సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే

    సెకండ్ హాఫ్ విషయానికొస్తే దర్శకుడు కథను త్వరగా తేల్చకుండా చాలా సాగదీసినట్లు అనిపించింది.. పాయింట్ చిన్నదే అయినా ఎందుకో అనవసరమైన ల్యాగ్ చేసినట్లు అనవసర సీన్లు ఎక్కువగా కనిపిస్తాయి. పాతిక లక్షల చుట్టూ తిరిగే ఈ సినిమా కథ మొత్తాన్ని తక్కువ నిడివిలో చేయగలిగినా ఎందుకో దర్శకులు అటు తిప్పి ఇటు తిప్పి నిడివి పెంచడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. రెండు గంటల సినిమా అయినా, అది కూడా నిడివి ఎక్కువ అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి రాక తప్పదు.

     నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే

    నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే

    సెలబ్రిటీ స్టైలిస్ట్ గా పనిచేసి హీరోగా మారిన రామ్స్ నటన ఈ సినిమాలో ఒక ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన చేసింది మొదటి సినిమా అయినా సరే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అనేక సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా నటించాడు. ఇక గతంలోనే కొన్ని సినిమాలు చేసిన శ్వేతా వర్మ కూడా చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా బాగా కుదిరాయి.

     మిగతా పాత్రల విషయానికి వస్తే

    మిగతా పాత్రల విషయానికి వస్తే

    ఇక కాసినో ఓనర్ గా నటించిన రవి వర్మ, రాజకీయ నాయకులుగా నటించిన శుభలేఖ సుధాకర్, కొమ్మిడి విశ్వెంధర్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 దయా, అభిరామ్ స్నేహితులుగా నటించిన ఇద్దరూ, ఎవరికి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. కాకపోతే ఫస్టాఫ్ లో శ్వేత వర్మ సోదరుడి కోసం వెతుకుతున్న సమయంలో అనేకమందిని పరిచయం చేయడంతో ఆ పాత్రల విషయంలోనే జనాల్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.

    ఇక టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    ఇక టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    ఈ సినిమాకి దర్శకులుగా వ్యవహరించిన శ్రీ కృష్ణ, రమా సాయి మొదటి సినిమాతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు, సినిమా లాగ్ విషయం పక్కనపెడితే మిగతా అన్ని విషయాల్లో బాగా కుదిరింది. ఇక నిర్మాతలుగా వ్యవహరించిన కౌశిక్ కుమార్ రమా సాయి నిర్మాణ విలువలు బాగున్నాయి. డార్క్ జానర్ కావడంతో ఎక్కువగా కెమెరా పనితనం కూడా చూపించాల్సి వచ్చింది, ఆ విషయంలో కార్తీక్ పర్మర్ పనితనం కనిపించింది. ఇక పాటలు ఏమీ లేకపోయినా స్మరణ్ సాయి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఎడిటర్ గా చేసిన రాణా ప్రతాప్ తన కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా సాగే ఉండేది అని చెప్పక తప్పదు.

    ఫైనల్ గా చెప్పాలి అంటే

    ఫైనల్ గా చెప్పాలి అంటే

    పైకి ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే అనిపించినా మన దేశంలో పాతుకుపోయిన పొలిటికల్ లీడర్స్ అక్రమాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. పోలీసులతో లింకులు పెట్టుకుని పొలిటికల్ లీడర్స్ ఎలా గేమ్స్ ఆడుతారు అనే విషయం మీద ఈ సినిమా చేసినట్లు అనిపించింది. కాస్త సాగదీత అనే విషయం పక్కన పెడితే ఈ కరోనా సమయంలో మంచి టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో చాలా వరకూ తర్వాత ఏం జరగబోతోంది అనే అంశం మీద ప్రేక్షకుడికి ఒక అవగాహన వస్తుంది. కానీ ఈ సినిమాలో అలా ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా దర్శకులు డీల్ చేసిన విధానం బాగుంది.

    English summary
    Pachchis is a action thriller movie directed by Sri Krishna and Rama Sai. The movie casts Raamz and Swetha Varma are in the lead roles along with Jay Chandra, Ravi Varma, Dayanand Reddy, Keshav Deepak, Subhalekha Sudhakar and Vishwendar Reddy are seen in supporting roles. The Music composed by Smaran Sai while cinematography done by Kartik Parmar and it is edited by Rana Prathap. The film is produced by Kaushik Kumar Kathuri and Rama Sai under the banners Avasa Chitram, Raasta Films banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X