twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులపై పంజా(రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్ధ: సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్.
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా, అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
    కెమెరా: పి.ఎస్.వినోద్
    ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్
    యాక్షన్: శామ్‌కౌశల్
    సంగీతం :యవన్ శంకర్ రాజా
    ఆర్ట్: సునీల్‌బాలు
    స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా
    సంభాషణలు: అబ్బూరి రవి
    స్టైలింగ్: అనూవర్థన్
    నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో చాలా చాలా అంచనాలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నాడో ఏమో కానీ పవన్ కళ్యాణ్ ఈ సారి ఓ తమిళ ధర్సకుడు సాయింతో దారణంగా పంజా విసురుతూ ధియోటర్స్ లో దిగాడు. దానికి స్టైలిష్ ఎంటర్టైనర్ అని పేరు పెట్టినా ఎక్కడా ఎంటర్టైనింగ్ అనేది మచ్చుకైనా లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విజృంభించాడు.దానికి తోడు దర్శకుడు సైతం ప్రతీ సీన్ హీరో ఇంట్రడక్షన్ లాగ తీయాలనుకున్నారే కానీ,హీరో ఎలివేట్ అవ్వాలంటే నెగిటివ్ రోల్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలన్నిది మర్చిపోయి కథనం నడిపాడు. ఉన్న కాస్త నెగిటివ్ పాత్ర ఇంటర్వెల్ కే చనిపోవటంతో సినిమా సెంకండాఫ్ హీరోకి పెద్దగా పనిలేక సహన పరీక్ష పెడుతూ,అభిమానుల ఆశలపై నీళ్లు పోస్తూ సా...గి..పోయింది. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన శైలిలో తనకే చెల్లు అనేలా మాఫియా వ్యక్తిగా చెలరేగిపోయాడు.

    కలకత్తా మాపియా డాన్ భగవాన్ (జాకీ ష్రాఫ్)నమ్మిన బంటు జై(పవన్). అయితే ఆ నమ్మకం,విశ్వాసం భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు)విదేశాల నుంచి రావటంతో పరీక్షకు గురి అవుతుంది. మున్నా ఓ డ్రగ్ ఎడిస్ట్,ఉమనైజర్. సర్లే మన బాస్ కొడుకే కదా అని జై సరిపెట్టుకుందామనుకున్నా మున్నా వచ్చి డైరక్ట్ గా జై గర్ల్ ప్రెండ్(నాట్ లవర్)పై కన్నేసి,ఒప్పుకోలేదని చంపేసేదాకా వెళ్ళతాడు. దాంతో రగిలిపోయిన జై ..మున్నాని చంపేస్తాడు. అప్పుడు తన కొడుకుని చంపేసాడని తెలుసుకున్న భగవాన్ కోపంతో మండిపోయి,జై ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.అలాంటి స్ధితిలో జై తనని తాను రక్షించుకునేందుకు ఆ డాన్ ని చంపేస్తాడా లేక తనపై కత్తి ఎత్తినవాడు తనకి లైఫ్ ఇచ్చిన వాడే కదా అని వదిలేస్తాడా...అలాగే ఇలాంటి ఈ కథలో హీరోయిన్ ఏం చేస్తుంది వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే తప్పని సరిగా సినిమా చూసి తీరాల్సిందే.

    2002లో వచ్చిన Road to Perdition చిత్రాన్ని గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం “సాయిం పొందినవాడు కృతజ్ఞత చూపించపోవటం ఎంత తప్పో..చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు" అనే డైలాగుతో ప్రారంభమవుతుంది.అయితే ఆ లైన్ లో కథ అల్లుకుందామనుకున్నా ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి కథ పూర్తైపోయింది.ఎవరైతే కథలో నెగిటివ్ పాత్ర ఉన్నారో వాళ్ళను ఇంటర్వెల్ కు ముందే హీరో చంపేస్తాడు.దాంతో సెకండాఫ్ లో నెగిటివ్ ఫోర్స్ లేక కథనం దారి తప్పింది.మిగతా కథ నడపటం కోసం హీరోని హీరోయిన్ గ్రామానికి పంపి,అక్కడ బ్రహ్మానందం అనే పోలీస్ పాత్రను పెట్టి కామిడీ చేసి,అక్కడ గ్రామ సమస్యలు అతడు సినిమాలోలాగ తీర్చే ప్రయత్నం చేస్తూ వేరే సినిమా చూస్తున్న ఫీల్ కలుగచేస్తుంది.దాంతో కథలో కాంఫ్లిక్ట్ లేక డ్రామా మిస్సై,సినిమా అనాసక్తికరంగా మారిపోయింది. ఇక లవ్ ట్రాక్ విషయానికి వస్తే దానికీ సినిమాకి సంభందం లేకుండా పోయింది.బ్రహ్మానందం కామిడీ కూడా అనుకున్నంతగా పేలలేదు.

    ఇక సినిమా మొదటనుంచీ చెప్తూ వస్తున్నట్లుగా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లోనే ఉంది. దర్శకుడు కెమెరా,షార్ప్ ఎడిటింగ్ మీద పెట్టిన శ్రద్ద ఎందుకనో కథ,కథనం మీద పెట్టలేదని స్పష్టం అవుతుంది. ఇక పాటల్లో ఇప్పటికే హిట్టైన వాటికి ధియోటర్లో మంచి రెస్పాన్సే వచ్చింది.సినిమా ఎండ్ అయ్యాక వచ్చే పంజా టైటిల్ సాంగ్ హైలెట్ గా ఉంది.ఆ పాటలో పవన్ ఎప్పటిలాగే తన డాన్స్ మూవ్ మెంట్స్ ని అదరకొట్టారు.అలాగే బ్రహ్మానందం మీద వచ్చే పాపారాయుడు పాటు కూడా చాలా బాగుంది.డైలాగులు చాలా మెచ్యూర్డ్ గా రాసారు. వింటూన్నప్పుడు బాగానే ఉన్నా ఓ మాఫియా వ్యక్తి నోటి నుంచి అలాంటి డైలాగులు వింటూంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ఆర్టిస్టుల్లో పవన్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీలేదు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఆమెకిదే లాస్ట్ సినిమా అవుతుందేమో అనిపించేలా నటించిపారేసింది.విలన్ గా వేసిన అడవి శేషు మాత్రం పవన్ కి పోటీగా నటించాడు.

    ఇక ఈ సినిమాకి ఏకైక ప్లస్ పవన్. కాబట్టి పవన్ కళ్యాణ్ ని కొత్తగా చేసాడు..చూద్దామనుకునే వాళ్ళు పంజాకి వెళ్లటం మంచిది.అలాగే కలకత్తాలో ఉన్న మాఫియా అంతా తెలుగు వాళ్లేనా,వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్లేనే అని డౌట్ లు పెట్టుకోవద్దు..ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కనిపించే మాఫియా ప్రపంచంలో ఏ దేశంలో అయినా తెలుగు వాళ్లే ఉంటారని గుర్తు చేసుకోండి.

    English summary
    Panja movie starring Pawan Kalyan released today with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X