twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరిచయం మూవీ రివ్యూ: స్వచ్ఛమైన ప్రేమకథ

    By Rajababu
    |

    rating:3/5

    టాలీవుడ్‌లో ప్రేమ కథా చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రేక్షకులకు వచ్చిన చిత్రం పరిచయం. హైదరాబాద్ నవాబ్స్, నిన్న, నేడు, రేపు చిత్రాలకు దర్శకత్వం వహించిన లక్ష్మీకాంత్ చెన్నా రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఇంటెన్సిట్ లవ్‌స్టోరిగా ప్రచారమైంది. సెన్సిబుల్ టైటిల్‌, ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ ఈ చిత్రానికి ప్లస్‌గా మారాయి. విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ జంటగా రూపొందిన పరిచయం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సెన్సిబుల్ లవ్‌స్టోరి ఏలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను అలరించబోతున్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     పరిచయం స్టోరి

    పరిచయం స్టోరి

    సుబ్రమణ్యం (రాజీవ్ కనకాల), సాంబశివరావు (పృథ్వీ) ఇద్దరు మంచి స్నేహితులు. అరుకులో రైల్వే ఉద్యోగులుగా పనిచేస్తుంటారు. రాజీవ్‌కు ఆనంద్ (విరాట్ కొండూరి) కొడుకు, పృథ్వీకి లక్ష్మీ (సిమ్రత్ కౌర్) అనే కూతురు ఉంటారు. పక్క పక్క క్వార్టర్లలో ఉండే వీరిద్దరూ ప్రేమలో పడుతారు. పరువు, ప్రతిష్ఠల కారణంగా తన కూతురు ప్రేమను పృథ్వీ నిరాకరిస్తాడు. దాంతో ఆనంద్‌కు దూరమవుతున్నానే కారణంతో లక్ష్మీ విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. నా మాటను పెడచెవిన పెట్టడంతో కూతురును వదిలేస్తాడు. అయితే విషం ప్రభావంతో లక్ష్మీ భయంకరమైన పరిస్థితుల్లో కూరుకుపోతుంది.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    లక్ష్మీకి ఎలాంటి సమస్య ఎదురైంది? తన కారణంగా లక్ష్మీ తీవ్రమైన సమస్య ఏర్పడితే ఆనంద్ ఏం చేశాడు. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆనంద్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? చివరికి లక్ష్మీని, ఆమె ప్రేమను ఎలా దక్కించుకొన్నాడు? చివరికి ఈ జంటను కుటుంబ సభ్యులు ఆదరించారా? అనే ప్రశ్నలకు సమాధానమే పరిచయం చిత్రం కథ.

     ఫీల్‌గుడ్ అంశాలతో

    ఫీల్‌గుడ్ అంశాలతో

    ఒకే రోజు ఆనంద్, లక్ష్మీ పుట్టడం అనే ఫీల్‌గుడ్ అంశంతో సినిమా ఆరంభమవుతుంది. ఒకే కాలేజీలో చదుకోవడం, ఇద్దరి మధ్య ఆకర్షణ పెరిగి ప్రేమగా మారడం లాంటి అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ముందు షాకింగ్ ట్విస్టుతో కథ మరో మలుపు తిరుగుతుంది.

    సెకండాఫ్‌లో పరిచయం

    సెకండాఫ్‌లో పరిచయం

    సెకండాఫ్‌లో సమస్య నుంచి లక్ష్మీని గట్టెక్కించడానికి ఆనంద్ పడిన పాట్లు భావోద్వేగంగా ఉంటాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా లక్ష్మీ కోసం బతుకుపోరాటం చేయడం సినిమాకు బలమైన అంశంగా మారుతుంది. చివర్లో సమస్య నుంచి బయటపడిందనుకొని సంతోషించే సమయంలో ఆనంద్‌ ప్రాణాలకు ముప్పు ఏర్పడటం మరో ట్విస్ట్‌గా మారుతుంది. చివరికి ఓ ఫీల్‌గుడ్ అంశంతో సినిమాకు ముగింపు పలుకుతారు.

    మరోసారి విభిన్నంగా లక్ష్మీకాంత్ చెన్నా

    మరోసారి విభిన్నంగా లక్ష్మీకాంత్ చెన్నా

    విభిన్నమైన జోనర్లలో చిత్రాలను రూపొందించిన దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మరోసారి అందమైన ప్రేమకథతో ముందుకొచ్చాడు. మనసంత నువ్వే, వసంతకోకిల లాంటి బ్యాక్‌డ్రాప్‌తో చక్కగా స్క్రిప్టును రూపొందించుకొన్నారు. ప్రేమకథకు కావాల్సిన లోకేషన్లను ఎన్నుకోవడంతోనే సక్సెస్ బాట పట్టారని చెప్పవచ్చు. ఇంటర్వెల్‌ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు కథను నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. కాకపోతే రొటీన్‌గా కొన్ని సీన్లను, మరీ ముతకగా క్లైమాక్స్‌ను తెరకెక్కించడం కొంత అసంతృప్తి కలుగుతుంది.

    హీరోగా విరాట్ కొండూరి

    హీరోగా విరాట్ కొండూరి

    విరాట్ కొండూరికి హీరోగా తొలిచిత్రమైన ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తెరపైన రాణించాడు. కీలకమైన సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పలికించాడు. సినిమా భారాన్ని ఒంటిచేత్తో మోశాడని చెప్పవచ్చు. ఫైట్స్, పాటలు, డైలాగ్ డెలివరీతోనూ మెప్పించాడు. భవిష్యత్‌లో హీరోగా రాణించేందుకు అన్ని రకాల యోగ్యుడు అనే ఫీలింగ్ కల్పించాడు.

    అందంగా సిమ్రత్ కౌర్

    అందంగా సిమ్రత్ కౌర్

    లక్ష్మీ పాత్రలో సిమ్రత్ కౌర్ కనిపించారు. అందంతో ఆకట్టుకొన్నారు. నటనపరంగా మరికొంత శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. పాటలు, ఎమోషనల్ సీన్లలో తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు.

    రాజీవ్ కనకాల, పృథ్వీ

    రాజీవ్ కనకాల, పృథ్వీ

    ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిసులుగా కనిపించిన రాజీవ్ కనకాల, పృథ్వీ తండ్రి పాత్రల్లో కనిపించారు. పరువు ప్రతిష్టల కోసం పరితపించే తండ్రిగా పృథ్వీ, ఎలాంటి పట్టింపులు లేని తండ్రిగా రాజీవ్ కనకాల నటించారు. వీరిద్దరూ సినిమాకు వెన్నముకగా నిలిచారు. పరుచూరి వెంకటేశ్వరరావు అక్కడక్కడ మెరిశారు.

    శేఖర్ చంద్ర సంగీతం

    శేఖర్ చంద్ర సంగీతం

    పరిచయం చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. నరేష్ కే రానా సినిమాటోగ్రఫీ బాగుంది. మనాలీ, అరకు, కాకినాడ అందాలను అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నాడు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ క్రిస్పీగా బాగుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    పరిచయం చిత్రానికి నిర్మాతగా రియాజ్ వ్యవహరించారు. అమెరికాలో వ్యాపారవేత్త అయిన ఆయన సినిమాపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సాంకేతిక నిపుణుల, నటీనటుల ఎంపిక ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలిచింది.

    పైనల్‌గా

    పైనల్‌గా

    ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రేమికురాలి కోసం ప్రియుడు తన జీవితాన్ని పణంగా పెట్టిన చిత్రమే పరిచయం. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కింది ఈ చిత్రం. ఫీల్‌గుడ్ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల కథలో కొట్టొచ్చినట్టు కనిపిపించే కొన్ని లోపాలు మరుగునపడిపోతాయి. వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే మంచి అనుభూతిని అందిస్తుంది ఈ చిత్రం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    కథ, కథనం
    సంగీతం
    సినిమాటోగ్రఫీ
    హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్
    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    రొటీన్ సన్నివేశాలు
    పేలవమైన కామెడీ

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, రాజీవ్ కనకాల, పృథ్వీ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు
    దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
    సినిమాటోగ్రఫీ: నరేష్ కే రానా
    సంగీతం: శేఖర్ చంద్ర
    ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
    రిలీజ్ డేట్: 2018-07-21

    English summary
    Parichayam audio movie audio launched by directors Harish Shankar, Sudhir Varma, Producer Bekkam Venu Gopal. Laxmikanth Chenna was the director for the movie. Virat and Simrat Kaur are the lead pair. This movie is released on July 21st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X