twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రయోగాల వేళ ( ' గోపాల గోపాల ' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    "నేను టైమ్ కు రావటం కాదు మిత్రమా...నేను వచ్చాకే టైమ్ వస్తుంది " అంటూ ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ కృష్ణుడుగా వచ్చేసాడు. అయితే ఈ సారి ఓ ప్రయోగం లాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రంతో వచ్చారు. తన పాత్రకు రెగ్యులర్ మసాలా దినుసులు(హీరోయిన్స్, రొమాన్స్,పాటలు,ఫైట్స్) లేకపోయినా బాగుందనిపించారు. ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలు కొన్ని ఆలోచనలో పడేసే దిసగా ప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్, తో నింపటం జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఓ ప్రయోగంగా చూస్తే బాగుందనిపించే ఈ చిత్రం కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. అవన్నీ ప్రక్కన పెడితే పవన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో... వాటిని ప్రక్కన పెట్టి మెసేజ్ తో కూడిన ఇలాంటి చిత్రంతో ముందుకు రావటం మాత్రం అభినందనీయం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

    దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

    మనకి దేముడే దిగివస్తే తరహా కథలు కొత్తేమి కాదు. అయితే ఇందులో బ్యూటీ అంతా... దేముడు మీద కేసు వేయటం అనే అంశం. ఈ ఐడియా చుట్టూ అల్లిన ఈ కథ కు తెలుగులో మరింత అర్దమయ్యేలా(అర్దవంతంగా కాదు) ట్రీట్ మెంట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. వాస్తవానికి 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా 'ఓ మై గాడ్‌'. తెరకెక్కింది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించింది. పూర్తి డ్రామాతో నడిచే ఈ రెండు చిత్రాలుకు స్టార్ వ్యాల్యూ కన్నా కాన్సెప్ట్ బలంగా వెళ్లి ప్రేక్షకులను థియోటర్ వైపు నడిపించాయి. అయితే తెలుగులో మొదటి నుంచి ఇది పవన్ కళ్యాణ్ చిత్రం, మల్టి స్టారర్ చిత్రం అంటూ ప్రచారం చేసారు. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రం కదా అని ఎక్కువ అంచనాలు ఏర్పడి,బిజినెస్ బాగా జరిగినా లోపలకి వెళ్లి చూస్తే పవన్ కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే....అదీ ఏమీ చేసినట్లు ఉండదు. మొత్తం వెంకటేష్ చుట్టూ తిరుగుతూంటుంది. ఫస్టాఫ్ కేసు వేయటం, పవన్ రావటం దాకా బాగున్న ఈ చిత్రం కథనం, సెకండాఫ్ లో డ్రాగ్ అవుతూ వస్తుంది. సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అలాగే నెగిటివ్ పాత్ర సైతం ఎస్టాబ్లిష్ సరిగ్గా కాకపోవటం(కేవలం ఫైట్స్ కోసం...అదీ పవన్ సేవ్ చేయటం కోసమే పెట్టినట్లున్నాయి) జరిగింది.ఈ కథ అంతిమ లక్ష్యం...వెంకటేష్ పాత్ర కేసు నెగ్గటమా లేక అతను నాస్తికత్వం వదలి దేముడు ఉన్నాడని అర్దం చేసుకోవటమా అనేది మరింత క్లారిటిగా చెప్తే బాగుండేది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

    ఇంకెంచెం పెంచితే బాగుండేది..

    ఇంకెంచెం పెంచితే బాగుండేది..

    ఇంటర్వెల్ ముందు వచ్చే పవన్..థియోటర్స్ ని దద్దరిల్లేలా చేసాడంటేనే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. ఫస్టాఫ్ లో ఎలాగూ లేడు..సెకండాఫ్ లో అయినా ఉండాడా అంటే...అవీ చాలా తక్కువ సన్నివేశాల్లో కనపించాడు. కోర్టు వంటి సీన్స్ లో అయితే అలా వచ్చి నిలబడి వెళ్లిపోతాడు. కొన్ని డైలుగులు మినహాయిస్తే, ప్లూటు వాయించే సన్నివేశం తప్పిస్తే ఆ పాత్ర పెద్దగా ఆకట్టుకునేలా డిజైన్ చేయలనిపిస్తుంది.

    ఏం చేసిందామె

    ఏం చేసిందామె

    శ్రియ వంటి హీరోయిన్ ని పెట్టుకున్నారు...కానీ ఆమె కేవలం అలా వచ్చి వెళ్లిపోతూంటుంది. ఆమె పాత్ర పరిధి పెంచి కథలో ఆమెను సైతం కలిపితే బాగుండేది.

    ట్రిమ్ చేయాలేమో

    ట్రిమ్ చేయాలేమో

    సినిమాలో చాలాసార్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ని లీడ్ చేసే సీన్స్ ని ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా పెంచితే బాగుండేది.

    హైలెట్

    హైలెట్

    సినిమాలో పెద్ద హైలెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. మోడ్రన్ కృష్ణుడుగా ఆయన చాలా బాగా నప్పారు. ఆలోచింప చేసే డైలాగులను చాలా ఇంట్రస్టింగ్ మూడ్ లో చెప్పారు.

    మరో హైలెట్

    మరో హైలెట్

    సినిమా లో నెగిటివ్ టచ్ ఉన్న లీలాధర స్వామీజీ పాత్ర చేసిన మిధున్ చక్రవర్తి మరో హైలెట్ అని చెప్పాలి. ఢిఫెరెంట్ మాడ్యూలేషన్ తో,బాడీ లాంగ్వేజ్ తో బాగా చేసారు. 30 ఇయిర్స్ ఫృధ్వీ చిన్న సీన్ అయినా అదరకొట్టారు.

     డైలాగులు

    డైలాగులు

    ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిన మరో హైలెట్... డైలాగ్స్... "మనిషి దేవుడ్ని రాయిగా మార్చాడు, నిజంగా దేవుడే కనుక ఉంటే మనిషిని మనిషిగా మార్చమనండి చాలు" , అలాగే కురక్షేత్ర యుద్దం గురించి పవన్ చేత చెప్పించిన డైలాగులు చాలా బాగున్నాయి. "దారి చూపించడం వరకే నా పని...గమ్యాన్ని చేరుకోవడం మీ పని" , "నేను టైం కి రావడం కాదు తమ్ముడు..నేను వచ్చాకే టైం అవుతుంది" , "బరువు చూసే వాడికి కాదు మిత్రమా...మోసే వాడికి తెలుస్తుంది" , "సమర్థులు ఇంట్లో ఉండి పోతే...అసమర్థులు రాజ్యమేలుతారు" వంటివి బాగా పేలాయి.

    పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    ఈ చిత్రంలో పాటలు కి పెద్ద అవకాసం లేదు. ఉన్నంతలో చేసిన భజే భాజే పాట విజువల్ గానూ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతం కాదుకానీ బాగుందనే చెప్పాలి,

    వెంకటేష్

    వెంకటేష్

    వెంకటేష్ ఎప్పటిలాగే కామెడీ టచ్ తో చేద్దామని ప్రయత్నించాడు. డ్రస్ దగ్గర నుంచి హిందీ ని అనుకరించకుండా ఉంటే బాగుండేది. అలాగే వెంకటేష్ ని చివర్లో క్లైమాక్స్ ముందు ...రౌడీ లు వచ్చి కత్తితో పొడిచేస్తే కృష్ణుడు వచ్చి రక్షించటం ఉండదు కానీ హాస్పటిల్ లో ఉన్నప్పుడు అదే కృష్ణుడు వచ్చి బ్రతికిస్తాడు..అదేదో ముందే రక్షించవచ్చు కదా అనే డౌట్ మనకు రాకుండా ఉండేలా సీన్ రాసుకుంటే బాగుండేది.

    నేటివిటీ సమస్య

    నేటివిటీ సమస్య

    ఇదే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన గబ్బర్ సింగ్...ఒరిజనల్ మించి హిట్టవటానికి కారణం...దానికి అద్దిన నేటివిటి. అదే ఈ సినిమాలో కరువయ్యింది. ఓ మైగాడ్ ని తెలుగు చేసినట్లు ఉంది కానీ ...గోపాల గోపాల తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ తీసుకురాలేకపోయారు.

    సామాజిక అంశాలు

    సామాజిక అంశాలు

    శివుడుకి పాలు అభిషేకం చేయటం కన్నా ఆ పాలు వేరే వారికి ఇవ్వండి వంటి సామాజిక సందేశాలు ఈ సినిమాలో బోల్డు ఉన్నాయి. అయితే భక్తి కోణంతో చూస్తే అవి తేలిపోతాయి.

    దర్శకత్వం

    దర్శకత్వం

    రీమేక్ అద్బుతంగా చేసినా ఒరిజనల్ కే ఆ క్రెడిట్ పోతుంది. అయితే ఈ సినిమాని చాలా సాదా సీదాగా డీల్ చేసారు దర్శకుడు. ఎక్కడా దర్శకత్వ మెరుపులు లేకుండా జాగ్రత్తలు పడ్డారు. అలాగే స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే రిపీట్ నెస్ తగ్గి మరింత స్పీడుగా కథనం ఉండేది. పవన్ నుంచి సాధారణ ప్రేక్షకులు ఆశించే కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్:నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్
    నటీనటులు: మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు.
    కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల
    స్క్రీన్‌ప్లే : కిశోర్‌కుమార్ పార్థసాని ,భూపతిరాజా, దీపక్‌రాజ్
    కెమెరా: జయనన్ విన్సెంట్
    మాటలు: సాయిమాధవ్ బుర్రా
    సంగీతం: అనూప్ రూబెన్స్
    పాటలు:చంద్రబోస్
    ఎడిటింగ్: గౌతమ్‌రాజు
    ఆర్ట్: బ్రహ్మ కడలి
    నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్
    దర్శకత్వం: కిశోర్ పార్థసాని(డాలీ).
    విడుదల తేదీ: 10-01-2015

    ఏది ఎలా ఉన్నా... మూఢ నమ్మకాలు, దొంగ స్వాములుపై వ్యంగ్య బాణంలాంటి ఇలాంటి ఆలోచనాత్మక చిత్రాలు తెలుగులో రావాల్సిన సమయం వచ్చింది. అందుకు పవన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు తమ ఇమేజ్ లు వదిలి ముందుకు రావటం శుభపరిణామం. పవన్ ఉన్నాడని ఆయన రెగ్యులర్ చిత్రం లాగ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి.

    English summary
    Gopala Gopala starring Pawan Kalyan and Venkatesh in the lead roles. Check out this exclusive review of the movie. It is the remake of Hindi superhit movie OMG-'Oh My God'. The Telugu version has created a huge buzz in Tollywood and Telugu audience are expecting too much from this multi-starrer movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X