»   » ఫీల్ గుడ్ మూవీ... (పెళ్లి చూపులు మూవీ రివ్యూ)

ఫీల్ గుడ్ మూవీ... (పెళ్లి చూపులు మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

హైదరాబాద్: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూతన గీత బ్యానర్స్ పై రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టెనర్ 'పెళ్ళి చూపులు'. రాజ్ కందుకూరి, యస్ రాగినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మంచి స్పందన వచ్చింది. సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా కాస్త డిఫరెంటుగా ఉంటుందనే ఫీల్ ట్రైలర్ ద్వారా కలించడంలో వారు సఫలం అయ్యారు. మరి సినిమా ఆ రేంజిలో ఉందా? లేదా? అనేది చూద్దాం...

కథ విషయానికొస్తే...

ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)... లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తూ ఇంజనీరింగ్ అతికష్టం మీద సప్లిలు రాసి పాసైనఇప్పటి జనరేషన్ కుర్రాడు. ఎంబీఏ పూర్తి చేసి సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్న అమ్మాయి చిత్ర (రీతు వర్మ). పనీ పాట లేకుండా తిరిగే ప్రశాంత్‌‌కు పెళ్లి చేయాలని, అప్పుడైనా జీవితం మీద బాధ్యత వస్తుందని చిత్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు.

సొంతగా వ్యాపారం చేస్తానంటే ఇంట్లో సపోర్టు లేకపోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో... ఈ పెళ్లి చేపులకు సిద్ధమవుతుంది చిత్ర. కట్ చేస్తే పెళ్లి చూపుల్లో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పుడ్ ట్రక్ బిజినెస్ చేసి సొంతగా తన కాళ్ల మీద నిలబడాలనే ఆలోచన ఉందనే విషయం చెప్పి పెళ్లి నిరాకరిస్తుంది.

దీంతో ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ అక్కడ కూడా వర్కౌట్ కాక పోగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రశాంత్‌కు వంటలు చేయడం అంటే ఇష్టం. దీంతో చిత్రతో కలిసి ట్రక్ బిజినెస్‌లో జాయిన్ అవుతాడు. రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వీరి జీవితాల్లో పెళ్లి చూపులు తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత ఏమైంది? అనేది అసలు స్టోరీ...

స్లైడ్ షోలో పూర్తి రివ్యూ..

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.... విజయ్ దేవరకొండ తన పాత్రలో సూపర్బ్ అనిపించాడు. బాద్యతలేని ఇప్పటి తరం కుర్రాడి పాత్రలో నేచురల్‌‌గా నటించాడు.

రీతూ వర్మ

రీతూ వర్మ

రీతూ వర్మ కూడా హీరో క్యారెక్టర్ తో పోటీ పడుతూ నటించింది. ఈ తరం అమ్మాయిల ఆలోచనలకు అద్దం పట్టేలా ఇండిపెండెంట్ అమ్మాయిగా రీతూ వర్మ మెప్పించింది. సినిమాలో హీరోతో పాటు బలైమన పాత్ర హీరోయిన్‌కు దక్కడం చాలా తక్కువ. రీతూ వర్మ తన కెరీర్లో బెస్ట్ రోల్ ఈ సినిమా ద్వారా దక్కించుకుందని చెప్పొచ్చు.

కెమిస్ట్రీ

కెమిస్ట్రీ

దీంతో పాటు సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇతర నటీనటులు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే..

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే..

టెక్నికల్ అంశాల్లో నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీతో పాటు, వివేక్ సాగర్ సంగీతం బాగా హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిటింగ్ కూడా చక్కగా ఉంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ టెక్నికల్ విభాగాలను సమన్వయ పరిచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. రాజ్ కందుకూరి - యాష్ రంగినేని నిర్మాణ విలువలు బావున్నాయి.

దర్శకత్వం

దర్శకత్వం

తరుణ్ దర్శకత్వం బావుంది. అతను కథను చెప్పిన విధానం బావుంది. సింపుల్‌గా, సినిమా చూసే ప్రేక్షకుడికి ఫీల్ గుడ్ అనే అనుభూతి పొందేలా స్క్రీన్ ప్లే నడిపించాడు. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నటీనటుల నుండి తనకు కావాల్సింది రాబట్టుకున్నాడు. సినిమాలోని దాదాపు అన్ని సన్నిశాల్ని సహజంగా మలిచాడు. కొన్ని సినిమాల్లో అనవసర పాత్రలు చాలా కనిపిస్తాయి. అయితే ఇందులో అలాంటివేమీ కనిపించవు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కథలో లీనం అయ్యేలా సినిమాను నిపించాడు.

మైనస్

మైనస్

మైనస్ పాయింట్లు ఉన్నాయి...
అయితే ఎంచుకున్న కథ విషయంలో సినిమాకు మైనస్ మార్కులే అని చెప్పక తప్పదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు జరుగబోయేది ఏంటి అనేది ముందే తెలిసేలా ఉంది. సెకండాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదించడం కూడా ఓ మైనస్.

చివరగా...

చివరగా...

అప్పట్లో ఆనంద్ సినిమా ఎలాంటి మంచి ఫీల్ ఇస్తుంది...అదే తరహాలో పెళ్లి చూపులు మూవీ ఫీల్ గుడ్ అనేలా బావుంది, అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చక పోవచ్చు.

నటీనటులు

నటీనటులు

నటీనటులు: విజయ్ దేవరకొండ - రితు వర్మ - నందు - అనీష్ కురువిల్లా - గురురాజ్ మానేపల్లి - ప్రియదర్శి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాతలు: రాజ్ కందుకూరి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: తరుణ్ భాస్కర్

English summary
Check out Pelli Choopulu movie review. The romantic comedy is directed by Tarun Bhaskar and has Vijaya Devarakonda and Ritu Varma as the main leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu