twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమంటే అంతేనా?

    By Staff
    |

    Premante Inte
    సినిమా: ప్రేమంటే ఇంతే
    విడుదల తేదీ: 14-04-2006
    నటీనటులు: నవదీప్‌, రూపాలి, పూనమ్‌, ఆలీ,
    వేణుమాధవ్‌, చిత్రం శ్రీను, జ్యోతి, నరేష్‌, ఐశ్వర్య,
    శరత్‌బాబు, జాకీ, అన్నపూర్ణ, సత్యకృష్ణ, ధర్మవరం సుబ్రహ్మణ్యం, జెన్నీ తదితరులు
    సంభాషణలు: మరుదూరి రాజా
    ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
    కెమెరా: హరి అనుమోలు
    సంగీతం : కోటి
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి. రమణ
    నిర్మాత: స్రవంతి రవికిశోర్‌

    సున్నితమైన హాస్యంతో ప్రేమ కథలను పండించే స్రవంతి రవికిశోర్‌ మరో సరదా ప్రయత్నం 'ప్రేమంటే ఇంతే'. 'సోచా న థా' (హిందీ చిత్రం)కి రీమేక్‌ ఇది. అసభ్యత, హింసలకు తావు ఇవ్వకుండా క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ దీన్ని మలచడం అభినందనీయం. హీరో పాత్రతో ఏర్పడ్డ నెగెటివ్‌ షేడ్స్‌ హైలెట్‌ కాకుండా ఉండి యువతరానికి ఐడెంటిటీ దొరికితే విజయం సాధిస్తుంది. లేకుంటే అంతే!

    తన మనస్సులో ఏముందో తనకే తెలియక తికమకపడి అందర్నీ ఇబ్బంది పెట్టే యువకుని కథ ఇది. వీరూ (నవదీప్‌) ఓ డబ్బున్న సరదా కుర్రోడు. డబ్బుసు సంపాదించే తండ్రి (శరత్‌బాబు), అన్న (జాకీ) ఉన్నారు కాబట్టి డబ్బును ప్రేమించే అవసరం లేదని భావించి గత కొద్ది కాలంగా లిజీ (రూపాలి) అనే ఆంగ్లో ఇండియన్‌ను ఆరాధిస్తుంటాడు. భయంతో ఇంట్లోవాళ్లకే కాకుండా ఆమెకి కూడా ఆ విషయాన్ని చెప్పలేకపోతాడు. దాంతో ఇంట్లో పెద్దలు మరో గొప్పింటి అమ్మాయి పావని (పూనమ్‌)ని ఎంపిక చేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వీరూ ఆమెతో తన మనసుని, అందులో కొలువై వున్న లెజీని పరిచయం చేస్తాడు. దాంతో ఆమె అతని ప్రేమకు సహకరిస్తానని చెప్పి ఈ తతంగం పెళ్లి దాకా పోనీయకుండా చేయడానికి ఒప్పుకుంటుంది. దాంతో రెండు కుటుంబాల మధ్య కురుక్షేత్రం ప్రారంభమవుతుంది. అంతేగాక వీరూ తన ప్రేమను తెలియజేయడానికి వైజాగ్‌ వెళ్తుంటే పావని సహకరిస్తుంది. ఇలా చాలాసార్లు కలుస్తూ విడిపోతూ ఇద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడిపోతారు. మరో పక్క వీరూ ఇంట్లోవాళ్లు లీజీతో పెళ్లికి ఒప్పుకుంటారు. దాంతో పావనిని వీరూని కలవొద్దని వార్నింగ్‌ ఇస్తారు. ఎవరిద్దరు కలిశారనేది తెరపై చూడాల్సిందే.

    బాయ్‌ మీట్స్‌ గర్ల్‌ తరహా రోమాంటిక్‌ కామెడీని సాధ్యమైనంత వరకు డైలాగులతోనే నెట్టుకొచ్చారు. సీన్‌లు కూడా బోర్‌ కొట్టకుండా స్పీడ్‌గానే లాగారు. కానీ ప్రధాన పాత్రల వ్యక్తిత్వాల రూపకల్పనలో లోపాలు ఉండటంతో హీరో పాత్ర కొన్ని సీన్లలో (లీజీని వదలించుకునే సీన్‌లో) నెగెటివ్‌ షేడ్స్‌ కావడం అయోమయానికి గురి చేసింది. చివరికి లెజీ పాత్ర హైలెట్‌ అయి ఆమెపై సానుభూతి పెరగడం స్క్రీన్‌ప్లే లోపమే. హీరో పాత్ర తన ప్రేమ కోసం ఏమీ చేయలేక పాసివ్‌ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది. హీందీలోనూ ఇదే సమస్య. దీన్ని సవరించి ఉంటే బాగుండేది. లెజీ పాత్రను ముగింపు లేకుండా చేయటంతో స్పష్టత లేకుండా పోయింది. సెకండాఫ్‌లో కథ తగ్గటంతో వేణుమాధవ్‌ కామెడీ ట్రాక్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

    ముఖ్యంగా సినిమాలో హీరో ప్రేమకు అడ్డం అతని అయోమయ మనః స్థితే. క్లైమాక్స్‌కు వచ్చే సరి కన్నా క్యారెక్టర్‌ గ్రోత్‌ కనపడితే బాగా రాణించేది. దర్శకత్వ పరంగా మామూలుగా ఉన్నా బోర్‌ కొట్టనీయకుండా నడిపారు. సంగీతపరంగా పాటలు సగటుస్థాయిలో వున్నాయి. టైటిల్‌ సాంగ్‌ బాగుంది. నటీనటుల్లో నవదీప్‌ మార్పు లేని నటన. పూనమ్‌ మాజీ తార రాశిలా మారేలా ఉంది. సత్యకృష్ణను పెద్దగా వాడుకోలేదు. మరుదూరు రాజా కామెడీ షరా మామూలే. కెమెరా, ఎడిటింగ్‌ వంక పెట్టలేని విధంగా ఇమిడిపోయాయి. ఏది ఏమైనా యూత్‌ను టార్గెట్‌ చేసి తీసిన వాళ్లు ఐడెంటిఫై అయితే విజయం సాధిస్తుంది. ఫ్యామిలీస్‌కు కాలక్షేప చిత్రం.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X