Just In
- 3 hrs ago
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
- 4 hrs ago
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- 4 hrs ago
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
- 5 hrs ago
అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Technology
బెటర్ సెక్యూరిటీతో క్వాల్కామ్ 3డి సోనిక్ మ్యాక్స్
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ప్రేమించు-మంచి చిత్రం
నటీనటులు: సాయికిరణ్, లయ, రూప, మురళీమోహన్, లక్ష్మి.
సంగీతం: శ్రీలేఖ
నిర్మాత: డి.రామానాయుడు
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
ఉత్తమ చిత్రాలు నిర్మించి అవార్డులు సంపాదించాలనే ఉద్దేశంతో రామానాయుడు ఈ మధ్య కొన్ని చిత్రాల నిర్మాణానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నంలో రూపొందించిన చిత్రం- ప్రేమించు. అయితే ఇది ఉత్తమ చిత్రం అని చెప్పలేం కానీ మంచి చిత్రం అనే చెప్పొచ్చు. మెలోడ్రామా, సెంటిమెంట్ సీన్స్ కొన్ని తగ్గిస్తే సినిమా ఇంకా ఆకట్టుకొని ఉండేది. కథపరంగా కొత్తదనం లేకున్నా కన్వీన్సింగ్ గా చెప్పడంవల్ల ఈ సినిమా బాగున్నట్లు అనిపిస్తుంది. హరి అనుమోలు ఫోటోగ్రఫీ చిత్రానికి రిచ్ నెస్ తీసుకువచ్చింది. ప్రతిఫ్రేమ్ రిప్రెషింగ్ ఉండేలా చిత్రీకరించాడు. అన్నింటకన్నా తనికెళ్ళ భరణి కామెడీ సీన్స్ బాగున్నాయి.
లయ చుట్టూ కథ తిరుగుతుంది. గుడ్డిదైన లయను కష్టపడి పెంచుతాడు మురళీమోహన్. భార్య కూతురును వదిలి వెళ్ళిపోయినా తల్లితండ్రి తనై పెంచుతాడు. లయకు కళ్ళు లేకున్నా అన్నీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకుంటుంది. కష్టపడి చదివి లాయర్ అవుతుంది. కాలేజ్ లో సాయికిరణ్ ను ప్రేమిస్తుంది. పెళ్ళిచేసుకుందామనుకుంటుంది. కానీ సాయికిరణ్ మేనత్త లక్ష్మి ఇందుకు ఒప్పుకోదు. లక్ష్మి ఎవరో కాదు, లయ తల్లి అని తెలుస్తుంది. కూతురు గుడ్డదని మురళీమోహన్ కు డైవర్స్ ఇస్తుంది.కొడుకులాగా పెంచిన సాయికిరణ్ కు లయను ఇచ్చి పెళ్ళిచేయాలంటే ఆమె మనసు ఒప్పుకోదు. చివరికి లయ, సాయికిరణ్ ల ప్రేమ ఫలిస్తుందా లేదా అన్నది క్లైమాక్స్.
లయ నటన బాగుంది. పరిణతి ఉంది. సాయికిరణ్ పాత్ర తక్కువ. మురళీమోహన్, లక్ష్మిలు తమ పాత్రలను చక్కగా పోషించారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి హాస్యం హాయిగా ఉంది. శ్రీలేఖ సంగీతం ఫర్వాలేదు. కీరవాణి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు శ్రీలేఖ. మొత్తమ్మీద చూడదగ్గ చిత్రం.