For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదరగొట్టిన రాజశేఖర్.. (‘పిఎస్‌వి గరుడ వేగ’ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  3.0/5
  Star Cast: రాజశేఖర్, పూజాకుమార్, శ్రద్ధాదాస్, సన్నీలియోన్, నాజర్
  Director: ప‌్ర‌వీణ్ స‌త్తారు

  Recommended Video

  PSV Garuda Vega Public Talk పబ్లిక్ టాక్..

  హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకుంటూ 'పిఎస్‌వి గరుడ వేగ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

  గుంటూరు టాకీస్, చందమామ కథలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'పిఎస్‌వి గరుడ వేగ' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

  కథ ఏమిటంటే...

  కథ ఏమిటంటే...

  పి. చంద్రశేఖర్ (రాజశేఖర్) ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుండి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పని చేసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన విధి నిర్వహణలో భాగంగా కేసు విచారిస్తున్న శేఖర్ కు పాతబస్తీ చార్మినార్ సమీపంలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన విషయం తెలుస్తుంది. ఆ బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేసిన అతడు ఈ కేసును డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ప్రమాదకరమైన అణ్వాయుధాలు తయారీకి ఉపయోగించే ప్లూటోనియం స్మగ్లింగ్ జరుగుతుందని తెలుస్తుంది. దేశంలో ఇప్పటి వరకు జరిగిన స్కాములన్నింటినీ తలదన్నే అతిపెద్ద స్కామ్ విషయం బయట పడుతుంది. ప్లూటోనియం స్కాముకు ఉత్తరకొరియాకు సంబంధం ఉంటుంది. ప్రపంచ దేశాలు సైతం షాకయ్యే ఈ కేసును శేఖర్ ఎలా సాల్వ్ చేశాడు? ‘పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' అంటే ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

  రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

  రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

  ‘పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సినిమాలో రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ ప్రశంసించే విధంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టాడు. లుక్స్ పరంగా కూడా బావున్నాడు.

  కీలకమైన పాత్రల్లో....

  కీలకమైన పాత్రల్లో....

  సినిమాలో ఇతర నటీనటుల గురించి మాట్లాడుకుంటే.... రాజశేఖర్ భార్య పాత్రలో పూజా కుమార్ కనిపించేది తక్కువ నిడివే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో అదిత్ అరుణ్ నటించాడు. రాజశేఖర్‌తో అతడి కాంబినేషన్ బావుంది. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ ఓకే.

  మెయిన్ విలన్

  మెయిన్ విలన్

  ఈ చిత్రంలో నటుడు కిషోర్ మెయిన్ విలన్‌గా నటించాడు. భయంకరమైన లుక్స్, రోబో హ్యాండ్ తో సినిమా పోస్టర్లలో కనిపించిన కిషోర్ పాత్ర గురించి చాలా ఊహించుకున్నారు. ఆయన పాత్ర ఊహించిన స్థాయిలో లేదని చెప్పడం కంటే అంత అవకాశం ఇవ్వలేదని చెప్పొచ్చు.

  ఇతర తారాగణం

  ఇతర తారాగణం

  ఈ చిత్రంలో పోసాని కృష్ణ‌ముర‌ళి ప్రతిపక్ష నాయకుడి పాత్రలో నటించాడు. పోసాని ఉంటే సీన్లు ఏ రేంజిలో ఊహించుకుంటామో...అదే స్థాయిలో ఉన్నాయి. ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

  ప్రేక్షకుడిని చివరి వరకు ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే

  ప్రేక్షకుడిని చివరి వరకు ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే

  ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించారు. సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో అసలు ఎక్కడా బోర్ ఫీలయ్యే విధంగా లేకుండా బాగా హ్యాండిల్ చేశారు.

   కథ ఎలా ఉంది?

  కథ ఎలా ఉంది?

  కథ విషయానికొస్తే.... డిఫరెంట్ స్టోరీ అని చెప్పలేం కానీ, పరమ రొటీన్ అనే పదానికి దూరంగా ఉంది. ఏం జరుగబోతోందో ప్రేక్షకులు ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. అద్భుతమైన కథ కాక పోయినా జస్ట్ ఓకే.

  ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి

  ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి

  సినిమాలోని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జార్జిలోని డ్యామ్ వద్ద తీసిన సీన్లు, మరికొన్ని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది.

  బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్

  బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్

  ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. పాటలు ఫర్వాలేదనే విధంగా ఉన్నాయి. భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని యాక్షన్ సీన్లను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది.

  ఫస్టాఫ్, సెకండాఫ్

  ఫస్టాఫ్, సెకండాఫ్

  సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే..... ఫస్టాఫ్ ప్రతీ సీను ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టుకుని చూసేలా బావుంది. అయితే సెకండాప్ విషయానికొచ్చేసరికి టిపికల్ తెలుగు యాక్షన్ సినిమాలా సాగింది.

  సన్నీ లియోన్ ఐటం సాంగ్

  సన్నీ లియోన్ ఐటం సాంగ్

  సీరియస్‌గా సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోప్పించడం కాస్త కష్టమే. అయితే అందుకోసం సినిమాకు సూటయ్యేలా సందర్భాన్ని క్రియేట్ చేసి సన్నీ లియోన్ ఐటం సాంగ్ పెట్టారు. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  రాజశేఖర్ పెర్ఫార్మెన్స్
  ప్రవీణ్ సత్తారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే
  సినిమాటోగ్రఫీ
  బ్యాగ్రౌండ్ స్కోర్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్

  సెకండాఫ్‌లో కొన్ని సీన్లు

  ఫైనల్‌గా...

  ఫైనల్‌గా...

  పిఎస్‌వి గరుడ వేగ చిత్రం రాజశేఖర్ కెరీర్లో ఇదో మంచి యాక్షన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది.

  తారాగణం

  తారాగణం

  రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, శ్రద్ధ దాస్ , సన్నీలియోన్ , ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టించారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.

  English summary
  PSV Garuda Vega is receiving a positive response from the audience. The movie directed by Praveen Sattaru starring Rajasekhar, Pooja Kumar, Kishore and Shraddha Das in the lead roles. The racy action-thriller hit the screens today. Starring Dr. Rajasekhar in the role of a gusty, sharp-witted NIA officer, this one boasts of superb action sequences and rich technical values.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X