twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేసాడు కానీ...(రాజన్న రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: అన్నపూర్ణ స్డూడియోస్‌
    నటీనటులు: నాగార్జున, స్నేహ, బేబీ అని, శ్వేతామీనన్‌, నాజర్‌, అజయ్‌, సుప్రీత్‌, ప్రదీప్‌రావత్‌, ముఖేష్‌రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు.
    సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
    యాక్షన్ డైరక్టర్ : ఎస్.ఎస్.రాజమౌళి
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    ఛాయాగ్రహణం: శ్యామ్ కే నాయుడు, అనీల్ బండారి మరియు పూర్ణ
    నిర్మాత: అక్కినేని నాగార్జున
    దర్శకత్వం: విజయేంద్రప్రసాద్‌

    తెలంగాణా ఉద్యమం ఊపందుకుంటున్న ఈ రోజుల్లో అస్సలు తెలంగాణా పోరు చరిత్ర ఏమిటి..గతంలో తెలంగాణాలో జరిగిన ఉద్యమాలు ఏమిటి..ముఖ్యంగా రజాకార్ల ఉద్యమ ప్రాముఖ్యత వంటివి తెరపై తీసుకురావాలనుకోవటం అభినందించాల్సిన విషయం. అదీ ఓ కమర్షియల్ హీరో నటిస్తూ నిర్మించటం నాగార్జునకే చెల్లింది. అయితే చరిత్రపై సినిమా అనగానే చాలా వరకూ నిబద్దత అవసరం..ఎంత ఫిక్షన్ కథ అయినా ఆ నేపధ్యంలో చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆ కాలాన్ని,అప్పటి పాత్రలను వెతుక్కోవటానికి,తెలుసుకోవటానికి ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తాడు. అయితే ఈ సినిమా పై మొదలైన అంచనాలుకు అణుగుణంగా రాజన్న లేదనే చెప్పాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తడబాటు,వీక్ క్లైమాక్స్ సినిమాని కొంత నీరసపరిచింది. అయితే కీరవాణి అధ్బుతమైన పాటలు,నాగార్జున ఎమోషన్స్ పండించిన తీరు,పాట నటన,రాజమౌళి ఏక్షన్ ఎపిసోడ్స్ ఆ లోటుని కొంత వరకూ భర్తీ చేసేందుకు ప్రయత్నించాయి.

    స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అదిలాబాద్ జిల్లా నేలకొండపల్లిలో దొరసాని(శ్వేతా మీనన్)దౌర్జన్య పాలన నడుస్తూంటుంది. ఆ పల్లెల్లో ఉన్న చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) తన పాటతో అక్కడ జనాల్ని చైతన్యవంతులను చేస్తూంటుంది. అది గిట్టని దొరసాని మల్లమ్మపై పగ పట్టి వెంటపడుతుంది. ఈ నేఫద్యంలో దొరసానికి ఆ పాప మరెవరో కాదు తమ దొరల పాలనను అంతం చేసే పనిలో మరణించిన రాజన్న(నాగార్జున)అనే పోరాట యోధుడు కూతురని నిజం తెలుస్తుంది. దాంతో రక్తం మరిగిన ఆమె..ఈ చిన్నారి మల్లమ్మనిచంపటానికి రెడీ అవుతుంది. ఈలోగా మల్లమ్మకు కూడా తను రాజన్న కూతురనని అనే నిజం తెలుస్తుంది.ఈ లోగా ఆ దొరసాని నుంచి తప్పించుకున్న మల్లమ్మ ఆ ఊరుని దొరల పాలన నుంచి తప్పించటానకి ప్రధాని నెహ్రూని కలవాలని డిల్లీకి కాలనడకన బయిలుదేరుతుంది. ఈ లోగా అస్సలు తన తండ్రి రాజన్న ఎంత గొప్పవాడు అనే విషయాలు తెలుసుకుంటుంది. చివరకు మల్లమ్మతన లక్ష్యం నెరవేర్చుకుందా..దొరసాని ఏమైంది అనే విషయాలు తెరపై చూడాల్సిందే.

    పాప పాయింటాఫ్ వ్యూలో కథను ప్రారభించిన ఈ సినిమాలో...పాప తెలుసుకునే రాజన్న కథ ప్రారంభమయ్యే సరికే దాదాపు ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ కథను పూర్తి చేసే సరికి క్లైమాక్స్ కు కథ చేరుకుంటుంది. దాంతో తన తండ్రి కథ విని ఉత్తేజుతురాలైన ఆ పాప ఏం చేసిందనేదానికి పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఆ కథ వినకముందే ప్రధానిని కలవటానికి ఆ పాప బయిలుదేరింది. అంటే ఆ పాప ప్రత్యేకంగా కథ వినటం వల్ల ఒరిగిందేమి లేదు..ప్రేక్షకుడుకి ఆమెను అడ్డం పెట్టి రాజన్న కథ చెప్పటం తప్ప. అదే పూర్తిగా పాప లేకుండా రాజన్న కథ అయితే ఇలాంటి సమస్య రాకపోను. లేదా..రాజన్న కథ విన్న తర్వాత ఆ పాప ఏం చేసిందనేది ఉన్నా క్లైమాక్స్..సెకండాఫ్ బలం వచ్చేది. ఇది కథన సమస్యే అనిపిస్తుంది.

    ఇక ఆ విషయం ప్రక్కన పెడితే మొదటే చెప్పుకున్నట్లుగా నాగార్జున,కీరవాణి,రాజమౌళి,బేబి అని ఈ నలుగురూ నాలుగు పిల్లర్లై సినిమాని మోసారు. నాగార్జున తన పాత్రకు ప్రాణం పోసారు. ముఖ్యంగా నాగార్జున ఇంట్రడక్షన్ సీన్..బ్రిటీష్ వారితో పోరాడేటప్పుడు, స్నేహని రక్షించే సీన్స్ వంటివి బాగా పండాయి. ఫస్టాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ ని విజియేంద్రప్రసాద్ బాగా పండించారు. ఇక రాజమౌళి యాక్షన్ సీన్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. గ్రాఫిక్స్,కెమేరా వర్క్ చాలా బాగుంది. అయితే నాగార్జున చేత తెలంగాణా స్లాంగ్ లో డైలాగులు చెప్పిస్తే,మరికొంత పాత్రలో ఐడింటిఫై దొరికేది అనిపిస్తుంది. ఇక పాటల్లో..గిజ్జిగాడు,వెయ్యిరా..వెయ్యి పాటలు సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. స్నేహ,తెలంగాణా శకుంతల వంటి వారు సినిమాకు ఎప్పటిలాగే ఉపయోగపడ్డారు.

    గతంలో మాభూమి చిత్రం తీసినప్పుడు దర్శకుడు గౌతమ్ ఘోష్ ..తెలంగాణా జిల్లాలన్నీ పర్యటించి...ప్రతీ జిల్లా యాసను పరిశీలించి..సినిమాకు సరిపడేది పెట్టుకున్నాడని సినీ చరిత్ర చెపుతుంది. అంతేగాక ..అందులో హీరో సాయిచంద్ నడక సైతం అక్కడ ప్రాంత ప్రజలను కొద్ది రోజులను పరిశీలించి మరీ ప్రాక్టీస్ చేయించాడని చెప్తారు. అలాంటి జాగ్రత్తలు చరిత్ర నేపధ్యంలో చేసే ఇలాంటి సినిమాలకు అవసరం అని ఈ సినిమా చూస్తున్నప్పుడు మరోసారి గుర్తుకు వస్తుంది.

    ఏదైమైనా రాజమౌళి దర్శకత్వంలో నాగార్జున చేస్తే ఎలా ఉంటుంది అన్నదాని కోసం,కీరవాణి పాటలు కోసం ఈ సినిమా చూడవచ్చు.

    English summary
    Nagarjuna's Rajanna movie released today with Positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X