twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajayogam movie హీరో, హీరోయిన్ల 150 లిప్‌లాక్స్.. ఫుల్ నాన్‌వెజ్ కామెడీ ఎంటర్‌టైనర్

    |

    Rating: 2.75/5

    సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు
    రచన దర్శకత్వం: రామ్ గణపతి
    నిర్మాత: మణి లక్ష్మణ్‌రావు
    సహ నిర్మాతలు: డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్
    సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్
    ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
    సంగీతం: అరుణ్ మురళీధరన్
    డైలాగ్స్: చింతపల్లి రమణ
    పీఆర్వో: జీఎస్కే మీడియా
    బానర్: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
    రిలీజ్ డేట్: 2022-12-30

    రాజయోగం కథ ఏమిటంటే?

    రాజయోగం కథ ఏమిటంటే?

    మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన రిషి (సాయి రోనక్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొంటే జీవితం సెటిల్ అవుతుందని కలలు కంటుంటాడు. ఓ రోజు హైదరాబాద్‌ స్టార్ హోటల్‌లో ఉంటే ఓనర్‌కు కారు అప్పగించడానికి వెళ్లి.. అక్కడ శ్రీ (అంకిత సాహా) తొలి చూపులోనే ప్రేమిస్తాడు.

    అయితే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే కోరికతో వయసు మళ్లిన బిజినెస్ మ్యాగ్నెట్ (జీవా) రిలేషన్‌పిప్ పెట్టుకొంటూనే రిషితో శారీరక సుఖాన్ని పొందుతుంది. అయితే శ్రీపై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సమయంలో రిషికి షాకిచ్చి.. డేనియల్ (సిజ్టు) వద్ద వజ్రాలను కాజేయాలని గ్యాంగ్‌స్టర్ రాధా (అజయ్ ఘోష్)తో జత కలుస్తుంది.

    రాజయోగం సినిమాలో ట్విస్టులు

    రాజయోగం సినిమాలో ట్విస్టులు

    కారు అప్పగించడానికి వెళ్లిన రిషి ఫైవ్ స్టార్ హోటల్‌లోనే ఎందుకు ఉండిపోయాడు? రిషిని శ్రీ ఎందుకు ప్రేమించింది? రిషి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు.. కారు మెకానిక్ అనే విషయం శ్రీకి ఎలాంటి పరిస్థితుల్లో తెలిసింది? రాధా, డేనియల్ సిజ్జు మధ్య వజ్రాల గొడవ ఏమిటి? రిషి, శ్రీ ప్రేమ కథలోకి ఐశ్వర్య (బిస్మీ నాస్) ఎందుకు వచ్చింది? అసలు ఐశ్వర్య ఎవరు? వజ్రాల కోసం జరిగిన దొంగాటతో ఐశ్వర్యకు ఎలాంటి సంబంధం ఉంది? కారు మెకానిక్ అని శ్రీ వదిలేసి వెళ్లిన తర్వాత రిషి పరిస్థితి ఏమిటి? చివరికి ఐశ్వర్య, శ్రీలో ఎవరిని రిషి పెళ్లి చేసుకొన్నాడు? చివరికి వజ్రాల దక్కించుకోవడానికి జరిగిన దోబూచులాటలో రాధా, డేనియల్ పరిస్థితి. వేల కోట్ల విలువైన వజ్రాలు చివరికి ఎవరికి దక్కాయి అనే ప్రశ్నలకు సమాధానమే రాజయోగం అనే సినిమా కథ.

    దర్శకుడు పనితీరు..

    దర్శకుడు పనితీరు..

    కోట్లాది రూపాయల వజ్రాలను దక్కించుకోవాలని ప్లాన్ చేసిన రెండు ముఠాల మధ్య ఇద్దరు ప్రేమికులు ఇరుక్కుపోవడం అనే పాయింట్‌ను దర్శకుడు రామ్ గణపతి కథగా విస్తరించిన విధానం బాగుంది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తొలి భాగం ఫుల్లుగా నాటు కామెడీ.. అలాగే మితిమీరిన శృంగారం, రొమాన్స్‌తో గిలిగింతలు పెట్టారు. ఫస్టాఫ్‌లో అజయ్ ఘోష్, చిత్రం శ్రీను గ్రూప్ కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది.

    ఇక హీరో సాయి రోనక్, అంకిత సాహా మధ్య ఉన్న శృంగార సన్నివేశాలు ఫుల్లుగా ఓవర్‌డోస్ అని చెప్పవచ్చు. మంచి ఎమోషనల్ ట్విస్టుతో ఫస్టాప్‌ను ముగించి సెకండాఫ్‌‌పై ఆసక్తిని పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

    సెకండాఫ్ కాస్త రొటీన్‌గా

    సెకండాఫ్ కాస్త రొటీన్‌గా

    అయితే సెకండాఫ్‌ కోసం మంచి జోష్‌తో వచ్చిన ప్రేక్షకుడి ఆ రేంజ్ ఫన్ కొంత కరువైనట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో హోటల్‌లో ఇద్దరు అమ్మాయిలతో నలుగురు రొమాంటిక్ సీన్లు మరోసారి కడుపుబ్బ నవ్విస్తుంది. అయితే కథలో సాగదీత వల్ల ఫస్టాఫ్‌లో ఉండే జోష్ కనిపించదు. కాని ఫన్ మాత్రం అలా కొనసాగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి కథలోకి ఎక్కువగా క్యారెక్టర్లు రావడం వల్ల చాలా గందరగోళం సీన్లలో కనిపిస్తుంది. మొత్తానికి జబర్దస్త్‌ను మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ముగుస్తుంది.

    సాయి రోనక్, అంకిత కెమిస్ట్రీ

    సాయి రోనక్, అంకిత కెమిస్ట్రీ

    ఇక సాయి రోనక్ విషయానికి వస్తే.. రిషిగా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. రొమాంటిక్ సీన్లలో, శృంగారపరమైన సీన్లలో లీనమైపోయి నటించాడు. హీరోయిన్‌ శ్రీతో కలిసి తెరమీద యూత్ గిలిగింతలు పెట్టే మంచి కెమిస్ట్రీని పండించాడు. ఇక ఫైట్స్ సీన్లలో కూడా ఈజ్‌తో కుమ్మేశాడు. బ్రేకప్ సన్నివేశాల్లో ఎమోషనల్‌గా ఫెర్ఫార్మ్ చేశాడు.

    మంచి కథ, డైరెక్టర్ పడితే.. టాలీవుడ్‌కు మంచి హీరోగా మారే అవకాశం ఉంది. ఇక శ్రీ పాత్రలో అంకిత సాహా అందాల అరబోతతో పిచ్చెక్కించడం గ్యారెంటీ. ఎలాంటి బిడియం లేకుండా 150 లిప్‌లాక్స్‌తో గ్లామర్ పంట పండించింది. కేవలం రొమాన్స్‌కే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నది. బిస్మి నాస్ ఓ థ్రిల్లింగ్ క్యారెక్టర్‌లో మెరిసింది.

    అజయ్ ఘోష్ కామెడీ హైలెట్

    అజయ్ ఘోష్ కామెడీ హైలెట్

    రాజయోగం సినిమాలో నాటు, మాస్ కామెడీని పండించడంలో అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేష్, షకలక శంకర్ బృందం కేకపెట్టిచింది. బాల్ సన్నివేశాలు ప్రేక్షకులను పొట్టపట్టుకొని నవ్వించేలా చేస్తుంది. అలాగే వజ్రాల దక్కించుకొనేందుకు రెండు మాఫియా గ్యాంగుల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగేలా సిజ్జు, మధునందన్ తమ వంతు పాత్రను పోషించారు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారు తమ ప్రతిభను వారి శక్తిమేరకు ఇచ్చారని చెప్పవచ్చు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అరుణ్ మురళీధరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పలు సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. విజయ్ సీ కుమార్ కెమెరా మరో పాజిటివ్ పాయింట్. చింతపల్లి రమణ రాసిన మాటలు మంచి ఫన్ క్రియేట్ చేశాయి. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ పనితీరు బాగుంది. సెకండాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే ఇంకా మంచి ఫీల్ ఉండే అవకాశం ఉండేదనిప్తుంది. మణి లక్ష్మణ్‌రావు, డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ పరంగా రాజీ పడలేదనే విషయం ప్రతీ ఫ్రేమ్లో కనిపిస్తుంది.

    రాజయోగం ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    రాజయోగం ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కలబోసిన అడల్డ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాజయోగం. నటీనటుల పెర్పార్మెన్స్‌తోపాటు, అజయ్ ఘోష్ బృందం అందించిన నాటు కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఫస్టాఫ్ ఫుల్ ఫన్, రొమాన్స్ అంశాలు బాగుంటాయి. సెకండాఫ్ రొటీన్ సన్నివేశాలతో సాగుతుంది. జబర్దస్త్ తరహా కామెడీని ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మౌత్ టాక్ పెరిగేలా.. పబ్లిసిటీ చేసి.. ప్రేక్షకులను రాబట్టగలిగితే.. బీ, సీ సెంటర్లలో మంచి రెస్సాన్స్ రావడానికి అవకాశం ఉన్న సినిమా రాజయోగం. ఈ వారం నాటు కామెడీ, అడల్ట్ రొమాంటిక్, ఎంటర్‌టైనర్ చూడాలనుకొనే రాజయోగం కేరాఫ్ అడ్రస్.

    English summary
    Sai Ronak and Ankita Saha's latest movie Rajayogam. Ajay Ghosh, Sijju and Chitram Srinu seen in lead roles. Here is the Telugu filmibeat exclusive Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X