For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పగ ఉన్నోడు ( 'ఎవడు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  3.0/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో సినిమానూ ఇన్ని వాయిదాలుపడుతూ..లేటవుతూ...నెగిటివ్ టాక్ తెచ్చుకుంటూ రిలీజ్ కాలేదు. అయితే విషయం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎలా వచ్చినా విజయం మన వెంటే ఉంటుంది. హాలీవుడ్ చిత్రం ఫేస్ ఆఫ్ లోని నావల్టీ పాయింట్ ని తీసుకుని రెగ్యులర్ తెలుగు కథ,కథనంతో మసాలా దట్టించి చేసిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులుకు బాగానే పట్టే అవకాసం ఉంది. అయితే స్క్రీన్ ప్లే విషయం లో మరింత జాగ్రత్తపడి అల్లు అర్జున్ ,రామ్ చరణ్ కథలుగా విడి విడిగా చెప్పకుండా రెండింటిని కలిపి చెప్తే మరింత నిండుతనంగా ఉండి ఉండేది. ఇక ఇది పూర్తిగా డైరక్టర్ ఓరియెంటెడ్ సినిమా...అయినా రామ్ చరణ్ ...తనే పూర్తిగా మోసాడనే చెప్పాలి.

  వైజాగ్ సిటీలో వీరూ భాయ్(రాహుల్ దేవ్) పెద్ద దాదా. అతను కన్నేసి,ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న దీప్తి(కాజల్)ని గాఢంగా సత్య (అల్లు అర్జున్) ప్రేమిస్తూంటాడు. వీరూభాయ్ నుంచి తప్పించుకోవటానికి సత్య,దీప్తి కలిసి పారిపోతూంటారు. దాంతో వీరూభాయ్ మనుష్యులు...ఆ ప్రేమ జంటను అడ్డుకుని నిర్ధాక్ష్యణంగా చంపేస్తారు. అది జరిగిన కొద్ది రోజులుకు చరణ్(రామ్ చరణ్)వరసగా వీరూభాయ్ మనుష్యులను చంపేయటం మొదలెడతాడు. మరో ప్రక్క ధర్మ(సాయికుమార్) మనుష్యులు...చరణ్ ని గుర్తుపట్టి చంపేయాలని ప్రయత్నిస్తారు. ఇంతకీ చరణ్ ఎవరు...సత్య మర్డర్ కు అతనికి సంభంధం ఏమిటి...ధర్మతో చరణ్ కి పాత పగలు ఏమున్నాయి..ఎందుకు చరణ్ ని చంపాలని ప్రయత్నిస్తున్నారు..ఇలాంటి విషయాలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

  కథ పరంగా...

  కథ పరంగా...


  మొదటే చెప్పుకున్నట్లు Face/Off (1997) నుంచి కేవలం ఫేస్ లు మార్చటం అనే పాయింట్ ని మాత్రమే తీసుకుని అల్లిన ఈ కథ పూర్తిగా రొటీన్,తెలుగు పగ ప్రతీకారం మార్క్ తో నింపారు. ఇంకా చెప్పాలంటే ఒక హీరో ప్లేసులోకి మరో హీరో వచ్చే... ద్విపాత్రాభినయం(ఇద్దరు హీరోలు...ఇద్దరికీ పగతో నిండి ఉన్న కథలు..ఇద్దరు విలన్స్...ఇద్దరు హీరోయిన్స్... ) తరహా కధనే. అయితే పాయింట్ నావల్టీది కాబట్టి కొత్తగా అనిపిస్తుంది.

  స్క్రీన్ ప్లే...

  స్క్రీన్ ప్లే...

  కానీ కథన పరంగా సినిమా మొత్తం రెండు కథలుగా (ఫస్టాఫ్...అల్లు అర్జున్ కథ...అతని పగ తీరడం.., సెకండాఫ్ రామ్ చరణ్ కథ...అతని పగ తీరడం) అంటూ విడి విడిగా ఉండటమే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ అయ్యాక...స్క్రీన్ టైమ్ మొత్తం రామ్ చరణ్ ఎవడు అని తెలుసుకోవటం అనే ఫ్లాష్ బ్యాక్ కే కేటాయించారు. అలా కాకుండా...దాని లెంగ్త్ తగ్గించి...ఆ ప్లాష్ బ్యాక్ అయ్యాక..ఏం జరిగింది అనే దానిపై ఎక్కువ దృష్టి పెడితే మరింత బాగుండేది. ఇద్దరు హీరోలు ఒకే బాడీలో ఇమిడినట్లు రెండు కథలు ఒకదానికొకటి మరింతగా కలిస్తే ఇంకా హైలెట్ గా ఉండేది.

  మిస్సైంది

  మిస్సైంది

  హీరోకి అర్దమైన ఫేస్ ఆఫ్ ట్విస్ట్ ....విలన్స్ కూడా అర్దమయ్యి...వాళ్లు అప్పుడేం చేసారు అన్నదే ఎప్పుడూ కథ. ఆ విషయం ఎందుకనో ఈ కథనంలో మిస్సైంది. విలన్స్ కన్ఫూజన్ లో ఉండగానే సినిమా పూర్తై పోయింది. విలన్స్ కు అసలేం జరిగిందో తెలుసి..అప్పుడు వారు ఏం స్టెప్ వేసారు అన్నది ఉంటే మరింత బాగుండేది. ఫస్టాఫ్ లోనూ విలన్ రాహుల్ దేవ్ కి...అసలు తనని ఎటాక్ చేస్తున్నది ఎవరో అర్దం కాకుండానే చచ్చిపోతాడు..సెకండాఫ్ లోనూ విలన్ సాయికుమార్ పరిస్ధితీ అదే. ఇద్దరికీ తమ మీద దాడి చేస్తున్నది ఎవడో తెలుసుంటో ఎలా ఉండేదో మరి..

  రామ్ చరణ్ నటన

  రామ్ చరణ్ నటన


  సినిమా హైలెట్ లలో రామ్ చరణ్ ఒకరు. ఫస్టాఫ్ లో వేరే వారి మైండ్ ని పెట్టుకున్న రామ్ చరణ్ ..పగ తీర్చుకునే సీన్స్ బాగా వచ్చాయి..అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ..ఓ నాయకుడుగా ఎదిగే క్రమం...ఆ ఎమోషన్స్ బాగున్నాయి.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్


  ఉన్నది కొద్ది సేపే అయినా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తనది కాని కథని అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఒప్పుకోవటం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో అతనికి హాట్యాఫ్ చెప్పాలి.

  హీరోయిన్స్

  హీరోయిన్స్


  ఈ కథలో హీరోయిన్స్ కు పెద్ద ప్రయారిటీ లేదన్నది నిజం. శృతిహాసన్ కేవలం డాన్స్ లకే పరిమితమైంది. కాజల్ ఉన్నది కొద్ది క్షణాలే. అమీ జాక్సన్ ఓకే.

  బ్రహ్మానందం

  బ్రహ్మానందం


  సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ లో బ్రహ్మానందం ని హైలెట్ చేసారు ...కానీ సినిమాలో అంత సీన్ లేదు..మరి కొంత ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచితే ఈ రివేంజ్ డ్రామా మరింత రక్తి కట్టేది.

  సంగీతం

  సంగీతం


  ఆడియో అంత పెద్ద కాలేదు కానీ సినిమాలో వాటి చిత్రీకరణ బాగుంది. ముఖ్యంగా ప్రీడమ్ సాంగ్ బాగా వచ్చింది. చరణ్ డాన్స్ లు కూడా పాటలకు ప్రాణం పోసాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది

  విలన్స్

  విలన్స్


  విలన్స్ గా చేసిన రాహుల్ దేవ్, సాయి కుమార్...పరమ రొటీన్ గా చేసారు. ఉన్నంతలో కోటానే తన మార్క్ చూపించే ప్రయత్నం చేసారు. నెల్లూర్ స్లాంగ్ లో బాగా రక్తి కట్టించే ప్రయత్నం చేసారు. అజయ్, సుబ్బరాజు వంటి వారు ఉన్నా పెద్దగా వారికి స్కోప్ లేదు.

  దర్శకత్వం

  దర్శకత్వం


  దర్శకుడుగా వంశీ ఎప్పటిలాగే మాస్ ఎలిమెంట్స్ తో బాగానే చేసాడనిపించుకున్నాడు. ఫస్టాఫ్ స్పీడుగా రన్ తో పరుగెట్టినా..సెకండాఫ్ కి వచ్చేసరికి...ఆ కిక్ లేదు. జయసుధ చేత చెప్పించే.. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అంటూ ఉంటారు. కానీ పోతూ పోతూ ఒక మగాడ్ని ఇచ్చాడు వంటి డైలాగ్స్ తో మాస్ ని అరిపించాడు.

  టెక్నికల్ గా...

  టెక్నికల్ గా...


  సినిమాటోగ్రఫీ రిచ్ గా సినిమాని ప్రెజెంట్ చేయటంలో సక్సెస్ అయ్యింది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. కథా,కథనమే వీక్ కావటంతో మిగతా విభాగాలు ఎంత గొప్పగా ఉన్నా...అలా అలా వెళ్లిపోయింది సినిమా.

  ఎవరెవరు

  ఎవరెవరు

  నటీనటులు: రామ్ చరణ్, అల్లు అర్జున్, అమీ జాక్సన్, కాజల్, శృతి హాసన్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
  కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ,
  మాటలు: అబ్బూరి రవి,
  కథ సహకారం: హరి,
  ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
  యాక్షన్ : సెల్వం,
  ఆర్ట్: ఆనంద్ సాయి,
  సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్,
  నిర్మాత: దిల్ రాజు,
  దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

  ఫైనల్ గా కామెడీ మిస్సైనా మాస్ ని మెచ్చే అంశాలు ఉండటం బి,సి సెంటర్లలో సినిమాకు ప్లస్ అవుతుంది. అలాగే ట్రేడ్ పరంగా సంక్రాతి కానుకగా విడుదలైన మరో పెద్ద చిత్రం '1' నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాసం ఉంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  
 
 Yevadu, the much awaited movie of Ram Charan is released today with hit talk. Shruti Hassan is paired with Ram Charan. The movie is said to be an action thriller. Vamshi Paidipalli is the director and Dil Raju is the producer. Though the release of the movie is delayed, fans are eagerly waiting for the film. Dialogues of the movie are created high expectations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X