twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదేకథ, అదే సినిమా!

    By Staff
    |

    Rammachilakamma
    చిత్రం: రామ్మా! చిలకమ్మా
    నటీనటులు: సుమంత్‌, లయ, బ్రహ్మనందం, కోవైసరళ
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    నిర్మాత: కె.సి.శేఖర్‌ బాబు
    దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ

    ఈ మధ్య సినిమాలను చూస్తుంటే ఎన్టీఆర్‌ పాడిన '.............ఐనా తీరు మారలేదు' అనే పాట గుర్తుకు వస్తుంది. రామ్మా చిలకమ్మాను చూస్తే అదే అనిపిస్తుంది. ఇలాంటి థీమ్‌ తో ..ఇలానే ఎన్నో చిత్రాలు వచ్చినా మళ్ళీ అదే రీతిలో చిత్రం తీయడం ఏమిటో? కథ అదే. కథనం అదే. తీరు అదే. సుమంత్‌ కు ఇది నాలుగో ప్రయత్నం. సుమంత్‌ కు మాస్‌ ఇమేజ్‌ కోసం తీసినట్లుగా ఉంటుంది ప్రథమార్థం. ప్రథమార్థంలో సుమంత్‌ నటన చూస్తే ప్రేక్షకుల మీద 'సినిమా పెద్దలు' 'బలవంతం' చేస్తున్నట్లు అనిపిస్తుంది. నోట్లో బీడీ, బటన్స్‌ పెట్టుకోని రౌడీ(కాకపోతే మంచి రౌడీ! ఈ టైటిల్‌ అయితే బాగుండేదేమో!) చిత్రం నిండా బూత్‌ డైలాగ్‌ లే. సెన్సార్‌ కట్‌ అయిన డైలాగ్‌ లు కూడా చాలానే ఉన్నాయి.

    సుమంత్‌ రౌడీ. కనపడ్డ ప్రతి అమ్మాయిని రామ్మా చిలకమ్మా అని అంటాడు. అరగంటలో అమ్మాయితో చాఫ్టర్‌ క్లోజ్‌. ఇంటర్‌ అమ్మాయిల నుంచి ఆంటీల వరకు సుమంత్‌ ఎవర్నీనైనా లొంగదీసుకుంటాడు. సుమంత్‌ కు విశ్వనాథ్‌(నవీన్‌ టైప్‌ లో ఉన్న ఇతని అసలు పేరు ఏమిటో తెలీదు.) ఫ్రెండ్‌. ఈయన కూడా అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. లయను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మరోవైపు సుమంత్‌ కన్ను కూడా లయ మీద పడుతుంది. సుమంత్‌ అంటే లయకు చీదర. లయ ఇంట్లో నుంచి వచ్చి విశ్వను పెళ్ళి చేసుకునేందుకు వస్తుంది. పెళ్ళి టైంలో పనుందంటూ విశ్వ సడెన్‌ గా వెళ్ళిపోతాడు.

    ఎంతకీ రాకపోవడంతో లయను తన ఇంటికి తీసుకు వెళుతాడు. వీరి ఇద్దరిని కలిపేంత వరకు నిద్రపోనని చంద్రబాబు నాయుడు లెవల్లో శపథం చేస్తాడు. ఈ చెడ్డ రౌడీ మంచి పనులు చూసి లయ మనసు మార్చుకుంటుంది. చివర్లో విశ్వ విశ్వరూపం చూసిన లయ మోసపోయినట్లు గ్రహిస్తుంది. చివరకి ఎవర్నీ పెళ్ళి చేసుకుంటుందనేదే క్లైమాక్స్‌. క్లైమాక్స్‌ లో మలుపు మాత్రం బావుంది. మిగతా అంతా రోటీన్‌.

    పాటలు వినడానికి బాగున్నాయి. కానీ సినిమాలో అర్థంపర్థం లేకుండా రావడమే చిరాకు పుట్టిస్తుంది. సుమంత్‌ నటన(?) సెకండ్‌ హాఫ్‌ లో ఫర్వాలేదు. ప్రథమార్థంలో ప్రేక్షకులు భయపడుతారు. లయ ఓకే. బ్రహ్మనందం డబల్‌ యాక్షన్‌, కోవై సరళ కామెడీ పాతదే. కొత్తగా ఏమీలేదు. తమ్మారెడ్డి డైరక్షన్‌ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X