For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రణరంగం మూవీ రివ్యూ అండ్ రేటింగ్: మాస్ అండ్ క్లాసికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

  |

  Rating:
  3.0/5
  Star Cast: శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని, కల్యాణి ప్రియదర్శన్, మురళీ శర్మ, ఆదర్శ్
  Director: సుధీర్ వర్మ

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. అత్యంత ప్రజాదరణ పొందిన గాడ్‌ఫాదర్ మూవీ స్ఫూర్తిగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990 బ్యాక్‌డ్రాప్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటలు ఓ వైపు, శర్వానంద్ లుక్, కల్యాణి ప్రియదర్శన్, కాజల్ గ్లామర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఇలాంటి విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శర్వానంద్‌కు, చిత్ర యూనిట్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలు, నటీనటులు ఫెర్ఫార్మన్స్ గురించి చర్చించుకోవాల్సిందే.

  రణరంగం కథ

  రణరంగం కథ

  వాల్తేరులో బ్లాక్ టికెట్ల దందాతోపాటు చిన్నా చితక సెటిమెంట్లు చేసే యువకుడు దేవా (శర్వానంద్). గీత (కల్యాణి ప్రియదర్శన్)తో పీకల్లోతు ప్రేమలో పడుతాడు. స్థానికంగా ఉండే ముఠాల ఆధిపత్యపోరులో దేవా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అక్రమ మద్యం వ్యాపారం విషయంలో ఎమ్మెల్యే (మురళీ శర్మ)కు పోటీగా ఎదుగుతాడు. కొన్ని పరిస్థితుల కారణంగా వాల్తేరు నుంచి స్పెయిన్‌కు మకాం మారుస్తాడు. అక్కడ డాక్టర్ (కాజల్ అగర్వాల్)కు చేరువవుతాడు.

  రణరంగం ట్విస్టులు

  రణరంగం ట్విస్టులు

  వాల్తేరులో నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు సంపాదించుకొన్న దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లాడు? స్పెయిన్ నుంచి ఆంధ్రాలో దందాను ఎలా ప్రభావితం చేశాడు. అంతర్గత ముఠాల పోరులో దేవా తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడు. గీతతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? కాజల్‌కు దేవా ఎందుకు చేరువకావాల్సి వచ్చింది? ఆంధ్రాలోని మాఫియా రాజకీయాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే రణరంగం.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  స్పెయిన్‌లో దేవా మాఫియా సామ్రాజ్యం కార్యకలాపాలతో రణరంగం హై నోట్‌లో మొదలవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో 90వ దశకం నాటి పరిస్థితులు, గ్యాంగ్‌స్టర్‌గా దేవా ఎదుగుదల, ఎత్తుకుపై ఎత్తు లాంటి అంశాలు, అలాగే కల్యాణి ప్రియదర్శన్‌తో ప్రేమ వ్యవహారం ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. ఇక స్టైలిష్ మేకింగ్, సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్ అంశాలు తొలి భాగంలో కీలక పాత్రను పోషిస్తాయి. నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌తోపాటు సాంకేతిక నిపుణుల ప్రతిభ సినిమాను రిచ్‌గా మార్చిందని చెప్పవచ్చు. కథలో వేగం మందగించడం కొంత ఎక్కడో అసంతృప్తి కలిగిన విజువల్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి, నటీనటుల ప్రతిభ ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాయి.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక సెకండాఫ్‌లో దేవాపై ప్రత్యర్థి వర్గం దాడులు, ప్రతీ దాడులతో సినిమా రణరంగంగా మారుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ, కథనాల్లో వేగం పుంజుకొంటాయి. కథలో ట్విస్టులు, కొన్ని సీన్లు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కల్యాణి ప్రియదర్శన్‌కు సంబంధించిన కొన్ని సీన్లు కథ ఎమోషనల్‌గా మారడానికి ఉపయోగపడ్డాయి. డైలాగ్స్ పదును తగ్గడం, నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ కొంత నిదానంగా ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే మాఫియా సినిమాకు ఏం కావాల్సిన మసాలా పుష్కలంగా ఉండటంతో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ మూవీ చూస్తున్నమనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడు సుధీర్ వర్మ గురించి

  దర్శకుడు సుధీర్ వర్మ గురించి

  దర్శకుడు సుధీర్ వర్మ తన అభిరుచికి తగిన క్రైమ్, థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు కొత్తరకం గ్యాంగ్‌స్టర్ మూవీగా రణరంగంను మలచడంలో సఫలమయ్యాడు. కథ, కథనాలపై మరికొంత జాగ్రత్త పడి ఉంటే తెలుగులో మరో క్లాసిక్ గ్యాంగస్టర్ మూవీగా మారేది. లవ్ ఎపిసోడ్స్ తెరకెక్కించిన విధానం, శర్వ, కల్యాణి ప్రియదర్శిని మధ్య రొమాంటిక్ సీన్లు కొత్తగా అనిపిస్తాయి. అలాగే 90వ దశకానికి సంబంధించిన వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. రొటీన్ సినిమాల మధ్య మంచి యాక్షన్‌తో కూడిన సినిమాను అందించే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

  శర్వానంద్ మరోసారి

  శర్వానంద్ మరోసారి

  దేవాగా రెండు మూడు రకాల షేడ్స్‌లో ఉన్న పాత్రలో శర్వానంద్ ఆకట్టుకొన్నాడనే చెప్పవచ్చు. లుక్ పరంగా స్టైలిష్‌గా కనిపించాడు. యువకుడి, మధ్య వయస్కుడిగా, ఓ పాపకు తండ్రిగా భారమైన పాత్రలో మెప్పించాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లలో మరోసారి ప్రస్థానంలోని ఫెర్ఫార్మెన్స్‌ను రుచి చూపించారు. పాత్రలో కొంత వేగం పెంచి ఉంటే శర్వా కెరీర్‌లో బెస్ట్ రోల్‌గా దేవా నిలిచిపోయేది.

  కల్యాణి ప్రియదర్శన్, కాజల్ గ్లామర్

  కల్యాణి ప్రియదర్శన్, కాజల్ గ్లామర్

  ఇక హీరొయిన్ల విషయానికి వస్తే, కాజల్ అగర్వాల్ ఉన్నప్పటికి.. కల్యాణిదే డామినేట్ క్యారెక్టర్. మధ్య తరగతి యువతిగా గీత పాత్రలో ఒదిగిపోయింది. శర్వాతో కొన్ని సీన్లలో సున్నితమైన రొమాన్స్ పండించింది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. ఇక కాజల్‌ది నిడివి తక్కువగా ఉన్న డాక్టర్ పాత్ర. ఆ పాత్ర ద్వారా గ్లామర్‌‌తో ఆకట్టుకొన్నది.

  టెక్నికల్‌గా

  టెక్నికల్‌గా

  సాంకేతిక విభాగాల్లో దివాకర్ మణి సినిమాటోగ్రఫి సూపర్. 90వ దశకం నాటి పరిస్థితులను చక్కగా తెరకెక్కించారు. ఆర్ట్ విభాగం పనితీరు ప్రేక్షకుడిని ఆ కాలానికి తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమాకు మరో బలం రీరికార్డింగ్. కొన్ని సీన్లను బాగా ఎలివేట్, హైలెట్ చేశాయి. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. సినిమా మొత్తంగా 15 నిమిషాలపాటు కత్తెర వేస్తే సినిమాలో వేగం పెరిగి మరింత జోష్‌ను కలిగించే అవకాశం లేకపోలేదు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఓవరాల్‌గా రణరంగం మాస్, స్టైలిష్ గ్యాంగస్టర్ సినిమా అనిచెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించే అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా రణరంగం. టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఉన్న కొరతను రణరంగం సినిమాతో సితార ఎంటర్‌టైన్‌మెంట్ తీర్చింది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే కమర్షియల్‌గా మంచి విజయం దక్కుతుంది. నిర్మాత నాగవంశీ అభిరుచికి అద్దం పట్టేలా ఉన్నాయి. అలాగే 90వ దశకం నాటి పరిస్థితులను ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించాయి.

  బలం, బలహీనత

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్

  • శర్వానంద్ యాక్టింగ్
  • మేకింగ్, స్లైలింగ్
  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్

  మైనస్ పాయింట్

  • స్లో నెరేషన్
  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని, కల్యాణి ప్రియదర్శన్, మురళీ శర్మ, ఆదర్శ్, రాజా, జబర్దస్త్ మహేష్, ప్రవీణ్ తదితరులు

  రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

  సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

  నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

  మాటలు: అర్జున్ - కార్తీక్,

  సంగీతం : ప్రశాంత్ పిళ్ళై ,

  ఛాయాగ్రహణం :దివాకర్ మణి,

  పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,

  ఎడిటర్: నవీన్ నూలి,

  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,

  పోరాటాలు:వెంకట్,

  నృత్యాలు: బృంద, శోభి,శేఖర్,

  ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి

  బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్

  రిలీజ్: 2019-08-15

  English summary
  Sharwanand's up coming release Ranarangam's pre-release event was held on a grand scale yesterday. Nithiin attended the event as the chief guest. The gangster drama is hits the silver screens on August 15th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X