»   » రష్మి ఘాటు కొంతే, ప్రచారం ఒకలా, సినిమా మరోలా.. (‘అంతం’రివ్యూ)

రష్మి ఘాటు కొంతే, ప్రచారం ఒకలా, సినిమా మరోలా.. (‘అంతం’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: 'గుంటూరు టాకీస్' చిత్రంలో తన అంద చందాలతో మెప్పించిన రేష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'అంతం'. జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ద‌ర్శ‌క‌ నిర్మాత గా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఊహకందనిది జరుగబోతోందంటూ' సినిమా ప్రమోషన్లలో ఊదరగొట్టారు. మరి నిజంగానే ఈ సినిమా ప్రేక్షకుల ఊహకందని రేంజిలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ థ్రిల్ చేసిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..
వనిత (రష్మిగౌతమ్‌), కళ్యాణ్ కృష్ణ(చరణ్‌దీప్‌) భార్యా భర్తలు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సాపీగా జీవితం గడిపేస్తుంటారు. ఓ రోజు కళ్యాణ్ కృష్ణ ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడ వెళతాడు. అతడు విజయవాడ నుండి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వస్తుంది...నీ భార్యని కిడ్నాప్‌ చేస్తున్నామని, నీ భార్య నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు చేయాలని వార్నింగ్ ఇస్తారు. భార్య కోసం వాళ్లు చెప్పిన పని చేయడానికి సిద్దమవుతాడు కళ్యాణ్ కృష్ణ. వారు చెప్పిన ప్రకారం ఓ చోటుకు వెళ్లి బ్యాగ్ తెస్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? ఈ కిడ్నాప్ వెనక అసలు కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్..
'అంతం' సినిమా చూడటానికి ఎవరైనా థియేటర్లకు వెలుతున్నారంటే కేవలం రష్మిని చూసి మాత్రమే. ప్రమోషన్లలో ఆమెను, ఆమె అందాలనే ఎక్కువ ఫోకస్ చేసారు. అయితే సినిమాలో రష్మి కనిపించేది కొంతసేపు మాత్రమే. రష్మి కనిపించేది పావుగంట ఇరవై నిమిషాలే అయినా ఉన్నంత సేపు ఆకట్టుకుంది. గులాబీ చిత్రంలోని ఈ వేళలో పాటను ఇందులో రీమిక్స్ చేసి రష్మి అందాలను సెక్సీగా చూపించారు. సినిమా ఎక్కువగా హీరో చరణ్‌దీప్‌ చుట్టూనే తిరుగుతుంది. సినిమా మొత్తం ఒకే రకం ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించే అతని పెర్పార్మెన్స్ గొప్పగా ఏమీ లేదు. సుదర్శన్‌ కామెడీ కాస్త నవ్వించింది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గపాత్రలే ఏమీ లేవు.

టెక్నికల్ అంశాలు..
సినిమాలో టెక్నికల్ గా చూసినా ఎవరూ గొప్పగా పనితీరు ప్రదర్శించలేదు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణం అన్ని జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్. ఈ అంశాలన్నింటిలోనూ అతడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వీటిలో ఆయన కాస్త బెటర్ గా ప్రదర్శించిన విద్య సినిమాటోగ్రఫీ. నిర్మాణ విలువలు కూడా బాలేవు. కార్తిక్ రోడ్రిగ్జ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేదు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ప్రచారం ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి

ప్రచారం ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి

సినిమా ప్రచారం మొత్తం రష్మిని చూపిస్తూ చేసారు. ఈ సినిమాకు వెళ్లిన వారంతా రష్మి పెర్ఫార్మెన్స్, ఆమె అందాల ప్రదర్శన చూసేందుకే. అయితే సినిమాలో రష్మి కొంత సేపే ఉండటంతో చాలా మంది డిస్పప్పాయింట్ అవుతారు.

పేరుకే సస్పెన్స్ థ్రిల్లర్

పేరుకే సస్పెన్స్ థ్రిల్లర్

సినిమా పేరుకే సస్పెన్స్ థ్రిల్లర్... సినిమా చూసే వారికి మాత్రం అలాంటి ఫీలింగ్ రాదు. సినిమాలో ఉన్న ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ వరస్ట్ అని చెప్పకతప్పదు.

సాగదీసి సాగదీసి..

సాగదీసి సాగదీసి..

సినిమా స్టోరీ చిన్న పాయింటే కావడంతో... దర్శకుడు సినిమాను చాలా సేపు సాగ దీసి సాగదీసి ప్రేక్షకులుక విసుగుద తెప్పించాడు.

రష్మి మాత్రమే..

రష్మి మాత్రమే..

సినిమాలో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ కేవలం రష్మి మాత్రమే.

అన్నీ మైనస్ లే..

అన్నీ మైనస్ లే..

సినిమాలో రష్మి తప్ప దాపుగా అన్నీ మైనస్ పాయింట్లే. కథకు తగిన సన్నివేశాలు అసలు కనిపించవు. తీవ్రవాదులు, బాంబులు అంటూ హడావుడి ఉంటుంది కానీ అవేవీ కనిపించక ప్రేక్షకులు సహనం కోల్పోతాడు.

చివరగా..

చివరగా..

మీ వూహకందనిది ఏదో జరగబోతోంది.. అంటూ సాగే ప్రచార చిత్రాల్ని చూసి ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా సినిమా అనుకొని వెళ్తే నిరాశ తప్పదు.

English summary
Antham is the latest Telugu movie and a suspense thriller. Everyone goes to this Antham movie expecting glamour show of Reshmi Gautham. Having this in mind director Kalyan has shot a song of Krishnavamsi “Ee Velalo song” on both the leads. Screenplay is so bad and audience start leaving after the very first 15 minutes from start.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu