twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పవర్’ కట్ ( రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    ఇంతకుముందు వేరే వేరే భాషలలో హిట్టైన చిత్రాలలోని సీన్స్,కథలు తెలుగుదనం అద్దుకుని దిగేవి...దాంతో ఎంతో కొంత కొత్తదనం చూస్తున్నాం అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది. తెలుగులో హిట్టైన సినిమాలు నాలుగు తీసుకుని ఓ కథని వండేసి వడ్డించేస్తున్నారు. అలాంటి పరమ రొటీన్ వంటకమే ..‘పవర్' టైటిల్ తో దిగింది. అల్లుడు శీను,బలుపు చిత్రాలకు కథలు అందించిన బాబి దర్శకుడుగా మారి అందించిన ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్ ని అద్దాలనే తాపత్రయమే తప్ప, మిగతా విషయాలపై దృష్టి పెట్టినట్లు కనపడదు. అయితే రవితేజ ఫెరఫార్మెన్స్, ఆయన పాడిన నోటంకి పాట సినిమాకు ఉన్నంతలో దన్నుగా నిలిచాయి.

    కలకత్తాలో బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ అవినీతి పోలీసు అధికారి. అతను గంగూలీ భాయ్ (సంపత్ రాజ్) అనే గ్యాంగస్టర్ ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో సేవ్ చేసి, అండర్ గ్రౌండ్ కు తీసుకువెళ్లాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తన ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే హైదరాబాద్ లో ...తిరుపతి(రవితేజ) పోలీస్ ఉద్యోగం కావాలని, అదే జీవితాశయంగా తిరుగుతున్న కుర్రాడు. అతన్ని విలన్(ముకేష్ రుషి) ఓ రోజు టీవిలో చూస్తాడు. దాంతో అతన్ని తీసుకువచ్చి చనిపోయిన బలదేవ్ సహాయ్ ప్లేస్ లో ప్రవేశపెట్టి తన పనులు జరుపుకోవాలనుకుంటాడు. అప్పుడు అసలైన ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి...విలన్స్ కు హీరో ఎలా బుద్ది చెప్పాడు...బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.

    రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు చిత్రం కు చిన్న ట్విస్ట్ కలిపి మరో వెర్షన్ లా ఉండే ఈ చిత్రంలో ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన రొటీన్ సీన్స్ కు తోడు,రొటీన్ కథ,కథనం కూడా తోడైంది. చివరకు క్లైమాక్స్ సైతం రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన బలుపునే తిరిగి చెయ్యాలనుకోవటం దారుణమనిపిస్తుంది. సందర్బం ఉన్నా లేకపోయినా బ్రహ్మానందంపై పాట పెట్టేస్తే జనం ఎగబడి చూసేస్తారనే భ్రమలా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో కథలో నమ్ముకున్న ట్విస్ట్ లు పేలకపోయినా లేకపోతే ట్విస్ట్ లు సరిగ్గా లేకపోయినా చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం నడుస్తాయి. అదే ఈ సినిమాకు జరిగింది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని దాని చుట్టూ అల్లుకుంటూ వచ్చినట్లుంది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    పెద్ద మైనస్

    పెద్ద మైనస్

    సినిమాను పూర్తి స్దాయిలో జస్టిఫై చేసి నిలబెట్టాల్సిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ దారుణంగా తేలిపోయాయి. ఆ సీన్స్ చాలా పాతవి కావటం దానికి తోడు వాటిని చిత్రీకరించే పద్దతి కూడా అలాగే ఉంది. దాంతో అప్పటిదాకా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది మొత్తం పోయింది.

    రాకింగ్

    రాకింగ్

    రవితేజ గురించి ఈ చిత్రం లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వయిసు పెరుగుతున్నా ఎక్కడా ఉత్సాహం తగ్గకుండా అదే ఎనర్జీతో సీన్స్ ముందుకు వెళ్లటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఇంకా అందంగా ఈ చిత్రంలో కనిపించాడు.

    గజనీ ట్రాక్

    గజనీ ట్రాక్

    గజనీ చిత్రంలోని అసిన్ ట్రాక్ ని గుర్తు చేస్తూ...రెజీనా పాత్రను, బలుపులో శృతిహాసన్ ను గుర్తు చేస్తూ హన్సిక పాత్రలు రాసుకున్నాడు దర్శకుడు. దాంతో ఈ రెండు పాత్రలకూ స్పెషల్ ఐడింటిటీ లేకుండా పోయింది.

    బ్రహ్మీ, సప్తగిరి, పోసాని

    బ్రహ్మీ, సప్తగిరి, పోసాని

    ముగ్గరూ త్రిమూర్తుల్లా సినిమాను కామెడీ తో కాపు కాస్తారని దర్శకుడు భావించినట్లున్నాడు. అయితే అవి కథలో భాగమైతే ఖచ్చితంగ వర్కవుట్ అయ్యిదే.

     డబుల్ మీనింగ్

    డబుల్ మీనింగ్

    రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాల్లో సాధారణంగా డబుల్ మీనింగ్ సీన్స్, డైలాగులు ఉండవనే భావిస్తారు. అయితే రచయితే దర్శకుడు అయిన బాబి దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం బాగుంది. డైలాగ్స్ అక్కడక్కడా బాగానే పేలాయి. ఎడిటింగ్ మరింత బాగా షార్ట్ గా చేయించుకుని లెంగ్త్ తగ్గించుకుని ఉంటే మరింత ఫలితం బాగుండేది.

    దర్శకత్వం...

    దర్శకత్వం...

    దర్శకుడుగా పెద్ద హీరోనే బాగానే హ్యాండిల్ చేసాడని కొన్ని సీన్స్ లో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ మరింత బాగా రాసుకుని ఉంటే బాగుండేది. అలాగే...రవితేజని స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా చూపించినప్పుడు ఆ పేస్ మెయింటైన్ చేస్తే మరింత బాగుండేది.

    ఇదెంతుకు పట్టించుకోలేదో

    ఇదెంతుకు పట్టించుకోలేదో

    రచయత నుంచి దర్శకుడు గా మారినప్పుడు బలమైన స్క్రిప్టుని ఆశిస్తారు. అయితే దర్శకుడు బాబి ఈ విషయంలో ఫెయిలయ్యాడనిపిస్తుంది. హీరో ఫలానా మిషన్ కోసం ఇదంతా చేస్తున్నాడని ఫ్లాష్ బ్యాక్ రివిల్ చేసినప్పుడు ఆ మిషన్ వల్ల బాగుపడేదెవరు అనే స్పష్టత మరింత ఇవ్వాల్సింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ప్లాష్ బ్యాక్ రావటం స్క్రిప్టులో కన్ఫూజన్ ని చూపిస్తోంది.

    సంగీతం

    సంగీతం

    తమన్ ఇచ్చే ట్యూన్స్ పరమ రొటీన్ గా ఉంటాయనే గత కొంత కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ చేత పాడించిన నోటింకి పాట బాగా ఇచ్చారు. అలాగే ఆడియో కూడా సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
    నటీనటులు: రవితేజ, హన్సిక, రెజీనా, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, సుబ్బరాజు తదితరులు
    కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్‌పరమహంస,
    మాటలు: కోన వెంకట్,
    స్క్రీన్‌ప్లే: చక్రవర్తి, మోహనకృష్ణ,
    ఆర్ట్: బ్రహ్మ కడలి,
    ఫైట్స్: రామ్‌లక్ష్మణ్,
    సంగీతం: తమన్,
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.బి.కృష్ణ,
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి).
    నిర్మాత :రాక్‌లైన్ వెంకటేష్
    విడుదల తేదీ: 12, సెప్టెంబర్ 2014.

    ఫైనల్ గా మార్కెట్ లో మహేష్ ఆగడు వచ్చేవరకూ ఈ సినిమా కు పోటీ లేకపోవటం ప్లస్ అవుతుంది. అయితే కమర్షియల్ సినిమా తియ్యాలంటే మూస కథలు, రొటీన్ సీన్స్ ఎన్నుకోవాలనే తెలుగు సినిమా సంప్రదాయానికి కొత్త దర్శకులైనా కాస్త తిలోదకాలు ఇస్తే బాగుంటుందని మరోసారి ఈ చిత్రం గుర్తు చేస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Ravi Teja starrer, 'Power', released today with divide talk. Ravi Teja will be seen in two different roles in the movie, one as a cop and the other as a careless man. Thaman's songs are also good. Hansika Motwani and Regina Cassandra look very beautiful the glamour quotient in the film is said to be very good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X