For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామెడీ విత్ మెసేజ్.. (‘రోజులు మారాయి’ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.5/5

  హైదరాబాద్: పెద్ద స్టార్స్ ఎవరూ లేకుండా తెరకెక్కే చిన్న సినిమాల కేటగిరీలో ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అయిన చిత్రం 'రోజులు మరాయి'. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రానికి మారుతి స్క్రిప్టు అందించడం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడం. ఈ తరం యువత పోకడలను ప్రతిబింభిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత అందరిలోనూ ఆసక్తి పెంచింది.

  ఈ తరం యువత మెచ్చే కామెడీతో కూడిన ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మధ్య సమాజంలో కనిపించే కొందరు క్యారెక్టర్లెస్ యువతను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసారు. సాధారణంగా సినిమాలన్నీ ఎక్కువగా అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోస పోతున్న వైనాన్నే చూపిస్తారు. కానీ ఇది ఈ తరం అమ్మాయిలు కొందరు...రెండు లవ్ ట్రాక్స్ నడుపుతూ అబ్బాయిలను ఎలా వాడుకుంటున్నారు అనేది చూపించారు.

  రోజులు మారాయి ఫోటో గ్యాలరీ

  కథ విషయానికొస్తే...

  ఆధ్య(కృతిక), రంభ(తేజస్వి) అనే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ పీటర్(పార్వతీశం), అశ్వద్ (చేతన్)అనే ఇద్దరబ్బాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేస్తారు...వారిని తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకు వాడుకుంటారు. వీరిని ఇలా వాడుకుంటూనే మరోవైపు వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతూ వారినే మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు.

  అయితే ఓ సారి ఓ బాబా ద్వారా... తమను పెళ్లాడే వారు పది రోజుల్లోనే చనిపోతారని తెలుసుకున్న ఈ ఇద్దరు గర్ల్స్. తమ జీవితం బావుండాలంటే మొదట ఎవరినైనా పెళ్లి చేసుకుని బలి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ మేరకు ఆద్య.. అశ్వద్ ను, రంభ..పీటర్ ను పెళ్లాడతారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఇద్దరూ అశ్వద్, పీటర్ లను చంపేస్తారు. ఆద్య, రంభ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వీరి మరణం తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది....నిజంగానే అశ్వద్, పీటచ్ చనిపోయారా? అనేది తర్వాతి స్టోరీ...

  పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...

  పార్వతీశం పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. తన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో పార్వతీశం సినిమాకు హైలెట్ అయ్యాడు. చేతన్ ఓ సాఫ్ట్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. కృతిక అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది. ఆమె చేసింది చాలా క్లిష్టమైన పాత్రే... ఒకేసారి రెండు కోణాల్లోనూ ఆలోచించే పాత్రలో బాగా నటించింది. తేజస్వి కూడా గ్లార్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  సినిమాకు ఎంచుకున్న కాన్సెప్టే ప్లస్ పాయింట్. కామెడీ బావుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్సయింది. ఫస్టాఫ్ చాలా ఫన్నీగా ఎలాంటి బోర్ లేకుండా సాగుతుంది. సినిమా నిజంగా ఇపుడు జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతున్నట్లే ఉంటుంది.

  మైనస్పాయింట్స్

  మైనస్పాయింట్స్

  సినిమా కాస్త సాగదీసినట్లు ఉండటం. ముఖ్యంగా సెకండాఫ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లు రిపీట్ అయినట్లుగా ఉన్నాయి.

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే..

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే..

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఎడిటింగ్ బావుంది. డైరెక్షన్ పర్వాలేదు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బావుండేది. డైలాగ్స్ ఫర్వాలేదు.

  విశ్లేషన

  విశ్లేషన

  సినిమా మంచి ఎంటర్టెనింగుతో సాగుతుంది. ఈ తరం జనరేషన్ మెచ్చేలా ఉంటుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చక పోవచ్చు. అయితే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.

  ఫైనల్ గా..

  ఫైనల్ గా..

  ‘రోజులు మారాయి' ఈ తరం యువత మెచ్చేలా ఉంది.

  English summary
  Rojulu Marayi created much hype with its trailers and the names associated with it. The film which has story by Maruthi and is produced by Dil Raju has hit the screens today. The movie is a message oriented one which depicts the character-less youth who can fall to an extent of doing anything they want to. The director portrayed the lives of 2 girls who mantain a two love track, one whom they love truly and the one to make use of to fulfill their wants. However, boys who deeply love the girls take decision to teach them a lesson. All that happens in between is the story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X