Just In
- 2 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 2 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 3 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 4 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
తొలి రోజు: 1.91 మందికి కరోనా వ్యాక్సిన్, ఏ రాష్ట్రంలో ఎన్ని టీకాలు వేశారంటే.?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్రమ సంభంధం, హత్య,మసాలా వంటకం ('రుస్తుం' రివ్యూ)
వాస్తవానికి వాస్తవంగా జరిగిన కథలు అంతే వాస్తవంగా తెరకెక్కించటం మామూలు విషయం కాదు. దానికి తోడు ఎత్తుకున్న కథ కాంట్రావర్శి సబ్జెక్టు అయితే మరింత జాగ్రత్తగా ప్రతీ విషయంలోనూ వ్యవహించాలి. అప్పట్లో అంటే 1959 లో నేవీ ఉన్నతాధికారి కె.ఎం.నానావతి తన భార్య... ప్రియుణ్ని చంపడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాలో భారీ ఎత్తున కథనాలుతో పాటు పుస్తకాలు సైతం వచ్చాయి. ఈ ఘటనను ఆధారంగా చేసుకొని అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో రూపొందిన ఈ చిత్రం ఏమేరకు సక్సెస్ అయ్యిందో చూద్దాం.
రుస్తుం పావ్రీ(అక్షయ్ కుమార్) నిజాయితీ,అంతకు మించి దేశభక్తి కలిగిన నావల్ కమాండర్. తన ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా కొంతకాలం సముద్రంలోకి వెళ్లి తిరిగి వచ్చిన అతనికి భార్య సింథియా(ఇలియానా) వేరే వారితో అక్రమ సంభంధం పెట్టుకుందని తెలుస్తుంది. అతనెవరో కాదు...డబ్బున్న పార్శీ కుర్రాడు, భర్త ఫ్రెండ్ అయిన విక్రమ్ మఖిజా(అర్జన్ బజ్వా). అదే విషయాన్ని భర్తకు వివరిస్తుంది. విషయం అర్థం చేసుకున్న రుస్తుం.. భార్యను లవర్ దగ్గరకే పంపాలని అనుకుంటాడు.
భార్యాపిల్లలను సినిమాకు పంపించి, భార్య ప్రియుడు ఉండే చోటుకి వెళ్లి ఊహించని విధంగా అతన్ని షూట్ చేసి చంపేసి, లొంగిపోతాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ ని చంపినందుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదంటూ కోర్టుకు సమర్దించుకుంటూ వాదిస్తాడు. మీడియాలో ఈ మర్డర్ ఇది సంచలనమవుతుంది. రుస్తుం క్రిమినల్ అని కొందరు, కాదని మరికొందరు వాదిస్తూంటారు. చివరకు రుస్తుం కథ ఎలా ముగిసింది... కోర్టు శిక్ష ఏం వేసింది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాల్సిన కథనం.
స్లైడ్ షోలో మిగతా రివ్యూ..

ప్లస్ పాయింట్
అనవసరమైన సెటప్ తో టైం వేస్ట్ చేయకుండా స్ట్రైయిట్ గా డైరక్టర్ కథలోకి తీసుకు వెళ్ళటం ఆకట్టుకునే అంశం. అలాగే కోర్టు సీన్స్ బోర్ కొట్టకపోవటం కూడా సినిమాని చివరిదాకా చూసేలా చేసింది.

ఏదో అనుకుని..
ఓ బయోపిక్ లాంటి కథ ని ధ్రిల్లర్ గా మార్చుదామనుకుని చివరకు దానికి అనవసరమైన డైలాగులు, కామెడి సీన్స్ కలిపి మసాలా చేసేసారు.

ఇంట్రస్టింగే కానీ..
ఈ కథ తెరపై ప్రెజెంట్ చేసిన పద్దతి ఇంట్రస్ట్ కలిగించింది కానీ , కాంటంపరరీ కథ కాకపోవటం, అరవై ఏళ్ల క్రితం కథని చూడాలనిపించటం కాస్త ఇబ్బందికరమే.

ఆడేసుకున్నాడు
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కాకుండా మరొకరు ఎవరు ఉన్నా సినిమా అసలు చూడలేకపోదుము. క్యారక్టర్ లోపలకి వెళ్లి దానికి హుందాతనం ఇచ్చాడు.

ఇరగతీసింది
ఇలియానా ఇరగదీసిందనే చెప్పాలి. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు.

డైరక్టర్ ..
వాస్తవిక ఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను తెరకెక్కించడంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇబ్బందికరమైన.. అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా చక్కగా తెరకెక్కించటం కలిసి వచ్చే అంశం.

ఫస్టాఫ్ లైట్, సెకండాఫే టైట్
ఎలాంటి ట్విస్టులు, టర్న్ లు లేకుండా ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి కోర్టు సన్నివేశాలు.. వూహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయటమే కలిసి వచ్చింది. ముఖ్యంగా అక్షయ్.. ఇలియానా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఆ టైమ్ లోకి
కథాపరంగా 1959 వాతావరణంలోకి తీసుకువెళ్లటానికి, ఆ వాతావరణం కల్పించేందుకు దర్శకుడు చాలానే కృషి చేశాడని చెప్పాలి. కాకపోతే సినిమా లెంగ్త్ తగ్గించి ఉంటే మరింత బావుండేది.

వన్ మ్యాన్ షో
ఈ సినిమా కథ ప్రకారం సినిమా మొత్తం అక్షయ్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అక్షయ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపారేసాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో అక్షయ్ తన నటనతో ప్రేక్షకులను మంత్రం వేసినట్లు కదలకుండా చేయగలిగాడు.

ఎవరెవరు
చిత్రం పేరు: రుస్తమ్(హిందీ)
నటీనటులు: అక్షయ్‌కుమార్.. ఇలియానా.. అర్జన్ బజ్వా.. ఇషాగుప్తా తదితరులు
కథ: విపుల్ కె. రావల్
సినిమాటోగ్రఫీ: సంతోష్ తుందియిల్
దర్శకత్వం: టిను సురేశ్ దేశాయ్
నిర్మాత: నీరజ్ పాండే
ఫైనల్ గా ఈ చిత్రం సీరియస్ సినిమా కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన మసాలా సినిమా. అక్షయ్ కుమార్ అభిమానులకు పండుగ చేసుకునే సినిమా, మిగతావారికి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంజాయ్ చేయవచ్చు.