For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మస్కా' కొట్టారు కానీ... ('పిల్లా నువ్వు లేని జీవితం' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  మెగా క్యాంప్ నుంచి ఇంకో హీరో యాక్షన్ లవ్ స్టోరీ ఊతం చేసుకుని తెలుగుతెరపై అవలీలగా దూకేసాడు. దానికి గతంలో రామ్ హీరోగా వచ్చిన 'మస్కా' స్టోరీ లైన్ ని ఆధారం చేసుకున్నాడు. ఫన్ తో ఫస్టాఫ్ నడిపినా...ట్విస్ట్ లు కోసం సెకండాఫ్ క్లైమాక్స్ వరకూ కథలో విలన్ ఎవరనేది అసలు తేలకుండా దాచారు. దాంతో కాంఫ్లిక్ట్ కొరవడి కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి విలన్ ఎవరో రివిల్ అయ్యి... ఆ విలన్ కు బుద్ది చెప్పే సన్నివేశాలు కామెడీతో పండటంతో సర్దుకుంది. కొత్త హీరో నుంచి ఎక్సపెక్ట్ చేసే విషయాలను ప్రక్కన పెడితే...మంచి ఈజ్, డాన్స్ లతో బాగానే ఆకట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ.

  అనాధ కుర్రాడు శ్రీను(సాయి ధరమ్ తేజ) ఓ అమ్మాయి సిరి(రెజీనా) ని ఓ రోజు చూసి ప్రేమలో పడిపోతాడు. పడింతే తడువుగా అందరి హీరోలు లాగే ఆమె వెనక పడతాడు. అంతేకాదు ఆమెకు కుటుంబపరంగా ఓ సమస్య ఉందని, అందులో భాగంగా ఆమెను హత్య చేసేందుకు మైసమ్మ (జగపతిబాబు) అనే కాంట్రాక్ట్ కిల్లర్ టైప్ రౌడీ కు సుపారీ ఇచ్చారని తెలుసుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ.

  మల్టిఫుల్ ప్లాష్ బ్యాక్ లతో నడిచే ఈ చిత్రం కథనంలో అన్నీ దాచి పెట్టి..ఒక్కోటి రివీల్ చేస్తూ ముందుకు వెళ్లారు. అయితే హీరో పరంగా కథ నడిచే చిత్రాలకు ఇలాంటి స్క్రీన్ ప్లే కాస్త ఇబ్బందే. ఎందుకంటే ట్విస్ట్ కోసం విలన్ ఎవరో చివరి వరకూ దాచిపెడతారు. దాంతో విలన్ రివిల్ అవటానికి క్లైమాక్స్ దాకా సమయం తీసుకుంటే విలన్ కు, హీరోకు మద్య జరిగే గేమ్ కు సమయం ఎక్కడుంటుంది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారింది. యాక్షన్ చేస్తున్నట్లు కనపడతాడు...చూస్తే విలన్ చర్యలకు రియార్టు అవటం మాత్రమే అతను చేస్తున్నది అని అర్దమవుతుంది. చివరి పది నిముషాల దాకా అదే ఫాలో అయ్యారు. చివర్లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం దాన్నుంచి తప్పుకుని కాస్త కరెక్టు ట్రాక్ లోకి వచ్చారు.

  దానికితోడు జగపతిబాబు పాత్ర చిత్రంలో హీరోతో సమానంగా సీన్స్ రాసుకున్నారు. ఆయన క్యారక్టర్ ..కాంట్రాక్ట్ లు తీసుకుని మనష్యులను క్రూడ్ గా చంపేసే కిల్లర్. అయితే జగపతిబాబు పాత్రని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారనిపించింది. ఎందుంకంటే హఠాత్తుగా జగపతిబాబుని ...అలాంటి క్రూడ్ కిల్లర్ పాత్రలో ఊహించటం కష్టమనేది(లెజండ్ లో దాన్ని క్యారెక్టరైజేషన్ తో అధిగమించారు) ఒకటి అయితే రెండోది... చూస్తున్నంతసేపూ జగపతి బాబు... మంచోడు అనే అనిపించి...పేరుకు హీరో,హీరోయిన్ వెనక చంపుతానని పడతాడు కానీ...ఎలాగూ ఏమీ చేయడని అర్దమైపోతుంది. దాంతో ఎక్కడా నెగిటివ్ నెస్ ఎస్టాబ్లిష్ కాక కథలో కాంప్లిక్ట్ లేకుండా పోయింది. ప్రకాష్ రాజ్ వచ్చేవరకూ కథలో కిక్ లేకుండాపోయింది. అంతేకాకుండా హీరో ఎలా అనుకుంటే అలా అడ్డూ అదుపూ లేకుండా ఏ సమస్యలూ రాకుండా..,.అతని వేసే ప్లాన్ లు సవ్యంగా జరిగిపోతూ ఎక్కడా ఆసక్తి లేకుండా పోతుంది. ఫస్టాఫ్ లో లవ్ స్టోరీ కావటం, ఇంటర్వెల్ పండటం ఆ తేడా పెద్దగా కనపడలేదు కానీ సెకండాఫ్ లో ఆ సమస్య స్పష్టంగా కనిపించింది. ఇక క్లైమాక్స్ ఏదో హడావిడిగా జరిగిన ఫీలింగ్ వచ్చింది.

  మిగిలిన రివ్యూ స్లైడ్ షోలో...

  కుర్రాడు కేకే కానీ..

  కుర్రాడు కేకే కానీ..

  తెలుగు సినిమాకు మరో యంగ్ హీరో దొరికినట్లే. మరింత ప్రాక్టీస్ చేస్తే మాస్, మసాలా సీన్లలను ఒంటి చేత్తో లాక్కెళ్లగలడనిపిస్తోంది. అయితే నటనలో తమ కుటుంబ హీరోలు పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల ప్రభావం కనపడుతోంది. దాన్నుంచి ఎంత త్వరగా బయిటకు వస్తే అంత మేలు.

  ప్లస్ లు..

  ప్లస్ లు..

  ఫస్టాఫ్ : లవ్ స్టోరీని కొత్తగా చెప్పే ప్రయత్నం...జగపతిబాబు, సాయి ధరమ్ తేజ ల మధ్య వచ్చే సీన్స్..కామెడీ

  ఇంటర్వెల్ : ఇంట్రస్టింగ్ గా ఊహించని విధంగా ఉంది.. సెకండాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా ఉంది.

  సెకండాఫ్ : ట్రైన్ లో జరిగే సీన్స్, రైలు పట్టాల దగ్గర ఫైట్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్, సాయి ధరమ్ తేజ ల మధ్య వచ్చే కామెడీ

  మైనస్ లు..

  మైనస్ లు..

  జగపతి బాబుని ఇంకెంచెం సీరియస్ టోన్ లో చూపించి ఉంటే బాగుండేది. అతను లోకల్ రౌడీనా లేక మనుష్యులను చంపటానికి కాంట్రాక్టులు తీసుకునే వ్యక్తా అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు.

  ప్రకాష్ రాజ్ కు హీరోకు మధ్య అసలు కథ అయినప్పుడు దాన్ని చివరి వరకూ దాచి పెట్టి సాధించిందేమిటో కనపడదు. స్క్రీన్ టైమ్ వృధా చేయటం తప్ప

  కథనం, డైలాగులు

  కథనం, డైలాగులు

  ఫస్టాఫ్ లో చకచకా స్పీడుగా నడిచేలా కథనం రాసుకున్నారు. ఇంటర్వెల్ సైతం బాగా డిజైన్ చేసారు.

  పెన్ను చూసి నువ్వు అంత ఎగురుతూంటే ..గన్ తో వచ్చిన నాకెంత ఉండాలిరా... వంటి ప్రాసలతో బాగా ఆకట్టుకున్నాయి. మాటల రచయిత పడిన కష్టానికి థియోటర్స్ లో చాలా చోట్ల మంచి స్పందన వచ్చింది.

  సంగీతం

  సంగీతం

  అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద దృష్టి పెట్టినట్లుగా పాటలు మీద పెట్టలేదనిపిస్తుంది. రెండు పాటలు మాత్రం ఇప్పటికే పాపులర్ అయ్యాయి.

  టెక్నికల్ ...

  టెక్నికల్ ...

  కెమెరా వర్క్ ఎక్కడా వంక పెట్టలేని విధంగా సాగింది. చాలా చోట్ల లొకేషన్ అందాలని ఎలివేట్ చేసింది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా స్పీడుగా ఉండి..ఎక్కడా బోర్ కొట్టనివ్వని విధంగా బాగుంది.

  కామెడీ

  కామెడీ

  సినిమాలో రఘుబాబు తప్ప పెద్దగా కామెడీ ప్యాడింగ్ ని పెట్టుకోలేదు. ఈ మధ్య కాలంలో రొటీన్ గా మారిన కమిడయన్స్ ను, ఢీ తరహా కామెడీనీ వాడకుండా బ్రతికించారు. ఉన్నంతలో హీరో చేతే కామెడీ చేయించటం బాగుంది.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్: గీతాఆర్ట్స్

  నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, జగపతిబాబు, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు సంగీతం:అనూప్ రూబెన్స్,

  పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ,

  కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు,

  మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి,

  నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్,

  కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

  విడుదల తేదీ: 14, నవంబర్ 2014.

  ఫైనల్ గా తెలుగులో ప్లాఫైన చిత్రాలను కాస్త సంస్కరించి మళ్లీ రూపొందింది ఆకట్టుకోవచ్చు అని ప్రూవ్ చేస్తుందీ చిత్రం. తెలుగులో వచ్చే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నచ్చేవారికి బాగుందనిపిస్తుంది. రఘుబాబు మినహా ...ప్రత్యేకమైన కామెడి ప్యాడింగ్ ముఖ్యంగా బ్రహ్మానందం లేకపోయినా ధైర్యంగా తీసిన వీరి ధైర్యానికి మెచ్చుకోవాలి. హీరోకి ఇది మంచి లాంచింగే.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Sai Dharam Tej’s debut film, 'Pilla Nuvvu Leni Jeevitham', which is supposed to be his second, is released today (November 14th) with ok talk. Sai Dharam Tej and Regina Cassandra are the lead pair in this film, which is directed by 'Yagnam' fame A.S.Ravikumar Chowdary.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X