»   » కామెడీ క్రీమ్ ...(‘సుప్రీమ్’రివ్యూ)

కామెడీ క్రీమ్ ...(‘సుప్రీమ్’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

కథ,కథనం రెండింటితో పెద్ద పనిలేకుండా కేవలం కామెడీతోనే సినిమాని నడపొచ్చా...అంటే అవును తెలుగు సినిమాకు అదే చాలు అంటున్నారు ఇప్పుడొస్తున్న యంగ్ డైరక్టర్స్ చాలామంది. జనం...కాస్సేపు నవ్వుకోవటానికి ధియోటర్ కు వస్తారు..వారికి కావాల్సిన జోకులు ఇచ్చేద్దాం...వాటిని కలపటానికి చిన్న స్టోరీ లైన్ ..అదీ ఏ 'పసివాడి ప్రాణం' నాటిదో ..లాంటిదో పెట్టుకుంటే చాలు అని దర్శకుడు ఫిక్స్ అయ్యి 'సుప్రీమ్'స్క్రిప్టు రాసి తెరకెక్కించాడు.


అప్పటికీ కామెడీతోనే ఫస్టాఫ్ ఈజీగా తనకున్న కలం బలంతో ఈజ్ తో లాక్కెళ్లిపోయాడు. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి కథలోకి తప్పకుండా రావాల్సిన అవసరం ఉన్నా... ఆ పార్ట్ ని కూడా కామెడీతో నింపేసే ప్రయత్నం చేసి కాస్త ఇబ్బందిపెట్టాడు.


ఫోటో గ్యాలరీ : సుప్రీమ్


సాయిధరమ్ తేజ తన మామయ్య ల షేడ్స్ మాత్రమే కాకుండా మేనరిజం నుండి డైలాగ్ డెలవరిదాకా వారినే అనుసరిస్తూ మెగానందం కలగచేసాడు. డైరక్టర్ సైతం జింగ్..జింగ్ ఎమోజింగ్ అనుకుంటూ..హీరో తో సమానంగా కమిడయన్స్ కు ప్రయారిటీ ఇచ్చి ఒడ్డున పడే ప్రయత్నం చేసాడు.


బాలు(సాయి ధరమ్ తేజ) ఓ ఎగ్రిసివ్ టాక్సీ డ్రైవర్. తాగుబోతు తండ్రి (రాజేంద్రప్రసాద్) కు చూసుకుంటూ గడిపే అతనికి బెల్లం శ్రీదేవి(రాశిఖన్నా) అనే పోలీస్ ఇన్సపెక్టర్ తో సినిమాటెక్ లవ్ స్టోరీ. జీవితం ఇలా పాటలు, చిన్న చిన్న తగువులుతో గడిచిపోతూండగా ఓ రోజు అతనికి ఓ పసివాడు రాజన్ (మైఖల్ గాందీ) అనే పిల్లాడు తగులుతాడు. తల్లి తండ్రి లేని ఆ పిల్లాడ్ని తన దగ్గర పెట్టుకుని సాకుతూంటాడు.


మరో ప్రక్క ఆ పిల్లాడు రాజన్ కోసం ఓ పెద్ద విలన్ విక్రమ్ సర్కార్(కబీర్ ఖాన్) హైదరాబాద్ లో వెతుకుతూంటాడు. అంతేకాదు అదే పిల్లాడు కోసం నారాయణరావు (సాయికుమార్) అనే సామాజిక వేత్త వెతుకుతూంటాడు. మొత్తానికి ఓ రోజు విక్రమ్ సర్కార్ మనుష్యులు శ్రమ ఫలించి...మన హీరో బాలుని కొట్టి, రాజన్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకు పోతాడు. ఇంతకీ అసలు రాజన్ ఎవరు...అతని బ్యాక్ స్టోరీ ఏంటి...విలన్స్ కు అతనికి లింకేటి...బాలు..ఆ పిల్లాడిని ఎలా సేవ్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


దర్శకుడుకి కామెడీ మీద మంచి గ్రిప్ ఉందని మనకు పటాస్ తోనే అర్దమవుతోంది. దాన్ని మరోసారి ప్రూవ్ చేయటానికా అన్నట్లు కామెడీ క్యారక్టర్స్, సిట్యువేషన్స్ తో సినిమాని నింపే ప్రయత్నం చేసారు దర్శకుడు. అంతవరకూ ఇబ్బంది లేదు. కామెడీ సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోనే. కాబట్టి చూసేవాడికి, డబ్బు పెట్టి తీసేవాడికి హ్యాపీనే. అయితే వచ్చిన చిక్కల్లా ఆ కామెడీ సీన్స్ ని కలిపే మిగతా స్టోరీ లైన్ తోనే.


కామెడీ బాగుంది అన్నాం కదా అని నెగిటివ్ క్యారక్టర్స్ ని సైతం కామెడీ చేసేసి, హీరోకు అసలు కథలో సరైన కాంప్లీక్ట్ లేకుండా చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అంతెందుకు మెయిన్ విలన్, హీరో క్లైమాక్స్ లో మాత్రమే కలుస్తారు. అప్పటిదాకా హీరో ..ఆ విలన్ ని ఎదురుపడడు. డైరక్ట్ గానూ, ఇండైరక్ట్ గానూ ఎదుర్కోడు...విలన్ కు ఈ హీరోతో పనిలేదు. కేవలం ఫోన్ లో మాట్లాడుతూనే విలన్ కాలం గడుపుతూంటాడు.


సినిమా చూడ్డానికి వెళ్లిన ప్రేక్షకులేమో కాసేపు ఈ కామెడీని ప్రక్కన పెట్టి...ఆ విలన్ ని సీన్ లోకి తీసుకువచ్చి , హీరో తో ఛాలెంజో , ఫైటో పెట్టవచ్చు కదా అని ఎదురుచూస్తూంటారు. కానీ దర్శకుడు అంతకు దగ్గ ఒక్క సీన్ వెయ్యిడు. అంత అవసరం లేనప్పుడు అంతోటి విలన్, పెద్ద బిల్డప్ ఎందుకు అనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తపడి ఉంటే... ఖచ్చితంగా మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేది.


స్లైడ్ షోలో హైలెట్స్, మైనస్ లు


పృధ్వీ, ప్రభాస్ శ్రీను కామెడీ

పృధ్వీ, ప్రభాస్ శ్రీను కామెడీ

ఈ మద్యకాలంలో పృధ్వీ, ప్రబాస్ శీనుల కామెడీ క్లిక్ అవుతోంది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సినిమాలో క్యారక్టర్స్ బాగా నవ్వించాయి. కాస్ట్లీ కార్లు దొంగతనం చేసే వారి తీరు, జింగ్..జింగ్ ఎమోజింగ్ అంటూ చెప్పే డైలాగు నవ్విస్తుంది..ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక కూడా గుర్తుంటుంది.


రాశిఖన్నా

రాశిఖన్నా

అందం రాసిపొసినట్లుండే రాశి ఖన్నా...ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనపించింది. నటన కన్నా ఆమెను ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయం పైనే దర్శకుడు దృష్టి పెట్టి ఆ మేరకు సక్సెస్ అయ్యాడు.


మరిన్ని హైలెట్స్

మరిన్ని హైలెట్స్

సెకండాఫ్ లో వచ్చే ఛోటా విలన్ డెన్ లో ...దాగుడుమాతల ఆట, వికలాంగులైన బాడీ బిల్డర్స్ ఫైట్, సుప్రీమ్ సాంగ్ రీమిక్స్ . ఫస్టాఫ్ లో జానకీ ఆ కత్తి అందుకో అంటూ ఆ తరం హీరోలను ఇమిటేట్ చేస్తూ మాట్లాడే రఘుబాబు నటన.


మిగతా డిపార్టమెంట్ లు

మిగతా డిపార్టమెంట్ లు

సాయి కార్తీక్ అందించిన పాటలు సోసోగా ఉన్నా పిక్చరైజేషన్ బాగా చేసి ఆ లోటు తెలియనివ్వలేదు దర్శకుడు. ముఖ్యంగా అందం హిందోళం పాటలో కెమెరా వర్క్ టావప్ గా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత ట్రిమ్ చేసి ఉంటే డ్రాగ్ అయిన ఫీల్ వచ్చేది కాదు.


రెచ్చిపోయాడు

రెచ్చిపోయాడు

సాయిధరమ్ తేజ ఓ సీనియర్ హీరోలా కెమెరా ముందు రెచ్చిపోయాడు. అతని ఐదో చిత్రం అంటే నమ్మలేం. అంతలా డైలాగ్ డెలవరీ, రియాక్షన్స్, డాన్స్ ల్లో ఈజ్ చూపించాడు. సుప్రీమ్ హీరో అనటానికి అర్హత వచ్చేసినట్లే.


అదే ప్లస్, మైనస్

అదే ప్లస్, మైనస్

ఈ సినిమాకు అడుగడుగునా ప్రతీ ఫ్రేమ్ లోనూ ఫన్ కు ప్రయత్నించటమే ..విషయం లేని కథకు ప్లస్ అయ్యింది. అలాగే ...ప్రతీ చోట కామెడీ చేసి, చివరకు విలన్ డెన్ లో కూడా.....హీరో, విలన్ మధ్య ఉండే ఇంటిన్సిటీ ని తగ్గించేసాడు. దాంతో కాంప్లిక్ట్ లో బలం తగ్గిపోతూ వచ్చింది.


దర్శకుడుగా

దర్శకుడుగా

పటాస్ ని కామెడీతో నింపి హిట్ కొట్టిన అనీల్ రావిపూడి ఆ స్దాయిలో ఈ సినిమా స్క్రిప్టు రాసుకోలేకపోయాడు. అందుకు కారణం..ఈ కథ కోసం తీసుకున్న ధిన్ లైన్. ప్రొడిక్టుబుల్ కధనం. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ని సినిమాలో నింపటంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.


ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: సాయిధరమ్‌తేజ్, రాశిఖన్నా, రాజేంద్రప్రసాద్, రవికిషన్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీమోహన్, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
రచనాసహకారం:,సాయికృష్ణ
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ,
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
విడుదల తేదీ: మే 5, 2016.ఫైనల్ గా ...ఈ సినిమా మరో రొటీన్ మసాలా సినిమానే అయినా ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అవటం కలిసి వచ్చే అంశం. కామెడీ సినిమాగా చూస్తే బాగుంటుంది. అలాగే హింస లేకపోవటం, సమ్మర్ శెలవలు, త్వరలో విడుదలయ్యే బ్రహ్మోత్సవం, అ..ఆ సినిమాలు క్లాస్ సినిమాలు కావటం తో మాస్ ఇదే బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాసం ఉంది.

English summary
Sai Dharam Tej's fourth outing Supreme, directed by Anil Ravipudi released today with average talk. It is commercial entertainer in the recent past.Supreme might end up as a decent grosser at the domestic box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu