»   » ఇదేం లెక్క? (సాయి ధరమ్ తేజ 'తిక్క' రివ్యూ)

ఇదేం లెక్క? (సాయి ధరమ్ తేజ 'తిక్క' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

తన తొలి సినిమా 'ఓం'తో కళ్యాణ్ రామ్ వంటి హీరోను పెట్టుకుని ధియోటర్ లో జనాలను పారిపోయేలా చేసిన దర్శకుడు సునీల్ రెడ్డి ద్వితీయ ప్రయత్నం ఇది. అలాంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన దర్శకుడుకు రెండో సినిమా ఓ ఫామ్ లో ఉన్న హీరో ఇచ్చాడంటే ఏమని ఎక్సపెక్ట్ చేస్తాం. ఓ అద్బుతమైన కథ చెప్పి ఉంటాడు. అందుకే ఆ ప్లాఫ్ ని పట్టించుకోకుండా హీరో సినిమా ఇచ్చాడనుకుంటాం. కానీ సినిమా చూసాక అర్దమవుతుంది. ఆ దర్సకుడు ఏమీ మారలేదు. తొలి సినిమాలాగే..ఏదో చేద్దామనుకుని, ఏదోదో చేసాడని. హీరోనే అంచనా వేయటంలో దెబ్బ తిని,మనని దెబ్బ తీసాడని.

ఆదిత్య (సాయిధరమ్‌ తేజ్‌) మందు,మగువ లైఫ్ అని ఓ జల్సారాయుడు. అలాంటి ఈ కుర్రాడు ఓ రోజు అంజలి (లరిస్సా బోన్సి) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సైట్ కొట్టి,కొట్టి,ఆమెను ఒప్పిస్తాడు. అంతేకాకుండా ఆమె కోసం తనను తాను మార్చుకుంటాడు. కానీ ఓ రోజు ఆమె హఠాత్తుగా కొన్నిసిల్లీ రీజన్స్ సాకుగా చూపించి బ్రేకప్‌ చెప్పి బై అంటుంది అంజలి. వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో ఫ్రెండ్స్ తో కలసి తెగ తాగేస్తాడు ఆదిత్య. ఆ హ్యాగోవర్ లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మొత్తం మారిపోతుంది. రకరకాల కన్ఫూజన్స్ ఏర్పడతాయి.ఆ కన్ఫూజన్స్ ఏమిటి? అంజలి బ్రేకప్ కి అసలు రీజన్ ఏమిటి? అసలా లెటర్ లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ని గుర్తు చేసే ఈ కథని కన్ఫూజన్ కామెడీ గా చేసి నవ్విద్దామని దర్శకుడు అభిప్రాయం. అయితే కథలో పాత్రలను కన్ఫూజన్ చేసే క్రమంలో కథకుడే డైరక్టర్ అయిన సునీల్ రెడ్డి కన్ఫూజ్ అయిపోయినట్లున్నాడు. అక్కడక్కడా నవ్వించినా చాలా వరకూ నవ్వులు పాలైంది. సాయి ధరమ్ తేజ రేయ్ చిత్రం కూడా ఈ సినిమాతో పోలిస్తే బాగుందనిపించేలా దర్శకుడు కష్టపడి స్క్రీన్ ప్లేని నాశనం చేసాడు. దర్శకుడు గొప్పతనం మొదటి పదినిముషాల్లోనే కథ,కథనం ని దారి తప్పించి బోర్ కొట్టించటంలోనే మనం గమనించవచ్చు.


ఈ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ దేవిచరణ్ చాలా బాగా చేసాడు. గతంలో ఎన్నో సినిమాల్లో చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వస్తుంది. ఈ సినిమా చూస్తే తెలుగులో ఉన్న మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ ని మన ఇండస్ట్రీ ఉపయోగించుకోలేదని అర్దం అవుతుంది.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ...


తిక్క తిక్కగా

తిక్క తిక్కగా

ఈ మధ్యకాలంలో ఇంత తిక్క తిక్కగా రాసిన కథ కానీ, సినిమా కానీ ఏదీ లేదనే చెప్పాలి. సినిమా అవుట్ పుట్ చూసుకుని టైటిల్ పెట్టాడా అనే డౌట్ వచ్చేలా సినిమా నడుస్తుంది.తబడడ్డాడు

తబడడ్డాడు

హీరో తాగిన మైకంలో చేసిన నిర్వాకాన్ని హైలైట్‌ చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు కథనం నడిపి, ఆ దార్లో తడబడి, అందరినీ బోల్తా కొట్టించాడు. ఎంతదారుణంగా ఉందంటే ఫస్టాఫ్ పూర్తి అయ్యేసరికి మూడు నాలుగు సినిమాలు కలసి చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.సాగతీసిన యాక్షన్

సాగతీసిన యాక్షన్

ఫస్టాఫ్ లో ఓ ఛేజింగ్ సీన్ చూస్తూంటే విరక్తి కలుగుతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ ని కూడా తీస్తారా అనిపిస్తుంది. ఇక ఈ ఛేజింగ్ ఎప్పుడు అయిపోతుందా అన్నట్లు దేముడుకు మ్రొక్కుకుంటారు ప్రేక్షకులు.నా సామిరంగా

నా సామిరంగా

ఫస్టాఫ్ చూసారు కదా..భరించారు కదా..మీపని చెప్తా...సెకండాఫ్ చూద్దామని ఫిక్సైన మీకు నరకం చూపిస్తా అని డైరక్టర్ అనుకున్నాడే ఏమో కానీ కన్ఫూజన్ కామెడీ అంటూ చెత్త సీన్స్ పేర్చటం మొదలెడతాడు.గోల గోల

గోల గోల

సినిమాలో చాలామంది నటీనటులున్నారు. అయితే ఎవరినీ సరిగా ఉపయోగించుకోలేదు. సరికదా వాళ్లందిరి చేతా గోల గోల చేయించాడు. ఆఖరికి రాజేంద్రప్రసాద్‌, ఇద్దరు హీరోయిన్లతో సహా..అందరూ గోల చేయటమే సరిపోయింది.మందుబాటిల్

మందుబాటిల్

ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటీ అంటే ప్రతీ క్యారక్టర్ చేతిలోనూ ఓ మందుబాటిల్ ఉండటమే. తిక్క అని పెట్టకుండా మందు బాటిల్ అని పెట్టినా పోయిదేమో అనిపిస్తుంది.ఐటం దారుణం

ఐటం దారుణం

ఇక ఐటం సాంగ్ అయితే చెప్పక్కర్లేదు..అదెందుకు పెట్టారో, అసలు ఆ సాంగ్ అక్కడ పెట్టడంలో ఉద్దేశ్యమేమిటో ఎవరికీ అర్దం కాదు. ఇది కంగాళి సినిమానా అని ఖరారు చేసేస్తుంది.బురఖా కామెడీ

బురఖా కామెడీ

ఈ సినిమాలో మరో దరిద్రపు కొట్టు ఎపిసోడ్ ..స్త్రీ పాత్రలన్నిటికీ బురఖా వేసి, ఓ అరగంట సేపు ఆ ఎపిసోడ్ నడపటంఅలీ-ముమైత్

అలీ-ముమైత్

ఈ సినిమాలో హైలెట్ అని చెప్తూ వస్తున్న అలీ,ముమైత్ ఖాన్ ల కామెడీ చూస్తూంటే కడుపులో దేవుతుంది. అసలింత చీప్ టేస్ట్ ఎవరిదా అనే డౌట్ వస్తుంది.తప్పేమి లేదా అంటే

తప్పేమి లేదా అంటే

సాయి ధరమ్ తేజ చాలా ఉషారుగా నటించే ప్రయత్నం చేసాడు. సీన్స్ లో బలం లేనప్పుటికీ ఉన్నంతలో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసాడు కానీ బొక్కలెక్కవటంతో బోర్లా పడ్డాడు.టెక్నికల్ గా

టెక్నికల్ గా

ఈ సినిమాలో గుహన్ కెమెరా వర్క్ మెచ్చుకోదగిన రీతిలో ఉంటుంది. ఎడిటింగ్ సోసో గా ఉంటుంది. సినిమాలో ఇంకా సగం ఎడిట్ చేసి పారేస్తే సుఖంగా ఉండేదనిపిస్తుంది. డైలాగులు బాగా నార్మల్ గా ఉన్నాయి. నిర్మాణవిలువలు మాత్రం బాగున్నాయి.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్
నటీనటులు: సాయిధరమ్‌తేజ్, లరిస్సా బోన్సి, మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్, ముమైత్‌ఖాన్, అలీ, రఘుబాబు, అజయ్, తాగుబోతు రమేష్‌ తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌
మాటలు: లక్ష్మీ భూపాల్, హర్షవర్థన్‌
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాత: రోహన్‌రెడ్డి
దర్శకత్వం: సునీల్‌రెడ్డి
నిర్మాణం: వెంకటేశ్వర మూవీ మేకర్స్‌
విడుదల: 13-08-2016ఫైనల్ గా తిక్క రేగటం అంటే ఏమిటో స్వయంగా అనుభవించి తెలుసుకోవాలంటే ఈ సినిమాకు వెళ్ళటం మంచి ఆప్షన్.

English summary
Sai dharma teja's Thikka movie released today with divide talk. This movie is one such movie where everything has gone awry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu