»   »  ఫార్ములా రన్నర్...కానీ (సాయి ధరమ్ తేజు 'విన్నర్' మూవీ రివ్యూ)

ఫార్ములా రన్నర్...కానీ (సాయి ధరమ్ తేజు 'విన్నర్' మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

కమర్షియల్ హీరోలు రొటీన్ కథలే ఎంచుకోవాలని ఏదన్నా రూల్ పెట్టుకున్నారో ఏమో ఎన్నో సార్లు తెరకెక్కిన పాయింట్ నే అటు తిప్పి ఇటు తిప్పి , బ్యాక్ డ్రాప్ మార్చి వదులుతున్నారు. ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ సైతం అదే స్కూల్ లో ప్రయాణిస్తూ...విన్నర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు.

వరుస హిట్స్ తో మంచి ఫాంలో చెలరేగిన తేజ్ కి తిక్క సినిమాతో బ్రేక్ వేసింది. ఆ బ్రేక్ ని బ్రేక్ చేయటానికి కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన గోపీచంద్‌ మలినేని ని దర్శకుడుగా ఎంచుకున్నాడు. దాంతో ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


మరి ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం సాయి కెరీర్ కు ఏమన్నా బూస్ట్ ఇచ్చిందా..? గోపిచంద్ మలినేని మరోసారి కమర్షియల్ డైరెక్టర్ గా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడా..? ఏ మేరకు మెప్పించిందో..అంచనాలకు తగినట్లే ఈ చిత్రంసినిమా ఉందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.


జగపతిబాబు పాత్ర

జగపతిబాబు పాత్ర

హార్స్‌ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). మహేందర్ రెడ్డి (జగపతి బాబు) ఇండియాలోనే బెస్ట్ జాకీ. వందల కోట్ల ఆస్తులకు వారసుడు. అవన్ని కాదనుకొని తను ప్రేమించిన అమ్మాయి కోసం తండ్రి (ముఖేష్ రుషి)ని ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఆయన కొడుకే సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌).


పార్టనర్స్ ఒత్తిడి

పార్టనర్స్ ఒత్తిడి

కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తరువాత భార్య చనిపోవటంతో కొడుకు సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. ఈ లోగా మహేందర్ రెడ్డి తండ్రికి బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. వరుసగా తాము బెట్టింగ్ వేసిన గుర్రాలు ఓడిపోతుండటంతో మహేందర్ రెడ్డి వస్తేనే తిరిగి బిజినెస్ లాభల్లోకి వస్తుందని పార్టనర్స్ ఒత్తిడి చేస్తారు.


అమ్మా,నాన్నలపై ద్వేషం

అమ్మా,నాన్నలపై ద్వేషం

కానీ మనవడిని మాత్రం తన కొడుకు నుంచి ఎలాగైన దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. అ నుకున్నట్టుగా తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచి సిద్ధార్థే, తండ్రి మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు. తండ్రి రేసుల కారణంగా తనకు దూరమయ్యాడన్న కోపంతో నాన్న అన్నా, గుర్రాలన్నా, రేసులన్నా ద్వేషం పెంచుకుంటాడు సిద్ధార్థ్.


క్రియేటివ్ హెడ్ గా

క్రియేటివ్ హెడ్ గా

తన తండ్రిపై ద్వేషం పెంచుకుని ఇంట్లోంచి పారిపోయిన సిద్దార్ద...20 ఏళ్ల తరువాత సిద్ధార్థ్ న్యూ లుక్ పత్రికలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని చూసి ప్రేమిస్తాడు.


హీరోయిన్ కు పెళ్ళి

హీరోయిన్ కు పెళ్ళి

ఒక పార్టీలో కలిసిన రేసర్ సితారతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ సితార మాత్రం తన గోల్ గురించి చెప్పి సిద్ధార్థ్ ప్రేమను కాదంటుంది. ఆ కోపంతో సితార రన్నింగ్ కాంపిటీషన్ కు రెడీ అవుతున్న విషయం వాళ్ల ఇంట్లో చెప్పేస్తాడు. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్‌).. నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్‌ అనూప్‌సింగ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్‌ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు


హీరోని పందెంలోకి

హీరోని పందెంలోకి

పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్న సితార.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్ ను ప్రేమించానని.. అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. అంతటితో ఆగకుండా ...వీరు తీసుకువచ్చిన పెళ్లి కొడుకు తన ప్రియుడితో రేసులో గెలవాలని పందెం కాసి ఇరికిస్తుంది.


 హార్స్ రేసులో పాల్గొన్నాడా

హార్స్ రేసులో పాల్గొన్నాడా

అదే సమయంలోనే ఈ పోటీలో త‌న‌ కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు సిద్ధార్థ్‌. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. అలాగే..సితార ప్రేమ కోసం అనుకోకుండా పందెంలోకి దిగిన సిద్దార్థ్ ను గెలవకుండా చేయడానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాకీ అయిన ఆది అడ్డుపడుతుంటాడు.


రేసులోకి దిగి

రేసులోకి దిగి

అదే సమయంలో సిద్దార్థ్ తను చిన్నతనంలో దూరమైన తండ్రి ప్రేమను గెలుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇలా సితార ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం రేసుకు దిగిన సిద్దార్థ్ తనకు అడ్డుపడుతున్న ఆదిని ఎలా ఎదుర్కొంటాడు ? అసలు ఆది ఎవరు ? మరి గుర్రాలంటే పడని సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? సితారను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? సిద్ధార్ధ్, తిరిగి తండ్రి మహేందర్ రెడ్డి దగ్గరకు చేరుకున్నాడా..? అన్నదే మిగతా కథ.


కొత్త విషయం అదే

కొత్త విషయం అదే

హార్స్ రైడింగ్ నేపధ్యం, తండ్రి ,కొడుకుల సెంటిమెంట్ ఇది ఈ టెంప్లేట్. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో తెలుగు తెరపై చూసిన ప్రేక్షకుడుకి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చేయటమే కొత్త విషయం. ఏ సీన్ కా సీన్ నవ్వించామా, సరదాగా గడిపేసామా అనే లెక్కలు వేసుకుని దర్శకుడు, రచయిత కుస్తీ పట్టినట్లు అర్దమవుతుంది. కేవలం ఈ సనిమాలో కొత్త విషయం ఏమన్నా ఉందీ అంటే అది హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ మాత్రమే.


క్లైమాక్స్ లో

క్లైమాక్స్ లో

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. అయితే సెకండాఫ్ లో చాలా సీన్స్ అతనికి కలిసిరాక,ఎనర్జీని కిల్ చేస్తూ వచ్చాయి. అయితే హార్స్ రైడింగ్ సీన్స్ కోసం సాయి పడిన కష్టాన్ని మాత్రం మెచ్చుకుతీరాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో సాయి ప్రొఫెషనల్ జాకీలా కనిపించాడు.


ఇంటర్వెల్ ముందు దాకా

ఇంటర్వెల్ ముందు దాకా

కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు పరమ రొటీన్‌గా సాగుతాయి. ‘సింగమ్‌ సుజాత'గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌ ప్రవేశంతో కథ ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. అయితే ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు.ఇంటర్వెల్ ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అయితే ఫస్టాఫ్ చివర్లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఊహించని విధంగా హీరో లైఫ్ టర్న్ తీసుకోవడం, అతనికి గెలవడం తప్ప వేరే మార్గం లేదన్నట్టు చేసే ఇంటర్వెల్ హైలెట్ గా నిలిచింది.


సెకండాఫ్ లో అలా చేసుంటే

సెకండాఫ్ లో అలా చేసుంటే

సెకండాఫ్ లో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే కామెడీ, క్లైమాక్స్ సీన్స్ హార్స్‌రేసింగ్‌ సన్నివేశాలు ను బ్యాంకింగ్ గా పెట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో ఇంకో సుఖం ఏమిటీ అంటే..పెద్దగా ట్విస్ట్ లు , టర్న్ లు పెట్టి ప్రేక్షకుడు బుర్ర పని పెట్టదలుచుకోలేదు దర్శకుడు. కథంతా చక్కగా హాయిగా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్‌ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. ఫస్టాఫ్ స్థాయిలో ఇంటర్వెల్ తర్వాత కూడా ఎంటర్నైన్మెంట్ మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది.


జగపతిబాబు ప్లస్

జగపతిబాబు ప్లస్

జగపతి బాబు మరోసారి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. జగపతిబాబు నటన, ఆయన పాత్ర చాలా బాగుంది. స్టైలిష్ గా కనిపిస్తూనే ఎమోషన్స్ పండించాడు. విలన్ థాకూర్ అనూప్ సింగ్ స్టైలిష్ గా కనిపిస్తూ, క్రూరత్వాన్ని పండించాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్ లో సాయికి గట్టి పోటి ఇచ్చాడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అందంగా కనిపించి, ఆకట్టుకుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది.


కామెడీ ఓకే

కామెడీ ఓకే

వెన్నెల కిశోర్, అలీ, 30 ఇయర్స్ పృథ్వీలు కామెడీ బాగుంది. హీరో ఫ్రెండ్ పద్మగా వెన్నెల కిశోర్ పాత్ర ద్వారా పండించిన కామెడీ, ఊహించని విధంగా మధ్యలో వచ్చి బిత్తిరి సత్తి చేసిన కామెడీ బాగా నవ్వించాయి. కాకపోతే అలీ కామెడీ వర్కవుట్ కాలేదు ఇక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ సింగం సుజాతగా పృథ్వి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, సురేష్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్‌ అయ్యాయి.


డైలాగులు పేలాయి

డైలాగులు పేలాయి

సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. అబ్బూరి రవి డైలాగులు బాగున్నాయి. అభిమానుల కోసమే అన్నట్టు ధరమ్ తేజ్ చెప్పిన కొన్ని పంచ్ డైలాగులు బాగా పేలాయి.పాటలు జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


సినిమా టీమ్ ఇదే

సినిమా టీమ్ ఇదే

సినిమా పేరు: విన్నర్‌
నటీనటులు: సాయిధరమ్‌ తేజ్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జగపతిబాబు.. అనూప్‌సింగ్‌.. ముఖేష్‌రుషి.. వెన్నెల కిషోర్‌.. రఘుబాబు.. పృథ్వీ.. అలీ.. అనసూయ తదితరులు
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
సంగీతం: తమన్‌
కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌
కథ: వెలిగొండ శ్రీనివాస్‌
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
సంస్థ: లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 24-02-2017స్టార్ హీరోలంతా విభిన్నమైన కథలతో ముందుకు వెళ్తూంటే...ఇప్పుడిప్పుడే మాస్ ఇమేజ్ తెచ్చుకుంటూ సెటిల్ అవుతున్న సాయి ధరమ్ తేజు మాత్రం రొటీన్ కే రొటీన్ గా ఉండే కథలతో విన్నర్ అవాలని చూడటం సాహసమే.

English summary
Director Gopichand Malineni's Telugu movie Winner featuring Sai Dharam Tej and Rakul Preet Singh in the lead roles, is a much-hyped and highly-awaited film. The film released in theatres around the world on 24 February with average talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu