For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాత లీలే (సల్మాన్ ' ప్రేమ్‌ లీల' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5
  హీరో డ్యూయిల్ రోల్...ఒక హీరో కోటీశ్వరుడు ... అమాయికత్వం కలగలిసిన అతన్ని సమస్యలు చుట్టి ముట్టి ఉంటాయి. అదే పోలికలతో ఉన్న ఇంకో హీరో మిడిల్ క్లాస్ మారాజు...ఇంటిలిజెంట్. దాంతో అతని ప్లేస్ లోకి వెళ్లి వాటిని తన తెలివి, లౌక్యంలతో ఛేధించేస్తాడు. ఈ ఫార్ములా... రాజు-పేద , రాముడు-భీముడు, రౌడీ అల్లుడు, హలో బ్రదర్ అంటూ ఇలా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోటే సల్మాన్ ఖాన్ ...దీపావళి కానుకగా మన ముందుకు వచ్చాడు. అయితే రాజశ్రీ వారు ఇంత గ్యాప్ ఇచ్చి ఇలాంటి నలిగిన కథతో సినిమా ఎందుకు చేయాలనుకున్నారు...రివ్యూ చదివి తెలుసుకోండి.

  కథేమిటంటే... రామ్‌లీలా కళాకారుడు అయిన ప్రేమ్ (సల్మాన్‌ఖాన్) తన సంపాదనలో చాలా భాగాన్ని సామాజిక సేవాసంస్థ 'ఉపహార్' ఫౌండేషన్‌కు ఇచ్చేస్తుంటాడు. ఆ ఫౌండేషన్‌ను దేవ్‌గఢ్ రాజకుమారి మైథిలి (సోనమ్ కపూర్) నడుపుతుంటుంది. ప్రేమ్ జీవితాశయం ...ఆమెను ప్రత్యక్షంగా కలసి, మాట్లాడాలని . అయితే ప్రీతమ్‌పూర్ రాకుమారుడు విజయ్ సింగ్ (మళ్లీ సల్మాన్‌ఖాన్)తో రాజకుమారి పెళ్ళి కుదిరిందనీ, అతనికి రాజతిలకం దిద్దే ఉత్సవానికి ఆమె వస్తోందనీ తెలుసుకుంటాడు. దాంతో ప్రేమ్ డైరక్ట్ గా వెళ్ళి, ఆమెను కలిసి, డబ్బు ఆమె చేతికే ఇవ్వాలనుకుంటాడు.

  మరోపక్క సవతి చెల్లెళ్ళు చంద్రిక (స్వరభాస్కర్), రాధికలను నచ్చజెప్పడానికి వెళ్ళిన రాకుమారుడు శత్రువుల పన్నాగంతో పెను ప్రమాదానికి గురవుతాడు. లేవలేని స్థితిలో ఉన్న రాకుమారుణ్ణి రహస్య ప్రదేశంలో ఉంచి, దివాన్ (అనుపమ్‌ఖేర్), రాజాస్థాన సెక్యూరిటీ చీఫ్ వైద్య చికిత్స చేయిస్తుంటారు. నాలుగు రోజుల్లో ఉన్న ఉత్సవానికి ఏం చేయాలో వాళ్ళకు పాలుపోదు.

  ఇంతలో సరిగ్గా రాకుమారుడి పోలికలతో ఉన్న మన ప్రేమ్ ఎదురవుతాడు. దాంతో ప్రేమ్ ని..రాకుమారుడి స్థానంలో పెట్టి, కథ ముందుకు నడిపిస్తారు. రాకుమారుడిలా నటిస్తున్న ప్రేమ్ తన ప్రవర్తన, ఆప్యాయత, అనురాగాలతో అందరి మనసూ చూరగొంటాడు. రాకుమారుడి పట్ల ముభావంగా ఉన్న రాజకుమారిలో ప్రేమ పొంగేలా చేస్తాడు.

  మరోపక్క రాకుమారుడి మీద హత్యాయత్నం చేసింది సవతి తమ్ముడు (నీల్ నితిన్ ముఖేశ్), అతని గ్యాంగ్ అని తెలుస్తుంది. వాళ్ళకీ రాకుమారుడి వేషంలో ఉన్నది రాజుకుమారుడు కాదని ప్రేమ్ ని అర్థమవుతుంది. అప్పుడు ప్రేమ్ ఏం చేశాడు? బంధాల్ని కాలదన్నుకుంటున్న వాళ్ళనెలా మార్చాడు? రాజకుమారి ప్రేమ కథ ఏమైంది? లాంటివన్నీ తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

  అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. మొదటే చెప్పుకున్నట్లు ఇలాంటి కథలు మన ఇండియన్ తెరకి కొత్తేమీ కాదు. దాంతో ఈ కథ, కథలో వచ్చే మలుపులూ కొత్తగానూ అనిపించవు. అయితే దర్శకుడు తన విజువల్ ట్రీట్ తో చాలా సన్నివేశాలను మెస్మరైజింగ్ గా మార్చేసాడు.

  Salman's Prem Leela Movie review

  అయితే సినిమా మొత్తం ఉత్సవాలతో నిండిపోయి గత రాజశ్రీ వారి చిత్రాల తరహాలోనే మ్యూజికల్ డ్రామాలా సాగుతుంది. సల్మాన్ ఫ్యాన్స్ ఇది డబుల్ ట్రీట్. ఓ రకంగా సల్మాన్ తన భుజాలపై సినిమా మొత్తం మోసాడు. సోనమ్ కపూర్...అందంగా కనిపించింది కానీ నటన ఆ స్ధాయిలో లేదనిపిస్తుంది. అనుపమ ఖేర్ వంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి చెప్పేదేముంది. విలన్లుగా నీల్ నితిన్ ముఖేశ్, అర్మాన్ కోహ్లీ సినిమాలో హైలెట్ గా నిలిచారు.

  టెక్నికల్ గా చెప్పాలంటే సినిమాటోగ్రాఫర్ తన ప్రతిభను మొత్తం ఈ సినిమాలోనే చాపారా అన్నట్లు ఫ్రేమ్ లు పెయింటింగ్ లా ఉన్నాయి. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం 'స్కై ఫాల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హ్యారీ పోటర్' ఫేవ్‌ స్టంట్‌డెరైక్టర్ గ్రెగ్ పోవెల్‌ను తెచ్చారు. అవి బాగున్నాయి. 'మొఘల్ -ఏ-ఆజమ్'లో చర్చనీయాంశమైన శీష్‌మహల్ సెట్ లాంటి దాన్నే కళా దర్శకుడు నితిన్ తిరిగి ఈ సినిమాలో చూపి అందరి మన్ననలూ పొందారు. ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ ప్రేమ లీలలో సల్మాన్‌కు రామ్‌చరణ్ గొంతవటంతో తెలుగు నేటివ్ ఫీల్ వచ్చింది.
  తెలిసిన కథ, స్లో నేరేషన్ వంటి అంశాలు మినహాయిస్తే సినిమా కలర్ ఫుల్ రైడ్ లా ఉంటుంది. రాజశ్రీ తరహా కుటుంబాలు, ప్రేమ, అనుబంధాలు వంటివి ఈ మధ్య సినిమాల్లో మిస్సైపోతున్నాం అనుకునే వారు ఇది మిస్ కాకూడని చిత్రం.

  నటీనటులు: సల్మాన్‌ఖాన్‌, సోనమ్‌ కపూర్‌, నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు
  సంగీతం: హిమేష్ రేష్మియా,
  నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి,
  చాయాగ్రహణం: వి.మణికందన్,
  ఎడిటర్: సంజయ్ సంక్ల,
  పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్,
  నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్,
  కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య

  English summary
  "Prema Leela", the Telugu version of Salman Khan and Sonam Kapoor starrer "Prem Ratan Dhan Payo", Ram Charan has given dubbing for Salman's character released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X