»   » స్ఫూఫ్ 001 ( ‘సింగం123’ రివ్యూ)

స్ఫూఫ్ 001 ( ‘సింగం123’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5

'హృదయకాలేయం' తో పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు కు ఓ వర్గంలో మంచి క్రేజే వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవటానికా అన్నట్లు పూర్తి స్ఫూఫ్ కధాంశంతో ..‘సింగం123' ని థియోటర్స్ లోకి దింపారు. ట్రైలర్స్ తో ఆకట్టుకుని మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆశగా థియోటర్స్ కు వెళ్లిన వారి అంచనాలను తలక్రిందలు చేసిందనే చెప్పాలి. చిత్రం స్ఫూఫ్ కే స్ఫూఫ్ గా తయారైంది. సినిమాలో ఎక్కడన్నా ప్యారెడీ ఉంటే ఎంజాయ్ చేస్తాం కానీ ప్యారెడీనే పూర్తి సినిమా అయితే కష్టమనే భావన తెచ్చింది.

బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలి అన్నట్లు ...ఎంత ప్యారెడీ చిత్రానికైనా కథ,స్క్రీన్ ప్లే అత్యవసరం అనేది మరోసారి ప్రూవ్ చేస్తుంది. అయితే చిత్రానికి నిర్మాత,కథ,స్క్రీన్ ప్లే అందించిన మంచు విష్ణు... "ఈ సినిమాను బ్రెయిన్‌తో చూడకూడదు. కేవలం తెరమీద బొమ్మను చూసి నవ్వుకోవాలంతే" అంటూ చెప్పారు కాబట్టి...పెద్దగా ఆలోచించటం అనవసరం.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Sampoornesh Babu's Singam 123 review

పోలీస్ స్టేషన్ కడితే కూల్చేస్తా...పోలీస్ అనేవాడు అడుగుపెడితే కాల్చేస్తా అనే విలన్ లింగం . అతను ఉండే సింగరాయకొండలో సారా వ్యాపారం చేస్తూ, దొంగనోట్లు ముద్రిస్తూ ఇలా అనేక సినిమాటెక్ అక్రమాలుకు పాల్పడుతూంటాడు. అక్కడ జనం పడే ఇబ్బందులను గమనించిన హోం మినిస్టర్..ఆ ఊళ్లోని సీక్రెట్ పోలీస్ స్టేషన్ కు ..ఓ సీక్రెట్ పోలీస్ అధికారిగా సింగం 123 (సంపూర్ణేష్ బాబు) ని అపాయింట్ చేస్తాడు. ఇదే సమయంలో సంపూర్ణేష్ బాబు సింగరాయకొండతో తనకున్న అనుబంధం గురించి తెలుసుకుంటాడు. సింగరాయకొండలో సింగం తనదైన శైలిలో విలన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సింగం పోలీస్ కాదనే ఒక విషయం విలన్‌కి తెలుస్తుంది. నిజంగానే సింగం పోలీస్ కాదా? విలన్ ‘లింగం'కు, సింగంతో ఉన్న పగ ఏంటీ? సింగం తండ్రి జంగం(పృద్వీ) ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


అయితే అలాంటి ప్యారెడీతో వచ్చిన సుడిగాడు(అల్లరి నరేష్)లాగ ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినా అక్కడ కథాంశం బలంగా ఉండటం, సినిమాలో ట్విస్ట్ లు, ఫన్ ఎపిసోడ్స్ కలిసి వచ్చాయి. ఇక్కడ అవే లోపించాయి. దర్శకత్వం, నిర్మాణ విలువలు బాగానే ఉన్నా...రైటింగ్ విషయంలో సినిమా దారుణంగా ఫెయిలైంది. అప్పటికీ విక్రమార్కుడు, లెజండ్, రేసుగుర్రం, గబ్బర్ సింగ్, శివమణి, స్టాలిన్, సింహాద్రి చిత్రాల నుంచి సీన్స్ తీసుకుని స్ఫూఫ్ చేసారు. కానీ వాటిని సరిగ్గా పేర్చటంలో విఫలమయ్యారు. ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీద చేసిన స్ఫూఫ్ దారుణంగా ఉంది.


సినిమాలో ఏకైన ప్లస్ డైమండ్ రత్నబాబు డైలాగులు అనే చెప్పాలి. అంత వీక్ స్క్రిప్టుని కూడా ఆ మాత్రమైనా చూడగలిగేలా చేయగలిగాడంటే డైలాగులే కాపాడాయి. ఆ డైలాగులే ఓపినింగ్స్ సైతం తెచ్చిపెట్టాయి. ఇదంతా రత్నబాబు క్రెడిటే. ఇక మరో హైలెట్ ముత్యాల సతీష్ సినిమాటోగ్రఫీ. ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేసి మెప్పించారు. స్ఫూఫ్ ఫైట్స్ ఓకే అన్నట్లు ఉన్నాయి.


Sampoornesh Babu's Singam 123 review

ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు తనకు వచ్చిన రెగ్యులర్ ఎక్సప్రెషన్ తోనే కాకుండా కొత్తవి కూడా ట్రై చేసి మెప్పించాడు. తన వరకూ తను బాగానే చేసాడు. ఫ్లాష్ బ్యా క్ లో వచ్చే ధర్టీన్ ఇయిర్స్ ఫృధ్వీ కూడా చాలా బాగా చేసాడు. దర్శకుడే మరింత శ్రద్ద పెడితే బాగుండును అనిపించింది.


ఫైనల్ గా...రెగ్యులర్ రొటీన్ మూస మసాల సినిమా నిర్మించకుండా ఏదో కొత్తదనం చూపాలనే నిర్మాత మంచు విష్ణు ఉద్దేశ్యాన్ని,సాహసాన్ని మెచ్చుకోవటం కోసం,ఎంకరేజ్ చేయటం కోసం ఈ సినిమా చూడాలి. సంపూర్ణేష్ బాబు సినిమాలు ఇలాగే ఉంటాయి అని ఫిక్సైతే సినిమా బాగుంటుందనిపిస్తుంది.


బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు:సంపూర్ణేష్‌ బాబు, సనమ్‌,అన్నపూర్ణ, వేణుగోపాలరావు, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల,
ఎడిటర్: యం.ఆర్.వర్మ,
మ్యూజిక్: శేషు,
డైలాగ్స్: డైమండ్ రత్నం,
ఆర్ట్: రఘు కులకర్ణి,
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: విష్ణు మంచు,
సమర్పణ డా.మోహన్ బాబు
దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.
విడుదల తేదీ: 05, జూన్, 2015.

English summary
Burning Star Sampoornesh Babu has created a sensation, even before the release of his first film “Hrudaya Kaleyam”, through the social media. Now, he is back with the film “Singham 123 ” released today with divide talk. “Singham 123” is a spoof action comedy directed by Akshat Ajay Sharma and presented by Dr Mohan Babu. Manchu Vishnu penned the story, screenplay and also produced the film on his production house 24 Frames Factory.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu