For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యాపీ జర్నీ (‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5
  --- సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఓ అబ్బాయి, అమ్మాయి... ట్రైన్ జర్నీ ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. అలాంటి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుని ఓ పాత పాయింట్ ని కొత్త గా చెప్పటానికి ప్రయత్నించాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. కొత్త దర్శకుడు అయినా పెద్దగా తడబడకుండా ఎంటర్టైన్మెంట్ ని పండించుకుంటూ సాధ్యమైనంత వేగంగా ఎక్స్ ప్రెస్ ని నడిపి సేఫ్ గా డెస్టినేషన్ ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసారు. సెకండాఫ్ లో సీన్స్ లెంగ్త్ ఎక్కువ అయ్యి..ట్రాక్ మారినా..ఓవరాల్ గా మొత్తానికి చేరవలిసిన స్టేషన్ కే వచ్చాడు.

  అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో సందీప్‌ (సందీప్‌ కిషన్‌) సగటు తెలుగు సినీ హీరోలా తన కళ్లెదురుగాఅన్యాయం జరుగుతూంటే సహించలేడు. అయినదానికీ,కానిదానికి ప్రతీ విషయంలో తలదూర్చే అతనంటే తండ్రి రామ్మూర్తి(నాగినీడు)కి నచ్చదు. ఆయన శిశుపాలుడిలా వంద తప్పుల వరకే పరిమితి ఇచ్చారు. ఆల్రెడీ సందీప్ తొంభై తొమ్మిది తప్పులు చేసేశాడు. మిగిలిన ఒక్క తప్పు చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో అతను తన సోదరుడు (బ్రహ్మాజీ) పెళ్లికి తిరుపతి కి సకుటుంబ సమేతంగా బయిలు దేరతాడు.

   Venkatadri Express

  ఆ ప్రయాణంలో అతనికి వందవ తప్పు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలోనే ప్రార్థన (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) పరిచయమవుతుంది. ఆమె చాలా ప్రాక్టికల్ ...లెక్కల మనిషి. ఇద్దరి గమ్యం ఒక్కటే. తిరుపతి వెళ్లాలి. కానీ కారణాలు వేరు. ఈ రైలు ప్రయాణం అతని జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? 100 వ తప్పు చేయకుండా తప్పించుకున్నాడా..ఏం తిప్పలు పడ్డాడు అనేదే ఈ చిత్ర కథ.

  దర్సకుడు కొత్త వాడైనా స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా మొదట్లోనే..హీరో 100 వ తప్పు చేస్తాడా..లేదా అన్న పాయింట్ తో హుక్ చేసి సినిమా చివరి వరకూ అదే పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ వేయటం కలిసి వచ్చింది. ఇక హీరోయిన్ పాత్ర మరీ రెగ్యులర్ గా కాకుండా చేయటంతో సీన్స్ బాగా వచ్చాయి. అయితే కొన్ని చోట్ల కామెడీ కోసం అనవసరంగా సీన్స్ క్రియేట్ చేయటంతో అవి పండక విసుగెత్తించాయి. అయితే దర్శకుడు ..నటీనటుల నుంచి సహజమైన నటన తీసుకోవటం కలిసి వచ్చింది. ఎంత కష్టపడినా హీరోయిన్ నుంచి మాత్రం ఎక్సప్రెషన్స్ రాబట్టలేకపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం సరిగా డీల్ చేయలేకపోయాడు. క్లైమాక్స్ సైతం తేలిపోయింది. ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు, ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ లో కొరవడింది.

  Venkatadri Express

  నటీనటుల్లో సందీప్ కిషన్ బాగా చేసాడు. హీరోయిన్ మొహంలో పెద్దగా ఎక్సప్రెషన్స్ పలకకపోవటంతో ఆమె కోసం డిజైన్ చేసిన క్యారక్టరైజేషన్ సైతం పలకలేదు. సప్త గిరి బాగా కామెడీ పండించారు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజి వంటి సీనియర్స్ షరా మూమూలే. రమణ గోగుల సంగీతం లో రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకికి పెద్ద ప్లస్ పాయింట్. ఎడిటింగ్ మరింత లా లాగ్స్ తగ్గించి కోత పెట్టాల్సింది. ఓ ఇరవై నిముషాల మేర సినిమాను ఎడిట్ చేసి మరింత షార్ప్ గా మారిస్తే బాగుండేది.

  ఫైనల్ గా ఈ చిత్రం దర్శకుడుకి మరో సినిమా తెప్పించే సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాసం ఉంది. మీడియం బడ్జెట్టు,టాక్ బాగుంది కాబట్టి కొనుక్కున్న వారికి నష్టం రాకపోవచ్చు. సందీప్ కిషన్ ఈ సినిమాతో మరింత అలవాట పడి...ఆగిపోయిన అతని మిగతా సినిమా రిలీజ్ అవుతాయి. టోటల్ గా అందిరిని ఈ ఎక్స్ ప్రెస్ సేఫ్ గా తీసుకువెళ్ళింది.

  Venkatadri Express

  సినిమా: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

  సంస్థ: ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌

  నటీనటులు: సందీప్‌కిషన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మాజీ, నాగినీడు, పృథ్వీ, తాగుబోతు రమేశ్, సప్తగిరి, కమల్, ప్రవీణ్, నిఖిల్, నర్సింగ్ యాదవ్, మీనా, సంధ్య తదితరులు.

  సంగీతం: రమణ గోగుల;

  పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్,

  కూర్పు: గౌతంరాజు,

  కళ: సాహి సురేశ్,

  నిర్మాత: కిరణ్‌;

  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.

  విడుదల: 29-11-2013 (శుక్రవారం)

  English summary
  Sundeep Kishan, Rakul Preet starrer Venkatadri Express released Today(November 29) with positive talk. Newcomer Merlapaka Gandhi has directed the film and Kiran has produced it under Anandi Art Creations banner. Ramana Gogula has composed the music for this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X