twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5
    Star Cast: హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, పూజితా పొన్నాడ
    Director: నిజార్ షఫీ

    హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించడం గమనార్హం. అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    7 మూవీ కథ

    7 మూవీ కథ

    కార్తీక్ (కోనేరు హవీష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అదే కంపెనీలో పనిచేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. కానీ ఓ రోజు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే విధంగా జెన్నీ (అనిషా అంబ్రోస్), ప్రియా (త్రిథా చౌదరీ) కూడా తమ భర్తలు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. ఆ క్రమంలో వరుస హత్యలు జరగడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తుంది. ఆ హత్యలు కార్తీక్ చేస్తున్నట్టు అంతా భావించి పోలీసులు వేటాడం మొదలుపెడుతారు. హత్యలన్నీ చేసేది కార్తీక్ కాదు కృష్ణమూర్తి అనే కథను మరో మలుపు తిప్పుతుంది.

    7 మూవీలో ట్విస్టులు

    7 మూవీలో ట్విస్టులు

    సెవెన్ కథలో కార్తీక్ ఎవరు? కల్యాణ్ ఎవరు? రెజీనా కసండ్రా (సరస్వతి) పాత్ర ఏమిటి? పూజిత పొన్నాడ (భాను), అదితి ఆర్య పాత్రలు కథను ఎలా మలుపు తిప్పాయి? ఇంతకు కృష్ణమూర్తి పాత్ర ఉందా? ఉంటే దాని విషయం ఏంటి? ఈ వరుస హత్యల వెనుక అసలు కారణం ఏమిటి. చివరకు పోలీస్ అధికారి (రెహమాన్) కేసును ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సెవెన్ సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సెవెన్ సినిమా హవీష్, నందిత శ్వేత, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్ లాంటి క్యారెక్టర్లతో పాజిటివ్ నోట్‌లో మొదలవుతుంది. కానీ సరిగా పండని సన్నివేశాలు, అనూహ్యమైన ట్విస్టులు కథను, ప్రేక్షకుడిని గందరగోళంలోకి నెట్టినట్టు అనిపిస్తుంది. జెన్నీ, ప్రియా క్యారెక్టర్లు కథలోకి ఎంటర్ కావడంతో ఏం జరుగుతుందనే విషయం ప్రేక్షకుడిని అర్థం కాకుండా ఉంటుంది. కృతిమంగా రూపొందించుకొన్న సన్నివేశాలతో ప్రేక్షకుడిని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఎలాంటి లాజిక్ లేకుండా హవీష్ ఎటాక్‌‌తో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఒక సెకండాఫ్‌లో రెజీనా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేంత వరకు తలా తోక లేకుండా సినిమా సాగదీసినట్టు ముందుకెళ్తుంది. 1980 ఫ్లాష్ బ్యాక్‌లో సరస్వతిగా రెజీనా రావడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక రెజీనా పాత్ర వృద్ధాప్యంలోకి వెళ్లగానే మళ్లీ సినిమా ఎప్పటిలానే మొదటికి వస్తుంది. పేలవమైన యాక్టింగ్ స్కిల్స్‌తో నటీనటులు తమ పాత్రలను పండించకపోవడంతో సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఉండే డ్రామా చాలా నాసిరకంగా ఉంటుంది. సరస్వతి పాత్రతో ఎమోషన్స్ పండించాల్సిన చోట సన్నివేశాలు కామెడీగా మారుతాయి.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    సెవెన్‌లో బలమైన కథ ఉన్నప్పటికీ.. దానిని ఓ పద్దతి ప్రకారం రాసుకోవడంలో దర్శకుడు నిజార్ షఫీ విఫలమైనట్టు కనిపిస్తుంది. దర్శకుడిగా నిజార్‌పై సినిమాటోగ్రాఫర్ డామినేట్ చేశాడా అనే ఫీలింగ్ కలుగకమానదు. సెకండాఫ్‌లో ఉండే బలమైన కథ కోసం జరిగే డ్రైవ్, ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో అది కూడా తేలిపోయనట్టు అనిపిస్తుంది. పాత్రల స్థాయికి నటీనటులు ఎంపిక చేసుకోకవడం సినిమాకు మరో మైనస్ పాయింట్‌గా మారింది. హీరోయిన్లకు సంబంధించిన క్యారెక్టర్లను లాజికల్ తీర్చిదిద్దడంలో తడబాబు కనిపిస్తుంది.

    హీరో హవీష్ గురించి

    హీరో హవీష్ గురించి

    ఇక హీరో హవీష్ లుక్, మేకోవర్ బాగుంది. కానీ ఇంటెన్స్, ఎమోషనల్ సీన్లలో తేలిపోయాడు. నటనపరంగా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉంది. కీలక సమయంలో ఎమోషన్స్ పడించడంలో విఫలమయ్యాడు. ఏడుగురు హీరోయిన్ల ముందు యాక్టింగ్ పరంగా వెనుకపడినట్టు కనిపిస్తుంది. యువ హీరోగా పుష్కలంగా భవిష్యత్ ఉంది కాబట్టి తదుపరి సినిమా కోసం యాక్టింగ్ పరంగా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ఏడుగురు హీరోయిన్ల గురించి

    ఏడుగురు హీరోయిన్ల గురించి

    ఇక ఏడుగురు హీరోయిన్లలో రెజీనా కసండ్రానే మిగితా హీరోయిన్లను డామినేట్ చేసింది. నెగిటివ్ షేడ్స్‌ పాత్రలో రెజీనా అదరగొట్టింది. ప్రేమ కోసం తహతహలాడే యువతిగా పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత నందిత శ్వేత కొంతలో కొంత తన పాత్రను రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. త్రిథా చౌదరీ అదితి, పూజితా పొన్నాడ పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమ వంతుగా తమ పాత్రలకు న్యాయం చేశారు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    మిగితా నటీనటుల్లో ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి కనిపించారు. అయితే వీరి పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. కొంతలో కొంత జోష్ రవి, సత్య పాత్రలు మెరుగ్గా ఉంటాయి. ఇక మిగితా వారంతా గుర్తింపు పొందని పాత్రలతోనే సరిపుచ్చుకొన్నారు. ముఖ్యంగా రెహమాన్ పోలీస్ అధికారిగా ఆకట్టుకొన్నారు. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    సాంకేతిక విభాగాల్లో దర్శకుడు నిజార్ షఫీ అందించిన సినిమాటోగ్రఫి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఎడిటింగ్, మ్యూజిక్ ఇతర సాంకేతిక విభాగాలు పనితీరు కేవలం యావరేజ్‌గానే అనిపిస్తాయి. రమేష్ వర్మ అందించిన కథ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సెవెన్ మర్డర్ మిస్టరీతో సాగే ఓ సస్పెన్స్ థ్రిల్లర్. కథలో బలమున్నప్పటికీ.. కథనం బలహీన పడటం ఈ సినిమాకు ప్రధాన లోపం. లెక్కకు మంచి పాత్రలు ఉన్నప్పటికీ. వాటికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ సరిగా లేకపోవడం మరో మైనస్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సెవెన్ నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చితే సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని అందిస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    స్టోరిలైన్
    సినిమాటోగ్రఫి
    సెకండాఫ్‌లో ట్విస్టులు

    మైనస్ పాయింట్స్
    స్క్రీన్ ప్లే
    నటీనటుల ఫెర్ఫార్మెన్స్
    లాజికల్‌గా లేకపోవడం

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి తదితరులు
    సాంకేతిక వర్గం: డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ,
    వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్,
    చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై,
    కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్),
    ఆర్ట్ డైరెక్టర్: గాంధీ,
    లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్
    కొరియోగ్రఫీ: సతీష్, విజయ్,
    డైలాగ్స్: జీఆర్ మహర్షి,
    స్టంట్స్: వెంకట్ మహేష్,
    ఎడిటర్: ప్రవీణ్ కెఎల్,
    మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్,
    కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్),
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ,
    స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ,
    సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.

    English summary
    Seven movie shoot completed recently. Starring Havish as the hero, the romantic thriller is directed by Nizar Shafi. Ramesh Varma is producing it on Kiran Studios. This Telugu-Tamil film also features Regina Cassandra, Nandita Sweta, Anisha Ambrose, Aditi Arya, Pujitha Ponnada and Tridha Choudhary in key roles. Rahman and Sunkara Lakshmi will be seen in other prominent roles. writer-producer Ramesh Varma said that This movie is with Six girls and Six love stories. This movie is hitting screens on June 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X