For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దుమ్మురేపిన షారుఖ్ (రా.వన్ రివ్యూ..)

  By Bojja Kumar
  |

  నటీనటులు : షారుఖ్ ఖాన్, కరీనా కపూర్, అర్మాన్ వర్మా, అర్జున్ రామ్ పాల్, షహనా గోస్వామి తదితరులు....
  బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్
  దర్శకత్వం : అనుభవ్ సిన్హా
  నిర్మాత : గౌరీ ఖాన్
  దట్స్ తెలుగు రేటింగ్ : 3.25/5


  దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొంది 100 కోట్లు దాటిన సినిమాల్లో రా.వన్ ఒకటి. దాదాపు రూ. 150 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. భారీ అంచనాలతో దీపావళి పండుగను పురస్కరించుకుని విడుదలైన ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సూపర్ హీరోగా నటించాగా, రెడ్డీస్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ షారుఖ్‌తో జోడీ కట్టింది. విశాల్ శేఖర్ సంగీతం అందించగా...తెలుగులో వనమాలి, భువన చంద్ర, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. కేవలం బాలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ లోనూ తన మార్కును చాటాలని దక్షిణాది భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు షారుఖ్.

  కథలోకి వెళితే...
  శేఖర్ సుబ్రహ్మణ్యం(షారుఖ్) వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ రూపొందించే వీడియో గేమ్స్ కు పెద్దగా ఆదరణ ఉండదు. అలాగే శేఖర్ తీర్చి దిద్దిన గేమ్స్ కూడా కొత్తగా లేవని అతని కొడుకు ప్రతీక్(అర్మాన్ వర్మా) బాధ పడుతూ ఉంటాడు. అంతే కాకుండా తనకు మంచి చేసే హీరో కంటే చెడు చేసే విలనే బాగా నచ్చుతాడని తండ్రికి చెబుతాడు. దాంతో ఆలోచనలో పడ్డ శేఖర్ కొడుకును ఆనంద పరచడానికి రా.వన్ అనే కొత్త గేమ్ ను కనిపెడతాడు. హీరో కంటే బలమైన విలన్ ను రూపొందిస్తాడు. అక్కడితో ఆగకుండా విలన్ అందులో స్వంతగా ఆలోచించే విధానాన్ని రూపొందిస్తాడు. రా.వన్ అనే గేమ్ నుంచి బయటకు వచ్చిన విలన్ వినాశనం మొదలు పెడుతుంది. దానిని ఎదురించడానికి శేఖర్ జీ.1ను రూపొందించి భౌతిక ప్రపంచంలోకి తీసుకువస్తాడు. ఆపై అతడు రా.వన్‌ను ఎలా ఆపగలిగాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే థియేటర్లో చూడాల్సిందే.

  విశ్లేషణ...
  ఇండియన్ సినిమా... ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల పరంగా ఈ సినిమా ఒక అద్భుతం. హాలీవుడ్ సినిమాల స్థాయిలో విజువల్ ఎఫెక్ట్ కూర్చి సినిమాను నయనానందంగా రూపొందించిన షారుఖ్ అతని టీమ్ ను అభినందించాలి. సినిమాను మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించేందుకు కథను ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా మలిచారు. సినిమా మొదటి సంగం చకచక జరిగిపోయినట్లుంది. రెండో సగం ఇంకాస్త బాగా చేస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా పిల్లలను ఎక్కువగా నచ్చుతుంది.

  దేవుడంటే భక్తి కలిగిన అమాయకమైన తమిళియన్ గా, జీ.1 వన్‌గా రెండు అమాయకమైన పాత్రలను అద్భుతంగా చేశాడు. కరీనా తన అందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ ఆకట్టుకున్నాడు. బాల నటుడు అర్మాన్ మంచి పెర్పార్మెన్స్ ఇచ్చారు.

  విశాల్ శేఖర్ అందించిన సంగీతం ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. వనమాలి, భువన చంద్ర, సుద్దాల పాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చమ్మకు చల్లో, జవరాలా పాటలు కట్టి పడేసాయి. బ్యాగ్రౌండ్ స్కోరులో కొత్త దనం లోపించింది. సినిమాటో గ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ కొత్త అనుభూతిని కలిగించాయి. దేశం మొత్తం శబాష్ నిపించుకోవాలనే హీరో కావాలనే తన కోరికను కింగ్ ఖాన్ చివరకు నెరవేర్చుకున్నాడు.

  ఎంటర్ టైన్మెంట్ కావాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పిల్లలకు, పెద్దలు అనే తేడాల లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంది.

  English summary
  Shahrukh Khan’s highly anticipated movie Ra.One, The movie is completely made in Indian (Desi) style, made on par with Hollywood standards. The King is back. He reinvented himself yet again and it is clearly evident that his dream has now become reality for him. He is fantastic as both Shekhar who lacks the mettle with some stupidity, god-fearing south Indian and even to G.One. Kareena Kapoor looks stunning and makes you fall in love with her all over again. Arjun Rampal is outstanding but it’s the debutant boy Armaan who actually steals the show. The movie belongs to him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X