twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులను ఆనందపరిచే శంకర్‌దాదా

    By Staff
    |

    Shankar Dada MBBS
    చిత్రం: శంకర్‌దాదా ఎంబిబిఎస్‌
    నటీనటులు: చిరంజీవి, శ్రీకాంత్‌, సోనాలిబెంద్రె, అంజలా జవేరి,
    పరేష్‌రావెల్‌, గిరీష్‌ కర్నాడ్‌, వెన్నెరాడై నిర్మల,
    సూర్య, వేణుమాధవ్‌, నర్సింగ్‌ యాదవ్‌
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    దర్శకత్వం: జయంత్‌ సి పరాన్జి
    నిర్మాత: జెమిని ఫిల్మ్‌ సర్క్యూట్‌

    హిందీలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన మునాబాయ్‌ ఎంబిబిఎస్‌ తెలుగు రీమేక్‌ 'శంకర్‌ దాదా, ఎంబిబిఎస్‌' హిట్‌ చిత్రానికి ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. హిందీ సంస్కృతి ఉండే కథలు దక్షిణాదిలో ఆడవన్న అభిప్రాయాన్ని ఈ సినిమా పటాపంచలు చేయగలదు. కథలో గ్రిప్‌, కామెడీ, ఆ్రర్ధత సినిమాలోని పెద్ద ప్లస్‌ పాయింట్స్‌.

    శంకర్‌ (చిరంజీవి) ఒక దాదా. అతని ముఠా దాదాగిరి, పంచాయితీలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. ఊళ్ళో ఉండే తలిదండ్రుల (గిరీష్‌, వెన్నిరాడై నిర్మల)కు ఈ విషయం తెలియదు. నగరంలో తమ కొడుకు పెద్ద డాక్టరని వారు అనుకుంటారు. తలిదండ్రులు తనను తన హాస్పిటల్‌ను చూడడానికి వస్తున్నారన్న వార్త అందుకున్న శంకర్‌ సడన్‌గా డాక్టర్‌ వేషం వేసుకుంటాడు. సత్యప్రసాద్‌ హాస్పిటల్‌ అని బోర్డు తగిలించుకుని అతని గ్యాంగ్‌ అంతా డాక్టర్లుగా కాంపౌండర్లుగా మారుతారు. శంకర్‌ తండ్రికి ఒక చిన్న నాటి స్నేహితుడు (పరేష్‌ రావల్‌) నగరంలో పెద్ద డాక్టరు. ఒక మెడికల్‌ కాలేజికి డీన్‌గా ఉంటాడు. జూనియర్‌ డాక్టరైన అతని కూతురుతో శంకర్‌కు పెళ్ళి చేయాలని శంకర్‌ తండ్రి ఉద్దేశం. సంబంధానికి పరేష్‌ మొదట అంగీకరించినా శంకర్‌ డాక్టర్‌ కాదని, గూండా అని తెలుసుకుని నిరాకరిస్తాడు. శంకర్‌ తలిదండ్రులను అవమానించి పంపుతాడు.

    తలిదండ్రులు అంత బాధపడుతూ ఊరుకు తిరిగెళ్ళడం శంకర్‌కు బాగా మధనపడతాడు. పెద్దగా ఏడుస్తాడు. ఆ తర్వాత అతను ఎలాగైనా మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరం కోర్సులో చేరాలనుకుంటాడు. అతని గ్యాంగ్‌ సహకారంతో కొన్ని అక్రమాలు చేసి, తప్పుడు సర్టిఫికెట్లు పుట్టించి శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌లో చేరుతాడు. పదిహేడు, పద్దెనిమిదేళ్ళ విద్యార్ధుల మధ్య ముదురు విద్యార్ధి శంకర్‌దాదా కూర్చోడం ఆడ్‌గానే ఉన్నా కథ ఆసక్తిరంగా సాగుతుంది. కామెడీ రక్తి కట్టింది. శంకర్‌ నకిలీ మెడికో అయినా ఆస్పత్రి సిబ్బందికి ఆత్మబంధువు అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే.

    ఆద్యంతం ఒక ఫ్లోగా సాగిపోవడం సినిమా ప్రత్యేకత. హిందీ సినిమాకు తెలుగులో చేసిన కొన్ని మార్పులు చేర్పులు బాగున్నాయి. అయినా చిరంజీవి నుంచి గొప్ప యాక్షన్‌ను, సందేశాన్ని ఆశించేవారికి ఇది మామూలు సినిమాగా అన్పిస్తుంది. ఇటువంటి కథలు మనకు కొత్త కావడం దానికి కారణం. ఉదయం ఆరుగంటలకే సినిమా ప్రారంభం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా థియేటర్ల వద్ద తెలతెలవారక ముందే పండుగ వాతారణం నెలకొంది.

    దట్స్‌తెలుగు డాట్‌కాం రిమార్క్స్‌:
    సహజంగానే చిరంజీవి నటన సినిమాకు పెద్ద అసెట్‌. ఆయన డ్యాన్సుల్లో ఆయన ముద్రకు కొంత కొత్తదనం కలవడం ప్రేక్షకులను ఆనందపరుస్తుంది. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. చిరంజీవి స్నేహితుడిగా శ్రీకాంత్‌ నటనలో ఈజ్‌ కన్పించింది. హిందీలో ఫైట్స్‌ లేకపోయినా తెలుగులో రెండు స్వల్ప ఫైట్స్‌ యాడ్‌ చేశారు. నకిలీ మెడికో అయినా పేషెంట్లను మానవత్వంతో చూసి చిరంజీవి ఓదార్పుతో వారిని దగ్గర చేసుకుని, ఆనంద పెట్టే సన్నివేశాలు బాగా పండాయి. ఈ ఆ్రర్ధత సినిమా విజయవంతం కావడానికి యాడ్‌ అయ్యే అంశాల్లో ప్రధానమైనది. ఎక్కడో ఒక్కోచోట ఉద్వేగభరిత సన్నివేశాలు ఉండడం దక్షిణాది సినిమాల ప్రత్యేకత . ఈ సినిమా అలా కాకుండా ఆరోగ్యవంతుడు ఇసిజి గ్రాఫ్‌లాగా నింపాదిగా ఒక ఆహ్లాదకరమైన సెలయేరులా సాగిపోతుంది. హిందీ ఒరిజినల్‌తో పోల్చితే దీనికి తక్కువ మార్కులే వస్తాయి. ఈ సినిమా ఏ రేంజి హిట్టో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. కలెక్షన్లలో 'ఇంద్ర' పోల్చుకునే అవకాశం ఉండకపోవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X