Just In
- 3 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 4 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 6 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కలిసుందాంరా!...మళ్లీ ఈ సంక్రాంతికి ( 'శతమానం భవతి' రివ్యూ)
ఈ విషయం ఎప్పుడో ఆరు నెలల ముందే దిల్ రాజు గమనించినట్లున్నారు. ఆ లోటుని తీర్చటానికి శతమానం భవతి అంటూ భాక్సాఫీస్ ని దీవిస్తూ ఓ సినిమాని రెడీ చేసి దింపేసారు. మరి ఆ సినిమా సంక్రాతి శోభను తీసుకు వచ్చిందా. నిజమైన మన జీవితాలని సృశించిందా...అసలు కథేంటి...ఈ రెండు సినిమాల మధ్యలో ఇది వర్కవుట్ అవుతుందా వంటి విషయాలను క్రింద రివ్యూలో చూద్దాం.
తూర్పు గోదావరి జిల్లా ...ఆత్రేయపురంలో రాఘవ రాజు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) ఒంటిరిగా జీవితాన్ని లీడ్ చేస్తూంటారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఆ పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో ఈ జంట ఒంటిరిదైపోయింది. గత జ్ఞాపకలాతో గడిపే ఈ పెద్ద వాళ్లిద్దరితో పాటు మనవడు రాజు (శర్వానంద్) కూడా కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయిన వారి పిల్లలు తమ జీవితాల్లో బిజీ అయ్యి... ఎప్పుడూ ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు.
అయితే తన పిల్లలంతా ఈ సంక్రాంతి పండుగకు అయినా వస్తే బాగుండును అని రాజుగారు భావిస్తారు. పిలిస్తే రారు అని తెలిసిన ఆయన అందుకోసం ఓ ప్లాన్ వేసి అమలు చేస్తారు. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యి... పిల్లలంతా కూడా విదేశాల నుండి తన ఊరుకి సంక్రాంతికి వస్తారు.
వారితో పాటు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజుగారి కూతురు ఇంద్రజ కుమార్తె, రాజు గారి మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) కూడా ఆత్రేయపురం వస్తుంది. మన హీరో రాజు, నిత్యాలు బావా మరదలు అవ్వడంతో ఇద్దరి మద్య ప్రేమ ఆటోమెటిక్ గా మొదలవుతుంది.
ఆ ఇంట్లో సంక్రాంతి సంబరాల్లో అందరూ మునిగి తేలుతుండగానే రాజుగారు వేసిన ప్లాన్ భార్య జానకమ్మకు తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. ఆ కుటుంబంలో పెద్ద కలతలు చెలరేగుతాయి. అసలు రాజు గారు వేసిన ప్లాన్ ఏంటి ? ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకున్నాడు ? చివరకు రాజు-నిత్యల ప్రేమ కథ ఏమైంది ? అన్నది తెలియాలంటే ..ఈ సినిమా చూసి తెలుసుకోండి.
నిజ జీవితంలో కనుమరుగైపోతున్న అనుబంధాలను, ఆత్మీయతలను తెరపై చూసి ఆనందించాలనే ఆంకాంక్షకు ఇవి ప్రాణం పోస్తాయి. నిజానికి ఇలాంటి కథలు తెలుగు సినిమాకు కొత్తేం కాదు. అయితే ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. ట్విస్ట్ లు, కథలో కలవని కమర్షియల్ ఎలిమెంట్స్ లు వంటి అనవసరమైన ప్రయాసలు పెట్టుకోకుండా ట్రీట్ మెంట్ ని నడిపారు. ముఖ్యంగా గ్రామీణ నేపధ్యాన్ని చూపిన తీరు బాగుంది.
అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత వేగం, ఉత్సాహం సెకండాఫ్ లో లేవనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు చూసిన వాళ్లకు ఇది వాటి సీక్వెల్ ఏమో అని డౌట్ వచ్చేలా సీన్స్ వస్తూంటాయి. దానికి తోడు ఈ మూడింటిలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించటం జరిగింది. అయితే ఇలాంటి సినిమాలు ఇలాగే ఉంటాయి...ఈ కాలంలో ఆ పాత్రకు ప్రాణం పోసేది ప్రకాష్ రాజ్ అనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం.
అలాగే సినిమాలో చాలా చోట్ల కామెడీ పేలలేదు. దర్శక,రచయిత వేగేశ్న సతీష్ కు కామెడీ మీద మంచి గ్రిప్ ఉందనే విషయం చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. కానీ కావాలని ఇరికించిన కామెడీ సీన్స్ కలిసిరాలేదు. అయినా అంత స్లోగా కథ నడపటం బోర్ కు కూడా దారి తీసింది. అలాగే చాలా చోట్ల సందేశాలు,స్పీచ్ లు చెప్పే కార్యక్రమం పెట్టుకోవటం కూడా నచ్చని అంశం.
సినిమా ప్లస్ ల విషయానకి వస్తే... సకుటుంబ సమేతంగా వెళ్లే క్లీన్ సినిమాగా దీన్ని డిజైన్ చేసారు దర్శక,నిర్మాతలు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అద్బుతంగా ఉంది. కుటుంబ విలువల గురించి చెప్పిన విధానం సినిమాకు కీలకమై నిలిచింది. శర్వానంద్ ఫెరఫెక్ట్ ఏప్ట్ గా ఉన్నారు తన పాత్రకు. అలాగే అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో జీవించిందనే చెప్పాలి. ప్రకాష్ రాజ్, జయసుధలు ఎప్పిటిలాగే తమదైన శైలిలో నిజ జీవిత పాత్రలా అన్నట్లు చేసారు.
ఇది పూర్తిగా రైటర్ సినిమా. ఫీల్ గుడ్ మామెంట్స్ తో కథను అలవోకగా నడిపేసారు. పాటలు, వాటిని చిత్రీకరించిన విధానం సినిమాకు ప్లస్ అయ్యాయి. తన బాబాయ్, ఆయన ముప్పై ఏళ్ల క్రిందటి క్రష్ కు మధ్య హీరో ఏర్పాటు చేసే మీటింగ్ వంటి సన్నివేశాలు కలిసొచ్చాయి.
అలాగే ఊళ్లో ఉన్న అన్ని టీవి, సెలఫోన్ కనెక్షన్స్ ఆగినప్పుడు సీన్ బాగుంది. ఇక మహేష్,పవన్, ఎన్టీఆర్ విజువల్స్ తో కూడిన డంబాష్ గేమ్ కూడా బాగుంది.'అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తే పడరు. వాళ్లు ఇంప్రెస్ అయితే పడతారు' 'మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే బాగుంటుంది కానీ, మన బాధను పంచి వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు' 'ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు' అంటూ శర్వానంద్ పలికిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
ఎన్నారైలను టార్గెట్ చేస్తూ తీసినట్లున్న ఈ చిత్రం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోని యువత కి ఏ స్దాయిలో నచ్చుతుంది అనే విషయమై విజయం స్దాయి ఆధారపడి ఉంటుంది.
--------------
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ
ఎడిటింగ్ - మధు ,
సినిమాటోగ్రఫి - సమీర్ రెడ్డి,
సంగీతం - మిక్కీ జె మేయర్,
కథ - దర్శకత్వం - మాటలు - స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న ,
నిర్మాతలు : రాజు , శిరీష్
రిలీజ్ డేట్: 14 జనవరి, 2017