For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shershaah movie review: రోమాలు నిక్కబొడిచేలా సిద్దార్థ్ మల్హోత్రా పెర్ఫార్మెన్స్..

  |

  Rating:
  3.5/5
  Star Cast: సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, శివ్ పండిట్, జావేద్ జాఫ్రీ, నిక్తిన్ ధీర్
  Director: విష్ణు వర్దన్

  కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు దేశం కోసం ప్రాణాలర్పించారు. అందులో పాక్ సేనలను మట్టుపెట్టే క్రమంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా షేర్షా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్‌తో పంజా చిత్రాన్ని తెరకెక్కించిన విష్ణువర్ధన్ డైరెక్ట్ చేశాడు. కరణ్ జోహర్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు. విక్రమ్ బాత్రా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ఎలాంటి త్యాగం చేశాడనే విషయాన్ని షేర్షా చిత్రంలో చూపించారు. విక్రమ్ బాత్రా షేర్షాగా ఎందుకు మారాడు? యువతకు దేశభక్తి స్పూర్తిని ఎలా పెంపొందించారనే విషయాన్ని తెలుసుకోవాలంటే షేర్షా సినిమాను సమీక్షించాల్సిందే.

  షేర్షా మూవీ కథ..

  షేర్షా మూవీ కథ..

  హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్ జిల్లాలో పుట్టిన విక్రమ్ బాత్రా (సిద్దార్థ్ మల్హోత్రా) చిన్నతనం నుంచే అనుకొన్నది సాధించాలనే పట్టుదల ఉన్న యువకుడు. దేశం కోసం అమరులైన జవాన్లను స్పూర్తిగా తీసుకొని సైన్యంలో చేరాలని కలలు కంటాడు. తన గ్రామంలోని డింపుల్ (కియారా అద్వానీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. ఆ క్రమంలో సైన్యంలో చేరిన కొద్ది రోజుల్లోనే కార్గిల్ వార్ రావడంతో యుద్ధంలో పాల్గొని సముద్ర తీరానికి 19962 అడుగుల ఎత్తులోని పాయింట్ 5140 ప్రాంతాన్ని పాక్ సైన్యం నుంచి అక్రమిస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదా నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ పొందుతాడు. ఆ తర్వాత పాయింట్ 4875 ప్రాంతాన్ని పాక్ చెర నుంచి విముక్తి కలిగించేందుకు యుద్ధ రంగంలో విక్రమ్ బాత్రా దూకుతాడు.

  షేర్షాలో ట్విస్టులు..

  షేర్షాలో ట్విస్టులు..

  అయితే పాయింట్ 4875 ప్రాంతానికి విముక్తి కలిగించేందుకు విక్రమ్ బాత్రా ఎలాంటి ప్రతికూలతలను ఎదురించాడు? ఆ ప్రాంతాన్ని తన సైనిక బృందంతో కలిసి భారత్‌కు ఎలా అప్పగించాడు? డింపుల్‌ను విక్రమ్ బాత్రా పెళ్లి చేసుకొన్నాడా? పాయింట్ 4875 వద్ద జరిగిన యుద్ధంలో విక్రమ్ ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానమే షేర్షా సినిమా కథ.

  తొలి భాగం ఎమోషనల్, ఫీల్ గుడ్‌గా

  తొలి భాగం ఎమోషనల్, ఫీల్ గుడ్‌గా

  షేర్షా సినిమా విషయానికి వస్తే.. తొలి సీన్ నుంచి చివరి సన్నివేశం వరకు ఉద్వేగంగా, ఉత్తేజంగా సాగుతుంది. ప్రతీ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ వెంటాడుతుంది. పాక్ ముష్కరులపై విక్రమ్ బాత్రా తెగింపు తెరమీద చేస్తే దేశభక్తి స్పూర్తిస్తుంది. తొలి భాగంలో వార్ యాక్షన్ ఎపిసోడ్స్‌ ఊపిరి బిగపట్టేలా చేస్తే డింపుల్‌తో లవ్ సీన్లు, రొమాంటిక్ మూమెంట్స్ ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. యాక్షన్, ఫీల్‌గుడ్ అంశాలను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు విష్ణువర్ధన్ తన ప్రతిభను చాటుకొన్నాడు.

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  ఇక సెకండాఫ్‌లో మొత్తం కార్గిల్ వార్ సీన్లు హైలెట్‌గా మారాయని చెప్పవచ్చు. పాయింట్ 4875 జరిగే యుద్ధ పోరాటాలు కళ్లకట్టినట్టుగా ఉండటంతో ప్రతీ ఒక్కరు ఉద్వేగానికి గురవుతారు. చివరి 15 నిమిషాలు గుండెను పిండేసే విధంగా ఉంటుంది. దేశం కోసం విక్రమ్ బాత్రా చేసిన పోరాటాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. కార్గిల్ యుద్దాన్ని ఊహకు అందని విధంగా తెరకెక్కించారని చెప్పవచ్చు.

  పంజా దర్శకుడేనా అనే అనుమానం..

  పంజా దర్శకుడేనా అనే అనుమానం..

  కెప్టెన్ విక్రమ్ బాత్రా నిజ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం చేస్తే దర్శకుడు విష్ణువర్ధన్‌ను అభినందించకుండా ఉండలేనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా ఎమోషనల్‌గా ఉండేలా డిజైన్ చేశాడు. లోకేషన్ల ఎంపిక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. వాస్తవ పాత్రలకు నటీనటుల ఎంపికే ఈ సినిమాను సక్సెస్ బాటపట్టించిందని చెప్పవచ్చు. షేర్షా సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోవడం ఖాయం.

  సిద్ధార్థ్ మల్హోత్రా పరకాయ ప్రవేశం చేశాడా?

  సిద్ధార్థ్ మల్హోత్రా పరకాయ ప్రవేశం చేశాడా?

  ఇక షేర్షా సినిమాలో విక్రమ్ బాత్రాగా సిద్ధార్థ్ మల్హోత్రా పరకాయ ప్రవేశం చేశాడని చెప్పవచ్చు. ఆహార్యం, సైనికుల బాడీ లాంగ్వేజ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకొన్నాడు. విక్రమ్ బాత్రాగా కెరీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. బాధ్యతయుతమైన కొడుకుగా, ప్రేమికుడిగా, పౌరుడిగా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఆ పాత్రలో సైనికుడు తప్ప సిద్ధార్థ్ మల్హోత్రా ఎక్కడా కనిపించడంంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  కియారా అద్వానీ ఎలా చేసిందంటే..

  కియారా అద్వానీ ఎలా చేసిందంటే..

  ఇక కియారా అద్వానీ పాత్ర విషయానికి వస్తే పెద్దగా స్కోప్ లేని పాత్ర. కొన్ని సీన్లలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఫెర్ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. కాకపోతే క్లైమాక్స్‌లో సానుభూతి కలుగుతుంది. ఇక మిగితా పాత్రల్లో ప్రతీ ఒక్కరు జీవించారని చెప్పవచ్చు.

  టెక్నికల్ టీమ్ ఫెర్ఫార్మెన్స్ ది బెస్ట్

  టెక్నికల్ టీమ్ ఫెర్ఫార్మెన్స్ ది బెస్ట్


  ఇక సాంకేతి విభాగాల పనితీరుకు వస్తే.. కమల్జిత్ నేగి సినిమాటోగ్రఫి అద్బుతం. పర్వతశ్రేణుల్లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఈ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. వార్ సీక్వెన్స్ అంతర్జాతీయ స్థాయిలో చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయంలో శ్రీకర్ ప్రసాద్ తన అనుభవాన్ని అంతా జోడించి సినిమాలో సన్నివేశాలను అద్బుతంగా పేర్చుకొంటూ పోయాడనిపిస్తుంది. జాన్ స్టీవార్ట్ ఎడూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సన్నివేశాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పాటలు కూడా సన్నివేశాలు, కథకు తగినట్టుగా ఉండటంతో తెరపైన ఎమోషనల్‌గా అనిపిస్తాయి.

  అద్భుతంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్

  అద్భుతంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్


  షేర్షా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా మెయింటెన్ చేశారు. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల స్థాయికి తగినట్టు ఉన్నాయి. నిర్మాణం విషయంలో కరణ్ జోహర్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాంశు గాంధీ తమ అభిరుచిని తెలియచెప్పారు. నటీనటుల, సాంకేతి నిపుణుల ఎంపిక బాగుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  దేశభక్తి, భావోద్వేగం, లవ్, రొమాంటిక్ అంశాలను కలబోసిన షేర్సా చిత్రం అనుక్షణం ఉద్వేగానికి గురిచేస్తుంది. తొలి భాగంలో కొంత స్లోగా ఉన్నప్పటికీ.. కథ డిమాండ్ మేరకు ఫర్యాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు, సెకండాఫ్‌లో సినిమాలోని సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమాగా షేర్షా రూపొందింది. డొంట్ మిస్.. ఈ వారాంతంలో ఓ అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. అయితే ముమ్మాటికి ఇది ఓటీటీ సినిమా కాదు.. థియేటర్‌లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావడమే కాదు.. దుర్గా మాతా కీ జై అంటూ నినాదాలు పిక్కటిల్లేవి. అద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకుల మిస్ గ్యారెంటీగా మిస్ అవుతారని చెప్పవచ్చు.

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, శివ్ పండిట్, జావేద్ జాఫ్రీ, నిక్తిన్ ధీర్ తదితరులు
  దర్శకత్వం: విష్ణు వర్దన్
  రచన: సందీప్ శ్రీవాస్తవ
  నిర్మాతలు: కరణ్ జోహర్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాంశు గాంధీ
  సినిమాటోగ్రఫి: కమల్జిత్ నేగి
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  మ్యూజిక్: జాన్ స్టీవార్ట్ ఎడురీ (బీజీఎం) తాన్షిక్ బాగ్చి, బీ ప్రాక్, జానీ, జస్లీన్ రాయల్, జావెద్ మోహసిన్, విక్రమ్ మాంత్రోసే
  బ్యానర్స్: ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్: 2021-08-12

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku

  English summary
  Karan Johar's Shershaah movie hit the OTT screen on August 12th. Kiara Advani, Sidharth Malhotra are lead pair, Directed by Panja Fame Vishnuvardhan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X