twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణవీర్ సింగ్ ‘సింబా’ మూవీ రివ్యూ, రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్, సోనూ సూద్
    Director: రోహిత్ శెట్టి

    ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరరెక్కిన 'టెంపర్' చిత్రం తెలుగునాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌‌లో 'సింబా' పేరుతో రీమేక్ చేశారు. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.

    హిందీలో కమర్షియల్, మాస్ ఎంటర్టెనర్స్ తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది అందవేసిన చేయి. ఇంతకు ముందు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన పవర్ ఫుల్ పోలీస్ డ్రామాలు సింగం, సింగం రిటర్న్ లాంటివి భారీ విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'సింబా' పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించింది, 'టెంపర్' స్థాయిని రీచ్ అయిందా? అనే అంశాలను ఓసారి సమీక్షిద్దాం.

    కథ ఏమిటంటే...

    కథ ఏమిటంటే...

    సంగ్రామ్ బాలేరావు అలియాస్ సింబా (రణవీర్ సింగ్) అనాధ. పోలీస్ అయితే బాగా డబ్బు సంపాదించొచ్చు అని చిన్నతనంలోనే డిసైడైన సింబా అనుకున్నది సాధిస్తాడు. ఏసీపీగా పోస్టింగులో చేరినప్పటి నుంచే నేరస్తులతో లాలూచీ పడి అందిన కాడికి వెనకేసుకుంటాడు. గోవాలో బాగా డబ్బులు సంపాదించే ఏరియాకు టాన్ఫర్ చేయించుకున్న సింబా గోవాలో అతిపెద్ద క్రిమినల్ దుర్వా రనడె(సోనూ సూద్) మీద ఫోకస్ పెట్టి అతడు చేస్తున్న డ్రగ్స్, ఇల్లీగల్ దందాలకు ధోకా ఇచ్చినట్లే ఇచ్చి లాలూచీ పడతాడు. ఇలా చేయడం ద్వారా అతడి వద్ద నుంచి ఆఫీసర్ల కంటే ఎక్కువ డబ్బులు గుంజుతాడు.

    సాంబాలో మార్పుకు కారణం

    సాంబాలో మార్పుకు కారణం

    సింబా పని చేస్తున్న స్టేషన్లో ఇతర పోలీసులు అతడితో చేతులు కలిపి అవినీతి సొమ్మును వారూ పంచుకుంటుండగా, హెడ్ కానిస్టేబుల్ నిత్యానంద్ మొయిలే (అశుతోష్ రానా) మాత్రం అవినీతి సొమ్మును అస్సలు ముట్టుకోడు. సింబాకు సెల్యూట్ కొట్టడానికి కూడా ఇష్టపడడు. ఈ స్టేషన్ నుంచి వెళ్లే లోపు అతడితో ఎలాగైన సెల్యూట్ కొట్టించుకోవాలనుకున్న సింబా కోరిక తీరిందా? అవినీతికి అలవాటు పడి క్రిమినల్స్‌తో చేతులు కలిపిన అతడితో మార్పుకు కారణం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

    క్రికెటర్ అవ్వాలనుకున్న రణవీర్ సింగ్... ఆ కల ఎలా చెదిరిందంటే?క్రికెటర్ అవ్వాలనుకున్న రణవీర్ సింగ్... ఆ కల ఎలా చెదిరిందంటే?

     పెర్పార్మెన్స్ పరంగా చూస్తే....

    పెర్పార్మెన్స్ పరంగా చూస్తే....

    సంగ్రామ్ బాలేరావు అలియాస్ సింబా పాత్రలో రణవీర్ సింగ్ మెప్పించాడు. సందర్భానికి తగిన విధంగా తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సారా అలీ ఖాన్ పరిమిత పాత్రలో కనిపించింది. అయితే ఉన్నంతలో క్యూట్‌గా కనిపించడంతో పాటు నటన పరంగా మెప్పించింది.

    ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    డబ్బు కట్టకపోతే కూతురు చదువు ఆగిపోతుందని తెలిసినా అవినీతి మార్గంలో డబ్బు సంపాదించడం ఇష్టపడని నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశుతోష్ రానా నటన ఆకట్టుకుంటుంది. గ్యాంగ్‌స్టర్ దుర్వా రనడేగా సోనూ సూద్ పాత్ర ఓకే. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశాడు.

     సింగం ఎంట్రీ హైలెట్

    సింగం ఎంట్రీ హైలెట్

    దుర్వా రనడే చేతిలో బందీగా ఉన్న సింబాను కాపాడటానికి స్పెషల్ ఆఫీసర్ బాజీరావు సింగం పాత్రలో అజయ్ దేవగన్ అతిథి ఎంట్రీ ఇవ్వడం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సినిమా చివర్లో అక్షయ్ కుమార్ ఎంట్రీ సైతం సినీ ప్రేమికులకు మెప్పిస్తుంది.

    సాంగ్ అదిరిపోయింది

    సాంగ్ అదిరిపోయింది

    1996లో వచ్చిన 'తేరె మేరె సప్నే' సినిమాలోని 'ఆంఖ్ మేరే' పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. అప్పట్లో ఈ పాట అర్షద్ వర్షి, సిమ్రాన్ భాగ్ మీద చిత్రీకరించగా సూపర్ హిట్ అయింది. ‘సింబా'లోని అన్ని పాటల్లోకెల్లా ఆంఖ్ మేరే' సాంగ్ హైలెట్‌గా నిలిచింది.

     టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు. తనిష్క బగ్చి అందించిన పాటలు, అమర్ మెయిలే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. జోమన్ టీ నా జాన్ సినిమాటోగ్రఫీ, బంటీ నాగి ఎడిటింగ్ బావుంది. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

     ఫస్టాఫ్ ఎలా ఉంది...

    ఫస్టాఫ్ ఎలా ఉంది...

    సినిమా ఫస్టాఫ్ అంతా రణవీర్ సింగ్ ఫన్నీ పెర్ఫార్మెన్స్, సారా అలీ ఖాన్‌తో మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలతో వినోదాత్మకంగా సాంగింది. కమెడియన్ల అవసరం లేకుండా చాలా చోట్ల తన డైలాగ్ డెలివరీ స్టైల్‌తో నవ్వులు పూయించాడు రణవీర్.

    సెకండాఫ్ ఎలా ఉంది...

    సెకండాఫ్ ఎలా ఉంది...

    ఫస్టాఫ్‌కు భిన్నంగా సెకండాఫ్‌ను కాస్త సీరియస్‌గా నడిపించాడు దర్శకుడు. అవినీతి పోలీస్‌గా ఉన్న సింబాలో మార్పు ఎలా వచ్చింది, దుర్వా రనడె తమ్ముళ్లను అరెస్టు చేసిన తర్వాత వచ్చే కోర్టు సన్నివేశాలతో సినిమా ఆసక్తిగా సాగుతుంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    • రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్
    • రణవీర్ సింగ్, అశుతోష్ రానా, సోనూ సూద్ మధ్య వచ్చే సీన్లు
    • మైనస్ పాయింట్స్

      • లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
      • సినిమా క్లైమాక్స్ ఆసక్తికరంగా లేక పోవడం
      •  టెంపర్ సినిమా స్థాయిని అందకుందా?

        టెంపర్ సినిమా స్థాయిని అందకుందా?

        తెలుగు మూవీ ‘టెంపర్' సినిమాకు రీమేక్ ‘సింబా'. తెలుగు వెర్షన్‌తో పోలిస్తే కథలో మార్పులు చేశారు. తెలుగులో ఈ పాత్ర పోషించిన ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చూట్టూ టెంపర్ వైఫైలా ఉంటే... ‘సింబా'లో రణవీర్ పాత్రలో అసలు టెంపర్ కనిపించదు. ఈ పాత్రను కాస్త ఫన్నీగా డిజైన్ చేశారు. ‘టెంపర్' చూసిన తెలుగు వారికి ‘సింబా' చిత్రం పెద్దగా నచ్చక పోవచ్చు. అయితే హిందీ ప్రేక్షకులకు , రణవీర్ సింగ్ అభిమానులకు నచ్చే అవకాశం ఉంది.

         చివరగా...

        చివరగా...

        ‘సింబా' కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన వినోదాత్మక పోలీస్ డ్రామా. రణవీర్ సింగ్ అభిమానులకు, రోహిత్ శెట్టి సినిమాలు ఇష్టపడే వారిని మెప్పిస్తుంది.

    English summary
    Simmba Movie Telugu Review and rating. Each time you hear, 'Aala re aala Simmba aala' playing, your heart thumps in excitement with Ranveer's dashing gait. It wouldn't be wrong to say that he is the coolest addition to Rohit Shetty's cinematic universe of men in khaki.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X