For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్నేహమేరా జీవితం మూవీ రివ్యూ: ఆకట్టుకొన్న శివబాలాజీ

  By Rajababu
  |

  Rating:
  2.0/5
  Star Cast: శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య
  Director: మహేష్ ఉప్పుటూరి

  'స్నేహమేరా జీవితం' మూవీ రివ్యూ

  టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకొన్న నటుడు శివ బాలాజీ. ఇటీవల కాలంలో కాటమరాయుడు చిత్రంలో పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో విజేతగా నిలువడంతో మరింత క్రేజ్ వచ్చింది.

  బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత స్వీయ నిర్మాణ సారథ్యంలో స్నేహమేరా జీవితం సినిమాను తెరక్కెక్కించాడు. మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శివబాలాజీ‌తో రాజీవ్ కనకాల ఓ ముఖ్యపాత్రను పోషించారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల మదిలో విజేతగా నిలిచాడా అనే విషయాన్ని తెలుసుకునే ముందు కథ గురించి తెలుసుకొందాం.

  స్నేహమేరా జీవితం కథ

  స్నేహమేరా జీవితం కథ

  మోహన్ (శివబాలాజీ) ఓ అనాథ. చలపతి ( రాజీవ్ కనకాల) డబ్బుతో పొగరు ఉన్న యువకుడు. జీవితాల్లో చాలా విభేదాలు ఉన్నప్పటికి వాటన్నింటిని పక్కన పెట్టి మంచి స్నేహితులుగా సాగుతుంటారు. చలపతి టింబర్ డిపోలోనే మోహన్ పనిచేస్తుంటారు. అలా జీవితం గడిచిపోతున్న సమయంలో ఇందిర (సుష్మ) ప్రేమలో పడుతాడు. అయితే చలపతితో ఇందిర చూడకూడని పరిస్థితుల్లో కనిపిస్తుంది. దాంతో ఇందిరపై ప్రేమను తుంచేసుకొంటాడు. స్నేహితుడిపై కోపం పెంచుకొంటాడు. ఇదిలా ఉండగా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో పడుతాడు.

  అనేక ప్రశ్నలకు సమాధానం

  అనేక ప్రశ్నలకు సమాధానం

  తాను ప్రాణంగా ప్రేమించిన మోహన్ ప్రియురాలితో చలపతి అలా ఎందుకు ప్రవర్తించాడు. చలపతి నిజంగానే మోసం చేయాలనుకొన్నాడా? మోహన్ ఎలాంటి విషయాల్లో తలదూర్చాడు. చివరికి ఇందిరను మోహన్ పెళ్లి చేసుకొన్నాడా? చలపతి మోహన్ మధ్య స్నేహం మళ్లీ చిగురించిందా? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్నేహమేరా జీవితం.

  స్నేహమేరా జీవితం ఫస్టాఫ్

  స్నేహమేరా జీవితం ఫస్టాఫ్

  సుమారు 40 ఏళ్ల కిందటి కథ, పరిస్థితుల నేపథ్యంతో స్నేహమేరా జీవితం చిత్రం రూపొందింది. అప్పటి పరిస్థితులను దర్శకుడు మహేశ్ ఉప్పులూరి చక్కగా చిత్రీకరించాడు. తొలిభాగంలో శివబాలాజీ, రాజీవ్ కనకాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. కొన్ని మైనర్ లోపాలు తప్ప సినిమా అంత చక్కగా సాగిపోతుంటుంది. ఇంటర్వెల్‌లో చక్కటి బ్యాంగ్ నిచ్చి సెకాండఫ్‌పై ఆసక్తి రేపడంతో దర్శకుడు సఫలమయ్యాడు.

  సినిమా సెకండాఫ్

  సినిమా సెకండాఫ్

  రెండోభాగంలో కొంత కథ స్లోగా సాగినట్టు, రొటీన్‌గా ఉన్నట్టు కనిపించినా కథలో ఉండే ఫీల్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. శివబాలాజీ సినిమాను సొంతంగా తన భుజాలపైనే మోశాడనే చెప్పవచ్చు. రెండోభాగంలో కథా వేగం నెమ్మదించడం ఓ లోపం అని చెప్పవచ్చు.

  మహేశ్ డైరెక్షన్ గుడ్

  మహేశ్ డైరెక్షన్ గుడ్

  స్నేహమేరా జీవితం చిత్రంతో దర్శకుడు మహేశ్ ఉప్పుటూరి రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకొన్నాడు. స్క్రిప్ట్‌ విషయంలో మరికొంత జాగ్రత్త పడి ఉంటే ఆయన కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచేది.

  ఆకట్టుకునే శివబాలాజీ

  ఆకట్టుకునే శివబాలాజీ

  స్నేహమేరా జీవితం చిత్రంలోని మోహన్ పాత్ర శివబాలాజీకి చక్కగా సరిపోయింది. ఆయన తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. డిఫరెంట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. శివబాలాజీ నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొంటుంది.

  రాజీవ్ కనకాల కామెడీ టచ్

  రాజీవ్ కనకాల కామెడీ టచ్

  చలపతిగా రాజీవ్ కనకాలకు ఈ చిత్రంలో రంగేలి రాజా పాత్రను పోషించాడు. పాత్ర స్వభావం హాస్యంతో కూడుకొన్నదనైనా భావోద్వేగాన్ని పండించాడు రాజీవ్.

  సుష్మ నటన ఓకే

  సుష్మ నటన ఓకే

  సుష్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. సుష్మ పాత్రను కొంచెం పెంచినట్టయితే మరింత ఫీల్ ఉండేది. సుష్మకు ఈ సినిమా పెద్దగా పేరు తెచ్చిపెట్టేది కాదు.

  సునీల్ కశ్యప్ సంగీతం

  సునీల్ కశ్యప్ సంగీతం

  సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగున్నది. 80 దశకం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా అందించిన మ్యూజిక్ సూపర్. రెండు ఐటమ్ సాంగ్‌లు ప్రేక్షకులను అలరింపజేస్తాయి. జ్యోతిలక్ష్మీ, జయమాలిని పాటలను గుర్తు చేసేలా ఉన్నాయి.

  శివబాలాజీ నిర్మాణ విలువలు

  శివబాలాజీ నిర్మాణ విలువలు

  శివబాలాజీ నిర్మాణ విలువలు భేష్‌గా ఉన్నాయి. సినిమా మేకింగ్ చాలా రిచ్‌గా ఉంటుంది. 80వ దశకంలోని వాతావరణాన్ని మంచి క్వాలిటీతో తెరక్కించాడు శివబాలాజీ.

  పాజిటివ్ పాయింట్స్

  పాజిటివ్ పాయింట్స్

  శివబాలాజీ, రాజీవ్ నటన
  కథ
  టేకింగ్
  సినిమాటోగ్రఫీ
  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్
  స్లో నేరేషన్

  తెర ముందు.. తెర వెనుక

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు
  కథ, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి
  నిర్మాత: శివబాలాజీ
  సంగీతం: సునీల్ కశ్యప్
  సినిమాటోగ్రఫీ: భరణి ధరన్
  రిలీజ్ డేట్: నవంబర్ 17, 2017

  English summary
  Snehamera Jeevitham (as a title) more relevance is its 1982 setting. It was an opportunity that the director Mahesh Upputuri used to unleash great entertainment value with timely political, film and literary references in the Mandapeta Telugu dialect. Rajiv Kanakala and Siva Balaji starrer Snehamera Jeevitham, directed by debutant Mahesh Upputuri, has hit the screens on november 17th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X