For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Son Of India review: మోహన్ బాబు వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?

  |

  rating : 2.5/5

  చాలా కాలం తర్వాత మోహన్ బాబు లీడ్ రోల్ చేసిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నా తర్వాత సినిమా థియేటర్ లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన కారణంగా థియేటర్లలోకి తీసుకువచ్చారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు ఉందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

   సన్ ఆఫ్ ఇండియా కథ ఏమిటంటే?

  సన్ ఆఫ్ ఇండియా కథ ఏమిటంటే?

  కేంద్ర మంత్రి(శ్రీకాంత్), డాక్టర్ ప్రతిభా లాస్య, దేవాదయ చైర్మన్(రాజా రవీంద్ర) అనూహ్య పరిస్థితులలో కిడ్నాప్ కు గురవుతారు. కేంద్ర మంత్రిని కిడ్నాప్ చేసిన వ్యక్తి మరో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తేలడంతో కేంద్ర మంత్రి కిడ్నాప్ కేసును ఛేదించడం కోసం నియమించబడిన ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం ఆ కేసులను కూడా హ్యాండోవర్ చేసుకుంటుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ స్పెషల్ ఆఫీసర్ ఐరావతి(ప్రగ్యా జైస్వాల్) ఈ కిడ్నాపులు అన్నీ చేసింది తమ వద్ద టెంపరరీ డ్రైవర్ గా జాయిన్ అయిన బాబ్జి (మోహన్ బాబు) అని తెలుసుకుంటుంది. అలాగే అతని అసలు పేరు విరూపాక్ష అని కూడా తెలుసుకుంటుంది. చివరికి ఐరావతి తన టీంతో కలిసి కిడ్నాప్ అయిన ముగ్గురు సెలబ్రిటీలను కాపాడుతుందా? అసలు విరూపాక్ష వారందరినీ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వారి డ్నాప్ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ.

  సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ట్విస్ట్లు

  సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ట్విస్ట్లు

  సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లారు. కానీ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయిన వెంటనే అందరికీ సినిమా అర్ధం అయిపోతుంది. కానీ అసలు ట్విస్టు చివర్లోనే రివీల్ చేశాడు మేకర్స్. విరూపాక్ష అసలు ఎందుకు కిడ్నాపులు చేస్తున్నాడు? ఒకానొక సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా వచ్చిన విరూపాక్ష డ్రైవర్ గా ఎందుకు మారాడు? ఎవరి కోసం కిడ్నపులు చేస్తున్నాడు? అనుకోని కారణంగా జైలుకు వెళ్లిన విరూపాక్ష కిడ్నాపులు ఎందుకు మొదలు పెట్టాడు? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించారు. విరూపాక్ష కిడ్నాప్ చేస్తే నేరస్తుడిగా చూడల్సిన సమాజం అతన్ని హీరోగా ఎందుకు చూసింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

  దర్శకుడు రత్నబాబుకు ఇది రెండో సినిమా. మోహన్ బాబు లాంటి హీరోతో సినిమా అనుకున్నప్పుడు కథ మరింత బలంగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. సన్ ఆఫ్ ఇండియా ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు వన్ మాన్ షో. కధనాన్ని కూడా మోహన్ బాబు అందించడం గమనార్హం. అయితే ఇది కమర్షియల్ సినిమా కాదు ప్రయోగాత్మక సినిమా అని ముందే చెప్పారు కాబట్టి ఒక ప్రయోగాత్మక సినిమా లాగానే చూడాలి. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం సినిమా ప్రయోగాత్మకంగానే ఉంది. పాత్రల పరిచయం అయినా సరే సినిమా క్లైమాక్స్ వరకు వారి ముఖాలను చూపించకుండా సినిమాను నడిపించడం అనేది ఒక రకంగా కొత్త ప్రయోగం అనే చెప్పాలి. అయితే ఎలాగో ముఖాలు చూపించడం లేదు కదా అని ఆయా పాత్రధారుల స్థానంలో వేరే వారిని నిలబెట్టిన ఫీలింగ్ మాత్రం కలుగుతోంది. టేకింగ్ విషయంగా తన పనితనం చూపించారు డైమండ్ రత్నబాబు.

   నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే

  సినిమా పూర్తిగా మోహన్ బాబు వన్ మ్యాన్ షో. సినిమా మొత్తం అన్నీ తానై నడిపించారు ఆయన. భారీ ఎత్తున నటీనటులను సినిమాలో మోహరించారు కానీ ఎవరి పాత్రకి సరిగ్గా నటించే స్కోప్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. ఆయా పాత్రల ముఖాలను చివరి వరకు చూపించక పోవడంతో వారి డైలాగులు వినిపిస్తూ ఉంటాయి కానీ ముఖాలు కన పడకపోవడంతో నిజంగా వారేనా అని కూడా జనాలకు అనుమానం కలుగుతుంది. కాకపోతే చివరి 20 నిమిషాల పాటు సాగిన సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగింది. దాదాపు అందరూ పాత్రధారులు ముఖాలతో కనిపించడం బాగుంది. సినిమాలోని నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

  టెక్నికల్ విషయానికి వస్తే

  టెక్నికల్ విషయానికి వస్తే

  సినిమా కమర్షియల్ మూవీ కాదు, ఒక ప్రయోగాత్మక సినిమా. సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ పెద్ద అసెట్. ఇళయరాజా సంగీతం ఎప్పటిలానే ఆకట్టుకుంది. కానీ సినిమా మొత్తమ్మీద ఒకపాట మాత్రమే ఉంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ఓటీటీ కట్ కాకుండా మరింత డీటైల్డ్ గా ఉంటే బాగుండేది. అయితే రొటీన్ కథ అయినా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశారు మోహన్ బాబు.

  Recommended Video

  Director Ramana Teja About His Comeback With Kinnerasani Movie | Filmibeat Telugu
  ఫైనల్ గా

  ఫైనల్ గా

  సన్ ఆఫ్ ఇండియా : ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే సినిమా.

  English summary
  Son Of India review : Mohan babu stole the show with performance
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X