For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూడనివాళ్లు ‘లక్కీ’(రివ్యూ)

  By Srikanya
  |

  --జోశ్యుల సూర్య ప్రకాష్

  Rating:
  1.0/5
  నటీనటులు : శ్రీ కాంత్, మేఘనా రాజ్, బ్రహ్మానందం,ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, చిట్టిబాబు, కృష్ణభగవాన్, జయసుధ,,రోజా,సన, హేమ తదితరులు
  సంగీతం : సాయి కార్తీక్
  మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం,
  పాటలు; భాస్కరభట్ల రవికుమార్
  ఎడిటర్: నాగిరెడ్డి
  కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి,
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ వెంకటేష్
  సమర్పణ: జ్యోత్స్నారెడ్డి
  నిర్మాత : రాజ రాజేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి
  రచన, దర్శకత్వం: హరి.


  శ్రీకాంత్ కు వరస ఫ్లాప్ ల ప్రవాహం ఆగేటట్లు కనపడటం లేదు. తన సినిమాలు కేవలం శాటిలైట్ సినిమాలుగా మారిపోతున్నా ఆయన తన కథల ఎంపికలో మార్పు చూపటం లేదు. తాజాగా మరాఠి చిత్రం Aga Bai Arrecha!(2004)కి ప్రీమేక్ గా వచ్చిన చిత్రం 'లక్కీ'ఆయన అభిమానులను మరోసారి కలవలపరిచింది. ఒకప్పుడు తన సినిమాలకు మహరాజ పోషకులగా ఉన్న మహిళలు ప్రస్తుతం టీవీ సీరియల్స్ వద్ద సెటిల్ అయిపోవటంతో తన స్టాటజీ మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయితే ఆయన ఈ మార్పు గమినిస్తున్నట్లు కనపడక పోవటంతో ఆయన చిత్రాలు కేవలం టీవి చిత్రాలుగానే మిగిలిపోతున్నాయి.

  ట్రావెల్ ఏజిన్సీలో పనిచేసే లక్ష్మినారాయణ అలియాస్ లక్కి కి ఆడవాళ్లంటే పడదు. ప్రపంచంలో సమస్యలన్నిటికీ ఆడవాళ్ళు కారణమని,మగవాడి సమస్యలు వారు పట్టించుకోకుండా విసిగిస్తూంటారని ఫిక్సై విరక్తితో బిహేవ్ చేస్తూంటాడు. అయితే అతని లో మార్పు తేవటానికి రాజ రాజేశ్వరి అమ్మవారు పూనుకుంటుంది. అతనికి ఆడవాళ్ళ మనస్సులో ఉన్నది తెలిసిపోయే వరం ఇస్తుంది. అక్కడనుంచి అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి...ఎలా మార్పు వచ్చిందనేది మిగతా కథ.

  నిజానికి ఈ కథ హాలీవుడ్ చిత్రం 'వాట్ వుమెన్ వాంట్' ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే మరాఠి చిత్రం Aga Bai Arrecha! కూడా ఈ చిత్రం గుంచి లిప్ట్ చేసిందే. వాళ్లు ఆ సినిమా కాన్సెప్ట్ ను తీసుకుని దానికి భారతీయత,నేటివిటీ అద్దే ప్రయత్నం చేసారు. ఆ చిత్రాన్ని మనవాళ్లు ఎత్తి తెలుగు వాళ్ళకు అందించే అద్బుత కార్యక్రమం చేపట్టారు. మరాఠీలో కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఎందుకంటే కథ పూర్తిగా బోర్ గా సాగుతుంది. ఇంటర్వెల్ వచ్చేవరకూ అసలు పాయింట్ లోకి వెళ్లదు. ఎంతసేపు..అతనికి ఆడవాళ్లంటే ఎంత ద్వేషమో చూపించటమే సరిపోతుంది. ఇంటర్వెల్ పించ్ వద్ద అతనికి ఆడవాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకునే అతీత శక్తి వస్తుంది. పోనీ అక్కడ నుంచి అయినా కథనం పరుగెడుతుందా అంటే...కొన్ని సీన్స్ మినహా రొట్టకొట్టుడు లాగ ఉంటుంది. క్లైమాక్స్ ని ముగించటాని టెర్రరిస్టు లింక్ ఉంటుంది. ఇలా అడ్డదిడ్డంగా ఎదిగిన కథని కష్టం లేకుండా తీసుకువచ్చి తెలుగులో యాజటీజ్ చేసి చూడమంటే కష్టమే అనిపిస్తుంది.

  ఇక శ్రీకాంత్ లో ఓ గొప్ప విషయం ఉంది. ఆయన నటుడుగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా పర్శనాలిటి,క్రాఫ్ ఉందో ..ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే అప్పటి ఎక్సప్రెషన్స్ నే ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. సినిమా ఏదైనా ఒకేరకం నటనతో లాక్కురావటం లక్కీనే. కొత్త దర్శకుడు హరి మాత్రం కొత్తగా ఈ సినిమాలో చేసిందేమీ లేదు. మరాఠి సినిమాను ఇక్కడ తెలుగుకి అనువదించే ప్రయత్నం చేసారు అంతే. ఆ సినిమానే టెక్నికల్ గా పూర్ గా ఉంటుంది కాబట్టి ఈ దర్శకుడుని ఆ విషయంలో వంక పెట్టలేం. హీరోయిన్ 'బెండు అప్పారావు' సినిమాలో సెకండ్ హీరొయిన్ గా కనిపించిన మేఘనా రాజ్ బాగానే చేసింది. హీరోకు బాస్ గా రోజా టార్చర్ పెట్టే సీన్స్ బాగున్నాయి. ఆ సీన్స్ చూస్తుంటే గోపీచంద్...గోలీమార్ లో రోజా పాత్ర గుర్తుకు వస్తుంది. బ్రహ్మానందం,తాగుబోతు రమేష్ లను కేవలం శాటిలైట్ రైట్స్ రేటు పెంచటానికే తీసుకున్నారని అర్దమవుతుంది. సంగీతం విషయానికి వస్తే...చెప్పుకునేదేమీ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాత అయిన శ్రీనివాస రెడ్డి తను స్వయంగా చేసుకున్న సినిమాటోగ్రఫి బాగుంది. నాగిరెడ్డి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాలి.

  పబ్లిసిటీ సైతం పెద్దగా చేయని ఈ చిత్రం రిలీజైన విషయం చాలా మందికి కూడా తెలియటం పోవటం కొంతలో కొంత లక్కీ. అలాగే కామెడీ అని చెప్పుకున్నా సినిమాలో ఆ లక్షణాలు లేకపోవటంతో ఏ వర్గాన్ని రీచ్ కాలేని పరిస్ధితి ఏర్పడింది. ఫైనల్ గా టీవీ (శాటిలైట్) కోసమే తీసినట్లున్న ఈ చిత్రంలో టీవిల్లో చూస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. శ్రీకాంత్ మాత్రం ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండకపోతే కెరీర్ క్లైమాక్స్ కు దగ్గరపడినట్లే.

  English summary
  Srikanth's Lucky film relesed with Bad talk. The Film is freemake of Aga Bai Arrecha!. It is a Marathi film by director Kedar Shinde loosely based on the Hollywood film What Women Want.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X