For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గౌతం, ఐఎఎస్‌

  By Staff
  |

  Goutham SSC
  -జోశ్యుల సూర్యప్రకాష్‌
  సినిమా: గౌతం, ఎస్‌ఎస్‌సి
  విడుదల తేదీ: 30-12-2005
  నటీనటులు: నవదీప్‌, సింధు తులానీ, మధు శర్మ, భానుప్రియ,
  కె.విశ్వనాధ్‌, నాజర్‌, రవళి, వేణుమాధవ్‌, సునీల్‌, కృష్ణభగవాన్‌,
  ఎమ్మెస్‌ నారాయణ, పృధ్వి, గుండు, సన తదితరులు
  మాటలు: రమేష్‌ గోపి
  పాటలు: సిరివెన్నెల, సిసి రెడ్డి
  ఫోటోగ్రఫీ: జె.శివకుమార్‌
  సంగీతం: అనూప్‌
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పిఎ అరుణ్‌ ప్రసాద్‌
  నిర్మాత: వై. సోనియారెడ్డి
  సమర్పణ: సిసి రెడ్డి (విసు)

  పనికిమాలిన వాడు ప్రయోజకుడిగా ఎదగడం సగటు సినిమా ఫార్ములా. దాన్నిఅనుసరిస్తూ గత హిట్‌ 'తమ్ముడు'ని గుర్తుకు తెస్తూ దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌ తీసిన చిత్రం 'గౌతం, ఎస్‌ఎస్‌సి'. ఇది రొటీన్‌ కథా చిత్రమే అయినా ఇందులోని సెంటిమెంట్‌ ప్రేక్షకులకు పడితే హిట్‌ అయ్యే అవకాశముంది.

  గౌతం (నవదీప్‌) జిల్లా కలెక్టర్‌ (నాజర్‌) మూడో కొడుకు. ఇంట్లో అందరూ ఉన్నత స్ధాయిలో ఉన్నా డిగ్రీలో కూడా డింకీలు కొడుతుంటాడు గౌతం. ఆవారాగా తిరిగే గౌతం అంటే ఇంట్లో తలిదండ్రులతో సహా అందరికీ చిన్న చూపు. కానీ ఎదురింట్లో ఉన్న భాను (భానుప్రియ), పృధ్వి దంపతులు గౌతం మిత్రబృందాన్ని ఆదరిస్తూ ఉంటారు. తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసే అలవాటున్న గౌతం తండ్రిని ఒక స్కాంలో ఇరికిస్తాడు. దానితో తండ్రి అతడిని ఇంటి నుంచి గెంటివేస్తాడు. తమ ఇంటికి ట్యూషన్‌ చెప్పడానికి వచ్చే జానకి (సింధు తులానీ) ఇంట్లో సెటిలవుతాడు గౌతం. తనకు వచ్చిన మెకానిక్‌ పనిచేసుకుంటూ ఐఎఎస్‌ పరీక్షకు ప్రిపేరవుతాడు. మరో వైపు తన కుటుంబానికి వచ్చిన సినిమాటిక్‌ సమస్యలను పరిష్కరించి, తండ్రి ప్రేమను తిరిగి ఎలా చూరగొన్నాడన్నది మిగితా కథ.

  క్లాసిక్‌ నేరేషన్‌ను అనుసరిస్తూ సాగిన ఈ సినిమా కథ 'ఆహా' 'గ్యాంగ్‌ లీడర్‌' వంటి అనేక సినిమా సన్నివేశాలను గుర్తుకు తెస్తుంది. శ్రద్ధ ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్ని అయినా సాధించవచ్చన్న సందేశం సినిమాలో ఉన్నా, హీరోలో ఆ అంకిత భావాన్ని ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. ఇంట్లో అందరూ ఉన్నత స్ధాయిలో ఉన్నా మన హీరో మొదట్లో ఎందుకంత చిల్లరగా మారాడన్న విషయం అర్ధం కాదు. చదువులో వెనుకబడిన కొడుకు మీద తల్లి, తండ్రి అంత కసి పెంచుకోవడం అసహజంగా ఉంది. ఇంటర్వల్‌ తర్వాత క్లెయిమాక్స్‌ లీడ్‌ సరిగా తీసుకోకపోవడంతో ఇబ్బంది కలిగించినా, సీన్లు స్పీడుగా కదలడంతో బోర్‌ అన్పించదు. కామెడీ తక్కువగా ఉన్నా సెంటిమెంట్‌ను పండించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. మధుశర్మ పాత్ర ఎక్స్‌పోజింగ్‌కు తప్ప కథకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మాటలు ఫర్వాలేదు. ఐఎఎస్‌కు ముడిపెట్టకుండా కథను ముగించి ఉంటే బాగుండేది.

  గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more