»   » చెడు పైనే మోజు(‘భలే మంచి రోజు’ రివ్యూ)

చెడు పైనే మోజు(‘భలే మంచి రోజు’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలతో వస్తున్నాంరంటే సినిమా ప్రియులకు ఎప్పుడూ ఆనందమే. వాళ్లు వస్తూంటే.. మాస్ పేరుతో మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాని నవతరం ఐడియాలజీతో నింపేసే మరో రామ్ గోపాల్ వర్మ (తొలి నాటి) లాంటి దర్శకుడు ఉద్బవించబోతున్నారని సంబరపడతాం. అయితే కొత్తదనం పేరుతో విపరీతం చోటు చేసుకుంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. ఈ చిత్రంతో పరిచయమైన ఈ కొత్త దర్శకుడు రెగ్యులర్ సినిమాని దాటాలని, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీయాలని ప్రయత్నించాడు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అయితే పదే పదే శృంగారం కోరుకునే పెళ్లాం..అది చేయలేక జావకారే భర్త వంటి పాత్రలు పెట్టి సినిమాని దిగజార్చాడు. అంతెందుకు సినిమాలో ఎండ్ షాట్స్ .. విలన్ చనిపోతే ...అతని భార్య శృంగార కోరికను చల్లార్చలేక పడిపోయిన ఓ కుర్రాడి కట్ డ్రాయిర్ పై వేసాడు. అయితే ఇలాగే సినిమా అంతా ఉందనుకోవద్దు... సినిమాలో అలరించే సీన్స్ ఉన్నాయి. స్లోగా సాగినా కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ అనిపిస్తాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ప్లేస్ ఆక్యుపై చేస్తున్న పృద్వీ కామెడీ చాలా బాగుంటుంది. కానీ ఆకునిండా ఆహారం పెట్టి ఓ మూల ఉమ్మేసినట్లు ఇలాంటి సీన్స్ వికారం పుట్టిస్తాయి. దానికి తోడు క్లైస్తవ ఫాధర్ పాత్రలో పోసాని...చేసే కామెడీ కూడా అదోరకంగా ఉండి మన సెన్సిబుల్టీస్ ని అపహాస్యం చేస్తూంటుంది.


తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి మాయ (ధన్య బాలకృష్ణ) వేరే వాడితో పెళ్లికి సిద్దపడితే... కోపం తెచ్చుకున్న కుర్రాడు రామ్ (సుధీర్ బాబు) ఆమెకు బుద్ది చెప్దామని బయిలుదేరుతాడు. అయితే అనుకోకుండా ఆ జర్నిలో ఓ యాక్సిడెంట్ జరిగి .. ఏరియా దాదా శక్తి(సాయికుమార్) చేతిలో ఇరుక్కుపోతాడు. రామ్ ని అతని స్నేహితుడు ..కాబోయే బావ ఆది (ప్రవీణ్ ) తన డెన్ కు తెచ్చిన శక్తి రామ్ కి ఓ కండీషన్ పెడతాడు. నీ యాక్సిడెంట్ తో నేను కిడ్నాప్ చేస్తున్న సీత (వామిక గబ్బి) అనే అమ్మాయి తప్పించుకుపోయింది కాబట్టి... ఆ అమ్మాయిని వెతికి తీసుకురా...లేకపోతే మీ స్నేహితుడుని ప్రాణాలు తీస్తా అంటాడు. అక్కడ నుంచి రామ్ ... ఆ అమ్మాయి సీతని వెతకడం మొదలెడతాడు. అందుకోసం ఈశు(వేణు), ఆల్బర్ట్ అనే ఇద్దరు కిడ్నాపర్స్ తో డీల్ పెట్టుకుంటాడు. వాళ్ళ సాయింతో ఆమెను పట్టుకోగలిగాడా... అసలు శక్తి ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు..అసలు వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ట్విస్ట్ లతో సాగే మిగతా కథ.


రొటీన్ ట్రెండ్ లో కొట్టుకుపోకుండా.. కొత్త తరహా, కథ, కథనంతో తొలి చిత్రం ట్రై చేసిన ఈ దర్శక,రచయితకు మొదటగా అభినందనలు తెలియచేయాలి. అయితే డార్క్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ప్రారంభం ఎత్తుగడ బాగుంటుంది. అయితే దర్శకుడు చాలా సీన్స్ ..48 ఫ్రేమ్స్ లో రన్ అయ్యేలా ప్రేమ్ చేసుకోవటంతో తర్వాత నత్తనడక మొదలైంది. అయితే ఇంటర్వెల్ కు వచ్చేసరికి మంచి ట్విస్ట్ తో బాగుందనిపిస్తాడు. కానీ సెకండాఫ్ లో కథ ఆగిపోయి...కామెడీ ట్రాక్ లతో లాగించే పరిస్దితి మొదలైంది. అయితే ఆ కామెడీనే క్లైమాక్స్ లో ఫృద్వీ ద్వారా పేలింది.


ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం కథని సెటప్ చేయటానికే (అంటే హీరో,హీరోయిన్స్ ఎవరు..వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లు ఏంటి...వారికొచ్చిన సమస్య ఏంటి) సరిపోయింది. ఇక సెకండాఫ్ లో హీరోకు వచ్చిన సమస్యనుంచి ఎలా తెలివిగా తప్పించుకుంటాడా అని ఎదురుచూస్తే...ఫృద్వీ పాత్ర వచ్చేదాకా హీరో ఏమీ చేయడు.కేవలం కార్లు ఛేజింగ్, వేరే పాత్రల కామెడీ సరిపోతూంటుంది. ఇలా జరగటానికి కారణం..కేవలం ట్విస్ట్ లనే కథగా రాసుకున్నాడు కానీ..కథని డ్రైవ్ చేసే హీరో ఏం కథలో చేస్తాడు..ఏం చేస్తున్నాడు అనేది ఫెరఫెక్ట్ గా చూసుకోలేదు. చాలా చోట్ల హీరోకు సంభందం లేకుండా రన్ అవుతూంటుంది. ఆ రాసుకున్న ట్విస్ట్ చాలా భాగం రెగ్యులర్ సినిమా ప్రేక్షకుడు ఊహించగలిగేవే. దాంతో సెకండాఫ్ సహనం చంపేస్తుంది..క్లైమాక్స్ లో మాత్రమే ఓకే అనిపిస్తుంది.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


హైలెట్స్

హైలెట్స్

సినిమా హైలెట్స్ లో డైలాగ్స్ ప్రధానం. 'తిరిగే భూమి ఆగిపోయినా, గన్ లో నుంచి బులెట్ వచ్చినా జీవితాలు తలకిందులైపోతాయి' వంటి డైలాగులు, క్లైమాక్స్ లో సాయి కుమార్ చెప్పే డైలాగులు బాగున్నాయి. బోల్డు ఉన్నాయి.


హై బీపీ

హై బీపీ

ఈ సినిమాలో హీరోకు హై బీపీ కంప్లైంట్ ఉంటుంది. కానీ సుధీర్ బాబు లాంటి యంగ్ హీరో అదీ సిక్స్ ప్యాక్ నీ చూస్తుంటే ఇలాంటి రోగం పెట్టి అస్తమానం పడేయకుండా ఉంటే బాగుండేది...కథకు కూడా పెద్దగా ఉపయోగపడినట్లు కనపడదు.


పెద్ద డ్రా బ్లాక్

పెద్ద డ్రా బ్లాక్

అసలే సినిమా స్లోగా వెళ్తోందిరా దేముడా అనుకుంటే మధ్యలో పాటలు ఒకటి ఇంకా స్లో చేసేసి విసిగిస్తూంటాయి. ఆకట్టుకునేలా ఆ పాటలు ఉండవు.ముఖ్యంగా సెకండాఫ్ జబర్దస్త్ వేణు, శ్రీరామ్ ల మద్య వచ్చే పాట అయితే పారిపోవాలనిపిస్తుంది. నేపధ్య సంగీతం బాగున్నా..చాలా చోట్ల డైలాగులు వినపడనీయలేదు


అదరకొట్టాడు

అదరకొట్టాడు

పృధ్వీ ఇప్పుడు తెరపై స్టార్ కమిడయన్. ఈ సినిమా క్లైమాక్స్ లోనూ తన ఒంటిచేత్తో నిలబెట్టాడనే చెప్పాలి. పోసాని ఓకే. జబర్దస్త్ వేణు, అతని సోదరుడుగా చేసిన శ్రీరామ్ అక్కడక్కడా నవ్వించారు.


టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. అన్ని టెక్నికల్ డిపార్టమెంట్ లు ఈ చిన్న సినిమాని పెద్దదిగా చేయటానికే ప్రయత్నించాయి. దర్శకుడుకు టెక్నికల్ గా మంచి టీమ్ ను ఎన్నుకోవటం కలిసి వచ్చింది. కెమెరా వర్క్ సూపర్బ్ అనే చెప్పాలి. ఎడిటింగ్ విషయానికి దర్శకుడు తన సినిమాపై కాస్త మమకారం చంపుకుని ఉంటే...సెకండాఫ్ కాస్త స్పీడ్ చేసి ఉంటే బాగుండేది.


దర్శకుడుగా

దర్శకుడుగా

ఈ చిత్రం ద్వారా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య...స్క్రిప్టు అంటే కేవలం ట్విస్ట్ లు మాత్రమే అనుకుని కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగుండేది. కొత్త, పాత అనే తేడాలేకుండా నటీనటులు ద్వారా మంచి నటన రాబట్టాడు. మిగతా విభాగాల నుంచి కూడా మంచి అవుట్ పుట్ లాగాడు. అయితే సినిమాని తెలుగులో..సాగతీస్తూ లాగకూడదు...పరుగెత్తించాలి అనేదొక్కటి అర్దం చేసుకుంటే మంచి దర్శకుడు దొరికినట్లే.


నిర్మాణ విలువలు, హీరో ,హీరోయిన్స్

నిర్మాణ విలువలు, హీరో ,హీరోయిన్స్

చిన్న బడ్జెట్ అయినా తెరపై అది కనపడనీయకుండా నీట్ గా ఉండేలా నిర్మాణ విలువలు ఉన్నాయి. హీరోగా సుధీర్ బాబు..కొత్తగా చేసిందేమీలేదు. క్యారక్టర్ కు,సీన్స్ కు కొంచెం కూడా సంభంధం లేకుండా పదే పదే తన బాడీ ప్రదర్శన ని తగ్గిస్తే బాగుంటుంది. హీరోయిన్స్ లో చేయటానికి పెద్దగా ఏమీలేదు..కాబట్టి చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదు.


ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్ :70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు:సుధీర్‌బాబు, వామిఖ గబ్బి, సాయికుమార్, పోసాని, చైతన్య కృష్ణ, పరుచూరి గోపాల కృష్ణ, జబర్దస్త్ వేణు తదితరులు.
కెమెరా: శ్యామ్‌దత్,
సంగీతం: సన్నీ ఎం.ఆర్,
ఆర్ట్: రామకృష్ణ,
మాటలు: అర్జున్, కార్తీక్,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
నిర్మాతలు: విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి,
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.
విడుదల తేదీ: 25-12-2015ఈ మధ్యకాలంలో ఈ చిత్రం ట్రైలర్ క్రియేట్ చేసినంత ఉత్సుకత ఏ సినిమా క్రియేట్ చేయలేదేమో. అయితే ట్రైలర్ లో ఉన్నంత స్పీడు సినిమాలో కూడా ఉండి ఉంటే బాగుండేది. సౌఖ్యం లాంటి పరమ రొటీన్ సినిమా చూసి వెంటనే వెళితే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Sudheer Babu's “Bhale Manchi Roju” released today with divide talk. 'Bhale manchi roju' directed by Sriram Adittya.T and produced by Vijay kumar reddy and Shashidhar reddy under 70MM entertainments , it stars Sudheer Babu, Wamiqa Gabbi, Dhanya Balakrishna, Saikumar in major roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu